నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు

మిత్రులందరికీ శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో మీకు అన్నీ శుభాలే కలుగుతాయని గ్యారంటీ ఇవ్వలేను కానీ, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగల శక్తిని మీకు ఆ దేవుడు ప్రసాదించాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను. 🙂

శుభం భూయాత్!

ఈ-తెలుగు స్టాల్ కొసమెరుపులు

e-తెలుగు బృందం
e-తెలుగు బృందం

నిన్నటితో హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ముగిసింది.దాంతో పాటూ e-తెలుగు స్టాల్ కూడా. చివర్లో మేం చేసిన సందడి గురించి చెప్పకపోతే కొన్ని మధుర క్షణాలు కోల్పోయినట్లే. గతేడాది పద్మనాభం గారు మొదలు పెట్టిన సాంప్రదాయం ఈ సారీ కొనసాగించాం. స్టాల్ తెర మూసేసి లోపల గా……………..ట్టిగా జాతీయ గీతాన్ని ఆలపించాం. అలాగే స్టాల్ నిర్వహణలో సహకరించిన అందరికీ గా……….ట్టిగా ఓయేసుకున్నాం.

అంతటితో ఆగకుండా ప్రదర్శన బయటకు వచ్చి టీమిండియా విజయోత్సవం లాగా అందరం చేతులమీద చేతులేసుకుని గుంపుగూడి గా…ట్టిగా మా తెలుగు తల్లికి గీతాన్ని ఆలపించాం. మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మమ్మల్ని ఆసక్తిగా గమనించడం కనిపించింది. మొత్తమ్మీద గత ఏడాది కన్నా ఈసారి ఎక్కువ మంది ప్రజల్లోకి వెళ్ళగలిగినందుకు అందరూ సంతృప్తి చెందారు.

ఎంత మంది మిత్రులో…

నాకు ఉద్యోగం వచ్చినపుడు, నా నియామక పత్రంలో  బెంగుళూరులో చేరతారా? హైదరాబాద్ లో చేరతారా? అని అడిగారు. బెంగుళూరులో ఎంత మంది బంధువులున్నా నేను భాగ్యనగరాన్నే ఎంచుకున్నాను. ఎందుకంటే ఇక్కడైతే బాగా తెలుగు వినొచ్చు, మాట్లాడచ్చని నా ఆశ. చిన్ననాటి మిత్రులు, బంధువులు అందరూ బెంగుళూరులోనే ఉండటం వల్లా, మా స్వస్థలం శ్రీకాళహస్తి నుంచి బెంగుళూరు కేవలం ఆరుగంటల ప్రయాణమవడం మూలాన  మా ఇంట్లో వాళ్ళంతా అక్కడికే వెళ్ళమన్నారు. నేను మాత్రం అవన్నీ కాదని హైదరాబాద్ కే వచ్చేశాను.

ఒక సంవత్సరం దాకా నిస్తేజంగా గడిచిన నా జీవితంలోకి ఆరునెలల క్రితం బ్లాగు ప్రవేశించింది. తద్వారా బ్లాగర్లతో కలిగిన పరిచయాలు, వారి ద్వారా ఈ-తెలుగు పరిచయం, పుస్తక ప్రదర్శన ద్వారా వందల మందికి స్వయంగా కంప్యూటర్లలో తెలుగును స్వయంగా పరిచయం చేయడం, ఇదే ప్రదర్శనలో నేను ఇప్పటి దాకా టీవీలో మాత్రమే చూసిన కొంతమంది ప్రముఖులను, రచయితలను, రచయిత్రులను, విలేఖరులను స్వయంగా కలవడం అంతా కలలా జరిగిపోయింది. ప్రదర్శనకు వచ్చి మేము చెప్పే విషయాలు ఆసక్తిగా విన్న చాలా మంది అభిమానం, ఉత్సాహం, గౌరవం, భవిష్యత్ కార్యాచరణకు కావల్సిన బోలెడంత శక్తి నిచ్చింది. ఇప్పుడు నాకు హైదరాబాద్ లో నాకు బోలెడు మంది స్నేహితులున్నారు. అంతే కాదు నా బ్లాగుకు క్రమం తప్పకుండా వచ్చి చదివి తమ అభిప్రాయాలు వ్యక్తపరిచేవారు చాలా మంది మిత్రులయ్యారు. నేనో కొత్త ప్రపంచంలోకి ప్రవేశించడానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.


