ఎవర్నీ నమ్మొద్దు.. :-)

ఒక దొంగ ఒక దుకాణంలోని సేఫ్ ని దోచుకోవాలనుకున్నాడు.
దగ్గరకు వెళ్ళేసరికి దాని తలుపుపైన
“దయచేసి తలుపును ఊడదీయడానికి డైనమైట్లు లాంటి వాటిని వాడే పనులు పెట్టుకోవద్దు. తలుపు తెరిచే ఉంది. హ్యాండిల్ ని తిప్పండి చాలు. తెరుచుకుంటుంది”.
దొంగ అలానే తిప్పాడు
అంతే!! వెంటనే ఒకె పెద్ద ఇసుక బస్తా వచ్చి నడ్డి మీద పడింది. ఆ ప్రదేశమంతా ఫ్లడ్‌లైట్ల వెలుగుతో నిండిపోయింది. కుయ్ కుయ్ మంటూ అలారం మోగసాగింది.
ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు దొంగకి.
పోలీసులు అతన్ని స్ట్రెచర్ పై తీసుకువెళుతుండగా అతను ఏదో సన్నగా మూలుగుతున్నాడు
“మనుషులపై నాకున్న నమ్మకం దారుణంగా దెబ్బతింది” 🙂

నీకెంత? నాకెంత?

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రాంగణంలో ఒక చోట కంచెను మరమ్మత్తు చేయడానికి టెండర్లను ఆహ్వానించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చివరికి ముగ్గురిని ఎంపిక చేశారు. ఒకరు బంగ్లాదేశ్, మరొకరు చైనా, మూడో వ్యక్తి భారతదేశానికి చెందిన వాడు.

ముగ్గురూ వైట్‌హౌస్ అధికార ప్రతినిథితో కలిసి కంచెను పరీక్షించడానికి వెళ్ళారు. బంగ్లాదేశీయుడు బ్యాగ్ లోఉన్న టేప్ తీసుకుని స్థలాన్ని, కొలిచి కొన్ని లెక్కలు వేసి చివరికి 900 డాలర్లు ఖర్చవుతుందని తేల్చాడు. 400 డాలర్లు సామగ్రికి, 400 డాలర్లు  పనివాళ్ళకు, 100 డాలర్లు  అతనికి లాభం.

తరువాత చైనీయుడి వంతు వచ్చింది. అతను కూడా ఏవో కొన్ని లెక్కలు వేసి 700 డాలర్లు లెక్క తేల్చాడు. 300డాలర్లు సామాగ్రికి, 300 పనివాళ్ళకు, 100 డాలర్లు లాభం.

చివరగా భారతీయుడి వంతు వచ్చింది. కొలతలు వేసే కార్యక్రమాలేమీ పెట్టుకోకుండా అధికార ప్రతినిథిని దగ్గరగా పిలిచి చెవిలో “2700 డాలర్లవుతుంది” అన్నాడు.

“నువ్వు వాళ్ళలాగా కనీసం కొలత కూడా వేయలేదు. అంత పెద్ద సంఖ్య ఎలా చెప్పావు?”

“1000 డాలర్లు నీకు , 1000 డాలర్లు నాకు, ఆ చైనా వాణ్ణి మనం పనిలో పెట్టుకుందాం. ఏమంటావ్?”

“Done”.

శిక్ష తప్పించుకోవడం ఎలా?

ఒక భారతీయుడు, ఒక అమెరికన్, ఒక పాకిస్థానీయుడు సౌదీ అరేబియాకు చెందిన విమానంలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. వారు చేసిన నేరానికి శిక్షగా ఒక్కొక్కరికీ 20 కొరడా దెబ్బలు శిక్ష విధించారు అధికారులు. వారు ముగ్గురూ శిక్షకు సిద్ధపడుతుండగా శిక్షను అమలుపరిచే షేక్ వచ్చి ఇలా ప్రకటించాడు. “ఇవాళ నా ప్రియమైన మొదటి భార్య పుట్టిన రోజు. కాబట్టి మీకు శిక్ష విధించబేయే ముందుగా మిమ్మల్ని ఒక కోరిక కోరుకోమంది” అన్నాడు

మొదటగా అమెరికన్ వంతు వచ్చింది. అతను కొద్ది సేపు ఆలోచించి  తన వీపుకు ఒక దిండును కట్టమన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అది పది దెబ్బలకే చినిగిపోయింది. మిగతా పది దెబ్బలూ భరించే సరికి రక్తం కారే గాయాలైపోయాయి.

తరువాత పాకిస్థానీ వంతు వచ్చింది. తనకు రెండు దిండ్లు కట్టమన్నాడు. అతని దురదృష్టం కొద్దీ అది పదిహేను దెబ్బలకే తట్టుకోగలిగింది. తరువాత భారతీయుడి వంతు వచ్చింది. అతను ఏమీ అనకముందే షేక్ “నువ్వు మంచి సంస్కృతి గల దేశం నుంచి వచ్చావు. మీ దేశం అంటే నాకు ఎంతో ఇష్టం. కాబట్టి నువ్వు రెండు కోరికలు కోరుకోవచ్చు” అన్నాడు.

“మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. నా మొదటి కోరిక ఏంటంటే నాకు ఇరవై కాదు నూరు కొరడా దెబ్బలు కావాలి”

“చూస్తుంటే నువ్వు మంచి ధైర్యవంతుడిలాగా కనిపిస్తున్నావు. సరే నీ రెండో కోరిక ఏమిటి?”

“ఆ పాకిస్థాన్ వాణ్ణి నా వెనక కట్టేయండి.” 🙂

పందెం

ఒక సర్దార్జీ, అమెరికన్ విమానంలో పక్క పక్కనే కూర్చున్నారు. అమెరికన్ కు బోర్ కొట్టి సర్దార్జీ తో “సరదాగా ఏదైనా ఆట ఆడదామా?” అన్నాడు. సర్దార్జీ అలసిపోయి ఉండటం చేత మర్యాదగా తిరస్కరించి చిన్న కునుకు తీయడానికి ఉపక్రమించాడు. అయినా అమెరికన్ వదిలిపెట్టకుండా “ఈ గేమ్ చాలా సులభం. చాలా సరాదాగా కూడా ఉంటుంది.” అన్నాడు

“ఈ ఆట ఏంటంటే నేనొక ప్రశ్న అడుగుతాను. నువ్వు జవాబు చెప్పలేకపోతే నాకు ఐదు డాలర్లు ఇవ్వాలి. అలాగే నీ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేకపోతే నేను నీకు ఐదు డాలర్లు ఇస్తాను”

సర్దార్జీకి పెద్దగా ఆసక్తిగా అనిపించలేదు. వద్దని చెప్పి మళ్ళీ కునుకుతీయబోయాడు.

అయినా సరే అమెరికన్ పట్టు విడవలేదు. “సరే అయితే నువ్వడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోతే 500డాలర్లు ఇస్తాను. నేనడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేక పోతే జస్ట్ ఐదు డాలర్లు ఇవ్వు చాలు” అన్నాడు.

అప్పుడు సర్దార్జీ ఇదేదో బావుందే అనుకుని ప్రశ్న అడగమన్నాడు.

అమెరికన్ ఇలా అడిగాడు “భూమికీ చంద్రుడికి మద్య దూరం ఎంత?” అని అడిగాడు.

సర్దార్జీ నెమ్మదిగా తన జేబులోంచి ఐదు డాలర్ల నోటు తీసి అమెరికన్ కి ఇచ్చేశాడు.

“ఓకే అయితే ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్న అడగాలి అన్నాడు.”

సర్దార్జీ కొంచెం సేపు ఆలోచించి “కొండను ఎక్కేటపుడు మూడు కాళ్ళతో కొండను దిగేటప్పుడు నాలుగు కాళ్ళతో వచ్చేది ఏది?” అని అడిగాడు. అమెరికన్ చాలా సేపు ఆలోచించాడు సమాధానం దొరకలేదు. తన ల్యాప్‌టాప్ తెరెచి గూగుల్ లో సర్చ్ చేశాడు. లాభం లేదు.

చివరికి సర్దార్జీ దగ్గరికి వచ్చి ఓటమిని ఒప్పుకొని ఐదు వందల డాలర్ల నోటును ఇచ్చేశాడు.

దాన్ని తీసుకుని సర్దార్జీ మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు. అమెరికన్ కు మాత్రం మనసు కుదుట పడలేదు. సర్దార్జీని నిద్రలేపి “ఇంతకీ ఆ ప్రశ్నకు జవాబేంటీ?” అని అడీగాడు.

సర్దార్జీ నెమ్మదిగా జేబులో చెయ్యి పెట్టి ఐదు డాలర్ల నోటును అమెరికన్ కు ఇచ్చి మళ్ళీ నిద్ర లోకి జారుకున్నాడు.

తుది పలుకులు

పున్నారావు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నాడు. బంధువులంతా చుట్టూ చేరారు. పక్కనే ఉన్న స్నేహితుడికి సైగ చేసి ఒక పెన్నూ పేపర్ తెమ్మన్నాడు. సరే ఏదో చివరి కోరిక నోటితో చెప్పలేక రాసి చూపిస్తాడని తెచ్చి ఇచ్చారు. అతి కష్టమ్మీద రెండు వాక్యాలు రాసి ప్రాణాలు విడిచాడు పున్నారావు.
సరే చనిపోయిన వెంటనే దాన్ని చదవడం ఎందుకని మడిచి జేబులో పెట్టుకున్నాడా స్నేహితుడు. దహన కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇంటికొచ్చి అందులో ఏం రాశాడో చదవాలని కుతూహలం కలిగింది. మడత విప్పి చూశాడు. అందులో
“నా తల దగ్గర కూర్చున్నాయన నా ఆక్సిజన్ ట్యూబ్ పై కూర్చున్నాడు. నాకు ఊపిరి ఆడటం లేదు” అని రాసి ఉంది.

