రామకృష్ణుల శిష్యులకు ఎదురైన మతమార్పిడుల అనుభవం

శ్రీరామకృష్ణుల నిర్యాణం తర్వాత ఆయన శిష్యులు బరానగూర్ ఆశ్రమంలో ఉండేవారు. అక్కడ ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు నిర్వహించేవారు. కొంతమంది బెంగాలీ క్రైస్తవులు ఈ శిష్యులకు జీసస్ మీద గల అభిమానాన్ని పసిగట్టి అప్పుడప్పుడూ ఆశ్రమానికి వచ్చి పోతుండే వారు. వారి రాకలో ఆంతర్యం అంతిమంగా వాళ్ళను తమ మతంలోకి మార్పించుకోవడానికే.

ఒక రోజు వాళ్ళు అక్కడికి వచ్చి కేవలం జీసస్ మాత్రమే ముక్తి నివ్వగలడనీ, ఇంకెవరికీ ఇది సాధ్యం కాదనీ, తమ మతం గురించి గర్వంగా మాట్లాడుతూ వారిని తమ మతంలోకి మారమన్నారు. అప్పుడు శ్రీరామకృష్ణుల శిష్యుల్లో బైబిల్ ను బాగా అధ్యయనం చేసిన రామకృష్ణానంద (పూర్వాశ్రమ నామం ‘శశి’) తన వాదనా పటిమతో వారి వాదనలోని డొల్ల తనాన్ని ఎండగట్టాడు.

అందులో పరాభవం పొందిన తర్వాత కూడా ఆ మిషనరీలు ఈ సన్యాసులను ఏదో విధంగా ఏమార్చి తమ మార్గంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒకసారి తమ మతంలోకి మారిన వారికి తమ దేశపు మహిళనిచ్చి వివాహం చేస్తామని ప్రకటించారు!. ఆ మాటలతో రామకృష్ణానంద కు వారిని బాగా కోప్పడి వెళ్ళిపొమ్మన్నాడు. అప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ ఆ ఆశ్రమం వైపు తిరిగి చూడలేదు.

*మూలం: God lived with them by చేతనానంద

2 thoughts on “రామకృష్ణుల శిష్యులకు ఎదురైన మతమార్పిడుల అనుభవం

  1. ఇది స్వానుభవంతో అందరికి తెస్తున్నదే అయినా కొన్నిరకాల తాయిలాలకు
    కొంతమంది ప్రజలు మోజు పడుతున్నారు. దానిని ఎదుర్కోనే తత్వం అలవడాలి.

వ్యాఖ్యలను మూసివేసారు.