ప్రముఖులతో కళకళ లాడిన ఈ-తెలుగు స్టాల్

నిజానికి నేను ఈ వారాంతం మా ఊరు వెళ్ళవలసింది. గురువారం బంద్ కారణంగా బస్సులు నిలిపివేయడంతో ఇక్కడే ఉండి పోవలసి వచ్చింది. నేను ఈ ముడు రోజులు ఈ-తెలుగు స్టాల్ లో వాలంటీర్ గా పనిచేయడం భగవత్సంకల్పం కాబోలు.

ఈ రోజు స్టాల్ ను సందర్శించిన వారిలో ప్రముఖ పాటల రచయిత, జాతీయ పురస్కారం గ్రహీత సుద్దాల అశోక్ తేజ గారు, ప్రముఖ రచయిత, మెజీషియన్, వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరాం గారు, శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారు ముఖ్యులు. వీరు స్వయంగా ఈ-తెలుగు స్టాల్ ను సందర్శించి కంప్యూటర్లలో తెలుగు వాడకాన్ని ఆసక్తిగా తిలకించారు. సుద్దాల అశోక్ తేజ గారు తాను పుస్తక ప్రదర్శనకు వచ్చి ఒక విలువైన విషయాన్ని తెలుసుకొన్నాననీ, “అంతర్జాలంలో తెలుగు నన్ను ఇంద్రజాలం చేసింది” అని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే మండలి బుద్ధ ప్రసాద్ గారు  ప్రభుత్వం తరపున ఈ-తెలుగుకు కావల్సిన సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. బీవీ పట్టాభిరాం గారు కూడా తమ ఫోన్ నంబర్ ఇచ్చి స్వయంగా ఆఫీసుకు వచ్చి కలవ మన్నారు. ఇంకా ఎందరో సందర్శకులు స్టాల్ ను సందర్శించినందకును తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అధ్యాపకులు, రచయితలు, విలేఖర్లు ఇలా అనేక రంగాలకు చెందిన వ్యక్తులు స్టాలును నిర్వహిస్తున్న వారికి తమ అభినందనలు తెలియజేశారు.

ప్రముఖ రచయిత బీవీ పట్టాభిరాం గారు
ప్రముఖ రచయిత బీవీ పట్టాభిరాం గారు

స్టాల్ ను సందర్శించిన సుద్దాల అశోక్ తేజ గారు
నేను, అశోక్ తేజ గారు, సతీష్ గారు, "మంచి పుస్తకం" స్టాలు నడుపుతున్న ప్రసాద్ గారు
నేను, అశోక్ తేజ గారు, సతీష్ గారు, "మంచి పుస్తకం" స్టాలు నడుపుతున్న ప్రసాద్ గారు
శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారు
శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారు

వీళ్ళు రాజకీయ నాయకులు కాదు

వీళ్ళు రాజకీయ నాయకులు కాదు
రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు
రాష్ట్రాన్ని అంధకారంలోని నెట్టేయడానికి కంకణం కట్టుకున్న శని గ్రహాలు
ప్రజల్ని పట్టి పీడిస్తున్న పిశాచాలు
మాయ మాటలతో ప్రజల్ని బురిడీ కొట్టించే క్షుద్ర మాంత్రికులు
వీళ్ళ మాటలు నమ్మొద్దు
రాష్ట్రాన్ని మరో సంక్షోభానికి గురిచేయొద్దు.

