ఒక ఊళ్ళో ఓ భార్యా భర్త ఉన్నారు. ఒకసారి భర్తకి తన భార్యకి చెవుడు వచ్చిందేమో అని అనుమానం వచ్చింది. అది ఆమెతో నేరుగా మాట్లాడటం ఇష్టం లేక సలహా కోసం ఓ వైద్యుడి దగ్గరికెళ్ళాడు.
“దానికో చిన్న పరీక్ష ఉంది. దాన్ని ప్రయాగిస్తే మీ ఆవిడకు చెవుడు ఏ మాత్రం ఉందో తెలుస్తుంది” అన్నాడా డాక్టర్.
“నేను చెప్పినట్లు చేయండి. మొదట 40 అడుగుల దూరంలో నిల్చుని మీరు మామూలుగా మాట్లాడుతున్నట్లు మాట్లాడండి. వినిపిస్తుందేమో చూడండి. ఒకవేళ వినిపించకపోతే పది అడుగులు దగ్గరకు వెళ్ళి అదే విధంగా చేసి చూడండి. అలా ఆమెకు వినిపించేదాకా చేసి ఈ పరీక్ష ద్వారా మీరేం గమనించారో నాకొచ్చి చెబితే నేను దానికి తగ్గట్లు వైద్యం సిఫారసు చేస్తాను” అన్నాడు.
ఆ రోజు సాయంత్రం అతను ఇంటికెళ్ళేసరికి భార్య వంట చేస్తూ ఉంది. అతను వైద్యుడు చెప్పినట్లుగా ముందుగా 40 అడుగుల దూరంలో నిలబడి “ఏఁవోయ్ ఈ రోజు ఏం కూర చేశావ్?” అని అడిగాడు. ఏం సమాధానం వినిపించలేదు.
మళ్ళీ కొంచెం దగ్గరకొచ్చి అదే ప్రశ్న అడిగాడు. ఉఁహూ సమాధానం లేదు.
అలాగే వంటగదిలోకి వెళ్ళి “ఏఁవోయ్! ఇవాళ ఏం కూర చేశావ్?” అడిగాడు గట్టిగా మళ్ళీ. లాభం లేదు.
ఈ సారి సరాసరి ఆమె వెనకాలే వెళ్ళి నిల్చుని “ఏఁవోయ్ ఇవాళ ఏం కూర చేశావని అడిగితే సమాధానం చెప్పవేఁ!!” అన్నాడు విసుగ్గా…
ఆమె కోపంగా “మీకిది ఐదోసారి చెప్పడం, చికెన్ చేశాననీ!!!” అనింది.
🙂 కొత్త సంవత్సరంలో ఇలా నవ్వుతూనే ఉండండి… 🙂
నూతన సంవత్సర శుభాకాంక్షలతో
రవిచంద్ర
hahaha wish u happy new year!
నాదో డౌట్. చెవిటివాళ్లకి తమ మాటలు తమకి వినిపిస్తాయా?
వాళ్ళకి తెలుస్తాయి. కానీ పక్క వాళ్ళకి సరిగా వినిపించవని కొంచెం గట్టిగా మాట్లాడుతుంటారు..
* WISH YOU A HAPPY AND PROSPEROUS NEW YEAR 2011 *
I like this post-
-PR Tamiri
Dear Friend,
I wish to you all people of this world Happy New Year 2011
–PR Tamiri
2011లో ప్రపంచ ప్రజలందరూ సుఖశాంతులతో వర్థిల్లాలని నా ఆకాంక్ష…
— పిఆర్ తమిరి
Nice post Ha ha. Wish you all happy new year.
హ హ బాగుందండి, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙂
రవిచంద్ర ji
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
@సౌమ్య, @సుధ, @tprao, @చందు, @వేణూ శ్రీకాంత్, @శ్రీవాసుకి
అందరికీ ధన్యవాదాలు…
జోకు అద్దిరింది .
2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.
happy new year
* WISH YOU All HAPPY AND PROSPEROUS NEW YEAR 2011 *
chala bavundi.
ధన్యవాదాలు