కుక్కాశ గుండ్రాయితో తీరిపోయింది

దేనిమీదైనా బాగా ఆశ పెట్టుకున్నపుడు అది నెరవేరకపోతే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఈ సామెతను విరివిగా వాడేది. గత రెండేళ్ళుగా నేను ఎదురుచూస్తున్న కోరిక ఫలించకపోవడంతో ఇప్పుడు ఈ సామెత గుర్తుకు వచ్చింది.

ఈ సామెత నేపథ్యం ఏమిటంటే, కుక్క ఒకసారి ఆకలితో  అన్నం తింటున్నపుడు ఆశగా ఎదురు చూస్తూ తోకాడిస్తూ వచ్చిందంట. ”యేహే తినేటప్పుడు నీ గోలేంటే”  అని పక్కనే ఉన్న గుండ్రాయెత్తి దానిమీదకి విసిరేశారంట. అదీ సామెత.

“పెరుగుదల” కోసం కళ్ళు కాయలు కాసి కాసి, పండిపోయి, కుళ్ళిపోయి విత్తనాలు నేలరాలిపోయాయి. ఆ విత్తనాలు అదే నేలలో నాటాలా? లేక వేరే భూమిలో నాటాలా అని తెగ సతమతమైపోతున్నా. సరిగ్గా ఇదే సమయంలో పక్కవాడి పొలంలో పైరు బాగా పండితే మనిషిలోని సహజ ఈర్ష్య స్వభావం వెర్రి తలలు  వేస్తుంది. అదిగో అప్పుడే కావాలి సంయమనం. ఆ ఈర్ష్యను ఉక్కుపాదంతో అణిచేయాలి, లేకపోతే అణిగేదాకా ఆగాలి. ఒక పంట వేసిన వెంటనే రెండో పంట వేసేస్తే భూమిలో సారం ఉండదు కదా. అందుకనే ప్రస్తుతానికి నేలను సిద్ధం చేసే పనిలో పడ్డా…

ప్రకటనలు

5 thoughts on “కుక్కాశ గుండ్రాయితో తీరిపోయింది

 1. ___________________________________________________________
  సమయంలో పక్కవాడి పొలంలో పైరు బాగా పండితే మనిషిలోని సహజ ఈర్ష్య స్వభావం వెర్రి తలలు వేస్తుంది. అదిగో అప్పుడే కావాలి సంయమనం. ఆ ఈర్ష్యను ఉక్కుపాదంతో అణిచేయాలి, లేకపోతే అణిగేదాకా ఆగాలి. ఒక పంట వేసిన వెంటనే రెండో పంట వేసేస్తే భూమిలో సారం ఉండదు కదా. అందుకనే ప్రస్తుతానికి నేలను సిద్ధం చేసే పనిలో పడ్డా…
  ___________________________________________________________
  రవిచంద్ర:

  రెండో పేరా మాత్రం అక్షర సత్యం. నేను ఇంచు మించు అదే పరిస్థితిలో ఉండడం వలన, బాగా కనెక్ట్ అయ్యాను. నేను ఇంకా నేలను సిద్దం చెయ్యలేదు. చేద్దాము చేద్దాము అనుకుంటూనే రోజులు గడిపేస్తున్నాను. నీ టపా మళ్ళా కర్తవ్యాన్ని గుర్తు చేసింది.

  Nice post.

  గణేష్

  • >>నీ టపా మళ్ళా కర్తవ్యాన్ని గుర్తు చేసింది.
   అసలు నేను ఈ టపా రాయడానికి అదే కారణం. నా కర్తవ్యాన్ని నేను అప్పుడప్పుడు గుర్తు చేసుకుందామనే… 🙂

వ్యాఖ్యలను మూసివేసారు.