గమనిక: ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీని ఉద్దేశించి చేసినది కాదు. ప్రజల్లో విద్వేషాల్ని రెచ్చగొట్టాలని చూసే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికీ వర్తిస్తుంది.

ఇది మీకు భావ్యమా?

తెలంగాణా విషయమై కొద్ది సేపటి క్రితం కేంద్ర హోం మత్రి చిదంబరం చేసిన ప్రకటన అందరూ స్వాగతించాల్సింది. కేసీయార్ నిరాహార దీక్ష దరిమిలా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిదో తేదీన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి ప్రక్రియ మొదలుపెడతాం అనే ప్రకటన వినగానే స్వంత పార్టీలోనే కాక అన్ని ప్రధాన పార్టీల్లోనూ అసంతృప్తి బయటపడిన మాట మనకందరకూ తెలిసిన విషయమే. ఈనెల ఏడవతేదీన జరిగిన రాష్ట్ర అఖిల పక్ష సమావేశంలో స్వార్థ రాజకీయాలకోసం అన్ని పార్టీలు వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకోకుండా మీరు తీర్మానం ప్రవేశ పెడితే మేం  మద్ధతిస్తాం అనేశాయి.

అందరి అభిప్రాయాలూ పరిగణన లోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్ష నాయకులు గగ్గోలు పెట్టిన తతంగం రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించారు. అలాంటిది ఇప్పుడు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ముందుకు వెళతామని కేంద్రం ప్రకటిస్తే కొద్ది మంది నాయకులకు ఎందుకు రుచించడం లేదు? అసలు చర్చలంటే వీళ్ళకి భయమెందుకు?

ఓ పక్క కేసీఆర్ లాంటి నాయకులు కూడా తెలంగాణా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేయొద్దనీ, సమస్యను రాజకీయంగా ఎదుర్కొంటామని ప్రకటిస్తుంటే, కాంగ్రెస్ తెలంగాణా విషయంలో మోసం చేసిందనడం నాగం జనార్ధన్ రెడ్డి లాంటి నాయకులకు ఎంతవరకు సబబు? ఇంకా ఎంతమంది అమాయకులను బలి చేస్తారు? అసలు వీళ్ళది నాలుకా? తాడిమట్టా? ఓ పక్క రాష్ట్రమంతటా అశాంతితో రగిలిపోతుంటే శాంతిని నెలకొల్పాలని కేంద్ర చేసిన ప్రకటనను అర్థం చేసుకుని ప్రజల్లో ఉన్న అనుమానాల్ని పోగొట్టాల్సింది పోయి ఇలా ప్రజలను రెచ్చగొట్టడం భావ్యమా?

కేసీఆర్ కారుకూతలు

ఇటీవల సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాల గురించి కేసీఆర్ మీడియాతో అన్న మాటలు.

“ఈ ఉద్యమాలన్నీ స్పాన్సర్డ్ ఉద్యమాలు. వీటిని డబ్బులిచ్చి చేయిస్తున్నారు. సెల్ టవర్ ఎక్కితే పదివేలు. కిరోసిన్ ఒంటి మీద పోసుకుంటే పదిహేను వేలు. బస్సు అద్దాలు పగల గొడితే ఇరవై వేలు..” ఇలా ఒక జాబితా వెనకేసుకొచ్చాడు.

కేసీఆర్? తెలంగాణా ఉద్యమ కారులకు నువ్వు ఇదే రేట్లు చెల్లించావా?

ఉద్యమం ప్రజల సొత్తు. కడుపు మండితే, గుండె రగిలితే ఉద్యమాలు చేస్తారు. నీ లాంటి నీచ రాజకీయ నాయకుల పైసలకాశపడి ఎవరూ ఉద్యమాలు చేయరు.   ఉద్యమ కారుల్ని అవమాన పరచద్దు. తెలంగాణా కోసం నిజమైన  ఉద్యమం చేసిన ఎవరైనా కేసీఆర్ పైన చెప్పిన మాటలు సమర్థిస్తే అది ఆత్మ వంచన మాత్రమే.