దున్నేదెవరు?

అమెరికా లో ఒక ముసలాయన ఒంటరిగా నివసిస్తుండే వాడు. ఆయన కుమారుడు హత్యా నేరం కింద జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయన పొలంలో బంగాళాదుంపలు సాగు చేయాలంటే బాగా దున్నాలి. పాపం దున్నాలంటే సాయం అవసరమైంది. దాంతో జైల్లో ఉన్న కొడుక్కి ఒక ఉత్తరం రాశాడు. దాని సారాంశం

బాబూ!
ఈ సంవత్సరం నువ్వు లేకపోవడంతో నేను పొలం సాగుచెయ్యలేక పోతున్నాను. వయసై పోవడంతో పొలం దున్నలేకున్నాను.నువ్వుంటే బావుండేది.అంతా పని నువ్వే చూసుకునేవాడివి.

ప్రేమతో
మీ నాన్న

దానికి అటువైపు నుండి ఈ విధంగా సమాధానం వచ్చింది.
“నాన్నా! దయచేసి ఆ భూమిని మాత్రం దున్నకండి ఎందుకంటే నేను చంపిన శవాలన్నీ అక్కడే పూడ్చిపెట్టాను” అని
మరుసటి రోజు తెలవారక ముందే ఎఫ్‌బీఇ వాళ్ళు ఒక పటాలం దిగి పొలాన్నంతా పలుగు, పారలతో తవ్వి పడేశారు. ఏమీ కనిపించకపోవడంతో పెద్దాయనకి క్షమాపణలు చెప్పి వెళ్ళిపోయారు.

ఎవరు చంపగలరు?

అమెరికన్ సీక్రెట్ సర్వీస్ సంస్థ సీఐఏ కిరాయి హంతకుల అవసరం పడింది. అన్ని పరీక్షలు నిర్వహించి  ముగ్గుర్ని చివరి పరీక్ష కోసం ఎంపిక చేశారు. వారిలో ఇద్దరు మగవాళ్ళు. ఒక ఆడమనిషి. ఈ పరీక్ష కోసం ముగ్గుర్నీ పెద్ద ఇనుప తలుపు కలిగిన ఒక గది దగ్గరకు తీసుకెళ్ళారు.

ఆ ఆఫీసర్ ఇలా అన్నాడు. మేము మీకిచ్చే ఆజ్ఞలను ఎట్టి పరిస్థితుల్లోనూ తు.చ తప్పకుండా పాటిస్తున్నారా ?లేదా? అని తెలుసుకోవడానికే ఈ పరీక్ష.

ఆఫీసర్ మొదటి అభ్యర్థికి ఒక గన్ను చేతికిచ్చి “లోపల నీ భార్య ఉంది. ఆమెను నువ్వు ఈ గన్ తో కాల్చి చంపాలి.” అన్నాడు.

“జోకులొద్దు. ఎవరైనా వాళ్ళ భార్యను చేతులారా చంపుకుంటారా?” అడిగాడు.

“అయితే నువ్వు మాకు పనికి రావు వెళ్ళిపోవచ్చు” అన్నాడు.

రెండో అభ్యర్థికి కూడా అదే విధంగా గన్ను చేతికిచ్చి లోపల ఉన్న తన భార్యను చంపమన్నాడు. అతను లోపలికి వెళ్ళాడు. ఐదు నిమిషాలపాటు ఎటువంటి శబ్దమూ లేదు. ఆ తరువాత అతను బయటకు వచ్చి. “కళ్ళ నిండా నీళ్ళు తిరుగుతుండగా. చంపాలని శతవిధాలా ప్రయత్నించాను. నా వల్ల కాలేదు” అన్నాడు. అతన్ని కూడా బయటకి పంపించేశారు.

చివరిగా మహిళామణి వంతు వచ్చింది. ఆమె చేతికి గన్నిచ్చి లోపల ఉన్న భర్తను చంపమన్నారు. లోపలికి వెళ్ళింది. షాట్స్ వినపడ్డాయి. అరుపులు, కేకలు, “దభీ దభీ మనే చప్పుళ్ళు లోపల్నుంచి వినిపించాయి. కొద్దిసేపటికి అంతా సద్దుమణిగింది. ఆమె నెమ్మదిగా బయటకు వచ్చింది.

నెమ్మదిగా నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ “నాన్సెన్స్ గన్నులో తుటాల్లేకుండా చేశారు. గోడకేసి బాది, కుర్చీతో కొట్టి చంపాల్సి వచ్చింది” అంది.

Note: No offense to anybody. this is purely for fun 🙂