మరి వీళ్ళు చేస్తున్నదేమిటో…

రాజకీయనాయకులకు వెంకన్న టోకున వరాలు ఇచ్చేస్తున్నాడని ఏదో పుకారు లేచినట్లుంది. లేకపోతే ఉన్నట్టుండి మన రాష్ట్రంలో నాయకులకు వెంకన్నపై అమితమైన ప్రేమ పుట్టుకొచ్చేయడేమేంటి?

ఉన్నపళంగా అందరూ పొలోమని పాదయాత్రల మీద పడ్డమేంటి? ఈ యాత్ర ముందు చిరంజీవి ప్రారంభిస్తే, తరువాత చంద్రబాబు, ఇప్పుడేమో సీపీఐ నారాయణ వంతు.

ఉన్నట్టుండి తిరుమల కొండపైన రాజకీయాలు జరిగిపోతున్నాయని తెగ బాధపడిపోతున్నారు.ఇన్ని రోజులు ఏం చేస్తున్నారో! అసలు ఆ ఆదికేశవులు నాయుడు టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచీ దేవస్థానం ప్రతిష్ట మరింత దిగజారిందని నా అభిప్రాయం.

మరి వీళ్ళు అక్కడికెళ్ళి ఒరగబెట్టేస్తుందేమిటో తెలుసా? వందలకొద్దీ రాజకీయ కార్యకర్తలని, మందీ మార్బలాన్ని వెంటేసుకుని వెళ్ళడం, అక్కడ అధికారులను బలవంతంగా ఒప్పించి వీళ్ళందరికీ వసతి, ఉచిత దర్శనం ఇప్పించుకోవడం. ఇది సామాన్య భక్తులకు అసౌకర్యం కాదా? దీన్ని రాజకీయం కాక ఇంకేమంటారో!

ప్రకటనలు

6 thoughts on “మరి వీళ్ళు చేస్తున్నదేమిటో…

    • రాజకీయాలు జరుగుతున్నాయంటూ గగ్గోలు పెట్టి అక్కడికెళ్ళి రాజకీయాలు చేస్తారు…ఇలాంటివి మనకు కొత్తేమీ కాదనుకోండి.. కానీ మనసు ఊరబట్టక ఇలా

  1. _____________________________________________________
    వందలకొద్దీ రాజకీయ కార్యకర్తలని, మందీ మార్బలాన్ని వెంటేసుకుని వెళ్ళడం, అక్కడ అధికారులను బలవంతంగా ఒప్పించి వీళ్ళందరికీ వసతి, ఉచిత దర్శనం ఇప్పించుకోవడం. ఇది సామాన్య భక్తులకు అసౌకర్యం కాదా? దీన్ని రాజకీయం కాక ఇంకేమంటారో!
    _____________________________________________________

    Very True!!

వ్యాఖ్యలను మూసివేసారు.