మ్యాక్ బుక్ లో తెలుగు టైపు చేయడం

వీవెన్ గారు ఐఫోనులో తెలుగు టైపుటెట్లు? అనే టపా రాసి దానికి పోటీగా నన్ను మ్యాకులో తెలుగులో టైపు చేయడం గురించి రాయమన్నారు. గత ఒకటిన్నరేళ్ళుగా ఆఫీసు వాళ్ళిచ్చిన మ్యాక్ బుక్ వాడుతున్నాను. అందులో ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు ఉంది. దాన్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలో చూద్దాం.

 • ముందుగా తెర అడుగున ఉన్న System Preferences మీద నొక్కండి.

screenshot-2017-02-01-10-17-12

 • Keyboard ఐకాన్ నొక్కండి.

screenshot-2017-02-01-10-17-56

 • Input Sources అనే ట్యాబ్ కి వెళ్ళి, తెలుగు కీబోర్డు చేర్చడానికి ఎడమవైపు జాబితా కింద ఉన్న + బటన్ నొక్కండి. దాని పక్కనే ఉన్న Show Input menu in menu bar అనే చెక్ బాక్సును చెక్ చేసి ఉంచండి.

screenshot-2017-02-01-10-18-37

 • తెలుగు కోసం వెతికి Telugu – QWERTY ఎంచుకుని Add బటన్ నొక్కండి.

screenshot-2017-02-01-10-36-49

 • తెలుగులో టైపు చేయాలనుకుంటే మెను బార్ లో ఉన్న తెలుగు కీబోర్డును ఎంచుకుని తెలుగులో టైపు చేయడం ప్రారంభించండి. ఇంగ్లీషు కీబోర్డు కావాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు.

screenshot-2017-02-01-10-19-00

పైన నేను పేర్కొన్న విధానం ఇన్ స్క్రిప్టు లో టైపు చేయడానికి. మొదట్లో ట్రాన్స్‌లిటరేషన్ కు అలవాటు పడ్డ నాకు మొదట్లో ఇది కొత్తగా అనిపించింది. కానీ అలవాటు పడే కొద్దీ తక్కువ కీ స్ట్రోకులతో టైపు చెయ్యవచ్చని తెలిసింది. అంతే కాకుండా ఈ కీబోర్డుకు అలవాటు పడితే మీరు సిస్టమ్ మార్చినా కూడా ప్రత్యేకంగా ఏ సాఫ్టువేరు ఇన్‌స్టాల్ చేయనక్కర లేదు. ఉన్న కీబోర్డును ఎనేబుల్ చేసుకుంటే చాలు.

7 thoughts on “మ్యాక్ బుక్ లో తెలుగు టైపు చేయడం

  • వినయ్ కుమార్ గారూ, మీరు నేను టపాలో పేర్కొన్న లేఖిని ఇన్ స్క్రిప్టు కీబోర్డు (లంకె ఇది http://lekhini.org/inscript/) గమనించండి. అందులో సాధన చేస్తే కీబోర్డులో ఏయే తెలుగు అక్షరానికి జతపరచబడి ఉంటుందో తెలుస్తుంది. మీకు అది కష్టంగా అనిపిస్తే ట్రాన్స్ లిటరేషన్ (అంటే తెలుగు పదాలను ఆంగ్ల స్పెల్లింగుల్లో రాయడం) ద్వారా తెలుగు టైపింగు చేయవచ్చు. లంకె ఇది http://lekhini.org. ఇంకా ఏదైనా అనుమానాలుంటే అడగండి.

   • ధన్యవాదములు రవిచంద్ర గారు. నేను ఎప్పుడూ లేఖిని నే వాడుతాను. మ్యాక్ లో వ్రాయడం కష్టం గా ఉంది. తెలుగు keyboard తో రాయగలుగుతున్నాను using inscript mapping, కాని telugu-qwerty తో కష్టం గానే ఉంది.

 1. ట్రాన్స్‌లిటరేషన్ పద్ధతిలో మ్యాకింటోషులో తెలుగు టైపుచెయ్యడానికి లిపిక IME ఉందని ట్విట్టర్లో revendra నాకు తెలియజేసాడు. ఆసక్తి గలవారు ప్రయత్నించి చూడండి.

వ్యాఖ్యలను మూసివేసారు.