రెండు కప్పల కథ

ఓ కప్పల గుంపు ఓ అడవి గుండా ప్రయాణిస్తూ ఉంది. ఆ గుంపులో నుండి రెండు కప్పలు అకస్మాత్తుగా ఓ లోతైన గోతిలో పడిపోయాయి. మిగతా కప్పలన్నీ ఆ గొయ్యి చాలా లోతైందని గ్రహించి ఆ రెండు కప్పలతో “మీరు ఇక బయటికి రాలేరు. ఒకవేళ బయటికి రావాలని ప్రయత్నించినా కిందపడి చనిపోతారు. కాబట్టి అక్కడే ఉండిపోండి” అన్నాయి.

ఆ రెండు కప్పలు మాత్రం వాటి మాటలు పట్టించుకోకుండా వాటి శక్తి కొద్దీ బయటికి దుమకడానికి ప్రయత్నిస్తున్నాయి. మిగతా కప్పలు వాటిని బయటికి రావడానికి ప్రయత్నించవద్దనీ, లోపలే ఉండిపోమనీ అరుస్తున్నాయి. చివరికి వాటిలో ఒక కప్ప మిగతా కప్పల మాటలు విని ప్రయత్నించడం ఆపేసింది. కిందపడి చనిపోయింది.

రెండో కప్ప మాత్రం తన శక్తినంతా ఉపయోగించి పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. పైనున్న కప్పల గుంపు ఇంకా రావద్దని, కిందపడి చనిపోతావని అరుస్తూనే ఉన్నాయి. ఆ కప్ప బలంగా ప్రయత్నించి ఎలాగోలా బయటికి వచ్చేసింది. అది బయటకు వచ్చేసిన తర్వాత మిగతా కప్పలన్నీ

“అసలు మేం అరుస్తుంటే విన్నావా?” అని అడిగాయి.

అప్పుడా కప్ప “నాకు చెవుడు. మీరేం చెబుతున్నారో సరిగ్గా అర్థం కాలేదు. కానీ నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారని మాత్రం అర్థమైంది.అందుకనే బయటకి రాగలిగాను” అన్నది.

ప్రకటనలు

9 thoughts on “రెండు కప్పల కథ

  1. రెండో సారి చదివినపుడు ఈ డౌటు వచ్చింది:

    ఫస్ట్ టైం అకస్మాత్తుగా గోతిలో పడినప్పుడు అవి ఎందుకు చావలేదు ?

వ్యాఖ్యలను మూసివేసారు.