జ్ఞానజ్యోతి

జెన్ కథలు చదివేందుకు చిన్నవిగా ఉన్నా అనేక జీవిత సత్యాలను బోధిస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమవుతాయి. ఉదాహరణకి ఈ క్రింది కథ చదవండి.
******************
ఒకానొక కాలంలో జపాన్ దేశంలో ఒక అంధుడు ఒక రాత్రి సమయాన తన స్నేహితుడ్ని కలుసుకోవడానికి వెళ్ళాలనుకున్నాడు. అతనికి చుట్టుపక్కల వాళ్ళు ఒక లాంతరు ఇచ్చి పట్టుకెళ్ళమన్నారు.
“నాకు చీకటి, వెలుతురు ఒకటే అయినప్పుడు ఈ లాంతరెందుకు?”
“అయినా ఫర్వాలేదు. నీకు కనిపించకపోయినా ఈ చీకట్లో నీకు ఎదురొచ్చే వాళ్ళకి కనిపించి పక్కకు తప్పుకుంటారు” అన్నారు వాళ్ళు.
సరే అని ఆ లాంతరు తీసుకుని బయలుదేరాడు. చాలా దూరం నడిచాక ఓ వ్యక్తి వచ్చి అంధుణ్ణి ఢీకొనబోయాడు.
“ఎక్కడికి మీద పడబోతున్నావు. నా చేతిలో లాంతరు కనిపించడం లేదా?”
“మీ చేతిలో లాంతరు వెలగడం లేదు.”
*****************
ఇదీ కథ. ఇందులో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఏదైనా పొరబాటు జరిగినపుడు సరాసరి ఎదుటి వారి మీద నిందలు వేయకుండా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది అని.


మరి మీకెలా అర్థమయింది?

2 thoughts on “జ్ఞానజ్యోతి

  1. శ్రీ రవిచంద్రగారికి, నంస్కారములు.

    మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. సామాన్యంగా, మంచి చేసినా, చెడు చేసినా, 90 శాతం బాధ్యత చేసినవాళ్లదే వుంటుంది. మంచి చేసి, మంచి ఫలితం వస్తే, గోప్పంతా నాదే అంటాము; చెడు ఫలితం వస్తే ఎదుటివాడిని తప్పుపడతాము. సంయమనంతో ఆత్మ పరిశీలన చేసుకుంటే, నిజం మనకే తెలుస్తుంది.

    తెవీకి ద్వారా మీ పరిచయం ఇంతకుముందే వున్నది.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

  2. బాగుంది.. ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది నిజమనిపిస్తుంది..!!

వ్యాఖ్యలను మూసివేసారు.