తెలుగు భాషా ప్రేమికులకు ఆహ్వానం

మీరు కంప్యూటర్లో తెలుగు చూడగలరా?

కంప్యూటర్ లో తెలుగు లో టైప్ చెయ్యగలరా?

మీ ఆన్‌లైన్ కార్యక్రమాలైన ఈ మెయిల్, చాటింగ్, సోషియల్ నెట్‌వర్క్స్, బ్లాగుల్లో తెలుగు వాడకం బాగా తెలుసా?

మొదటి సారి కంప్యూటర్లో తెలుగును చూసినప్పుడు మీరు ఎలాంటి ఆనందం అనుభవించారో అదే అనుభూతిని మరింత మందికి పంచండి!

ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా లో భారీ పుస్తక ప్రదర్శన జరగనుంది. గత రెండేళ్ళుగా ఈ-తెలుగు సంస్థ అక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసి అక్కడికి ఆసక్తితో వచ్చే సందర్శకులకు కరపత్రాలు, ప్రదర్శనల ద్వారా కంప్యూటర్లలో తెలుగు వాడకం గురించి, ఇంటర్నెట్ (అంతర్జాలం) లో లభ్యమౌతున్న తెలుగు వెబ్‌సైట్లు, తెలుగు భాషకు సంబంధించిన వివిధ ఉపకరణాల గురించి అవగాహన కలిగిస్తున్నది.

ఈ స్టాల్ లో సేవలు అందించేందుకు, సందర్శకులకు కంప్యూటర్లో తెలుగు గురించి పరిచయం చేయడానికి  స్వచ్చంద సేవకులకు ఆహ్వానం పలుకుతున్నాము. ఈ ప్రదర్శన జరిగే పది రోజుల్లో ఎప్పుడైనా, ఎంత సమయమైనా స్టాల్ దగ్గరికి వచ్చి మీ సేవలందించవచ్చు. మీరు చేయవలసిందల్లా అక్కడికి వచ్చిన వారికి ఒక కరపత్రాన్ని అందజేసి కంప్యూటర్లలో సులభంగా తెలుగు చూడవచ్చు, రాయవచ్చు అని తెలియజెప్పడం మాత్రమే!

6 thoughts on “తెలుగు భాషా ప్రేమికులకు ఆహ్వానం

    • అయ్యా కౌటిల్య నాగప్రసాద్ మాటలు పట్టించుకోకుండా బేగొచ్చేసెయ్యండి…

    • మీరుండండీ! అసలే వాలంటీర్లు లేక మేం ఇబ్బందులు పడుతుంటే.. వచ్చే వాళ్ళను కూడా వద్దంటున్నారు… 🙂

  1. వీలు వెంబడి ఆ కరపత్రం స్కాన్ చేసి ఇక్కడ పెట్టగలరా? అక్కడి మా వాళ్ళకి [అదీ హై. కి రాలేని వారికి ]అందునుంచి ఏమి సమాచారం ఇవ్వవచ్చునూ అని ఆసక్తిగా ఉంది. నా ఈ ఉత్తరాలు చూసి అబ్బురపడటమే కానీ సులువే అన్నా పెదవి విరిచేసి నాలుగు తెంగ్లీష్ ముక్కలు గెలికి పారేస్తారు లేదా ఆంగ్లమే తరుచుగా అటునుండి. ఈ అమెరికా వాసం కాదు గానీ మాకేవో మన భాషా ప్రదర్శనాభిలాష మెండు 🙂

    • ఉష గారూ, ఈ లంకె లో కరపత్రాన్ని ఎక్కించాను. అలాగే మీక్కూడా ఓ మెయిల్ పంపాను. మీకు తెలిసిన వారికి అంతా పంపించండి.

వ్యాఖ్యలను మూసివేసారు.