సూర్యలంక బీచ్

రిసార్ట్స్
రిసార్ట్స్

ఈ వారాంతం మా టీమ్ తో కలిసి బాపట్ల సమీపంలో ఉన్న సూర్యలంక బీచ్ కు వెళ్ళాం. అక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం వారి హరిత రిసార్ట్స్ లో రూమ్ బుక్ చేసుకున్నాం. శని ఆదివారాలు కాబట్టి జనం బాగానే ఉన్నారు.

బీచ్ చాలా విశాలంగా ఉండి జలకాలాడ్డానికి అనుకూలంగా ఉంది. 250 మీటర్ల లోతు దాకా వెళ్ళినా అలలు నడుం లోతు దాకా కూడా రాలేదు. అసలు బయటకు రావాలని అనిపించలేదు. అలలపై తేలియాడినట్లుంది అనే కవితాత్మక భావనని ప్రత్యక్షంగా అనుభవించాను నేనైతే…

కాకపోతే ఇటీవల సంభవించిన లైలా తుఫానుకు కొంచెం కళ తప్పినట్లు కనిపించింది. ఎటొచ్చీ ప్రభుత్వ సంస్థ అనే పేరు నిలబెట్టుకోవాలి కాబట్టి అక్కడి ఉద్యోగులు నిర్వహణ లో తమ అలసత్వ ప్రదర్శనతో మమ్మల్ని అలరించారు. ఏసీ గదులు బుక్ చేసుకున్నా వాటిలో శుభ్రత లేదు. ఆ ఏసీలు సరిగా పనిచేయలేదు. ఇక మామూలు గదులు ఎలా ఉంటాయో?

మొత్తమ్మీద రెండు రోజులు మరో బోరింగ్ వీకెండ్ కాకుండా సరదాగా గడిచిపోయింది…

ప్రకటనలు

27 thoughts on “సూర్యలంక బీచ్

 1. ఎటొచ్చీ ప్రభుత్వ సంస్థ అనే పేరు నిలబెట్టుకోవాలి కాబట్టి అక్కడి ఉద్యోగులు నిర్వహణ లో తమ అలసత్వ ప్రదర్శనతో మమ్మల్ని అలరించారు. ……..:-)

 2. ఓ మా సూర్యలంక వెళ్ళారా! ఇప్పుడింకా నయమండి బాబు..అంతకుముందు ఆ మాత్రం సదుపాయాలు కూడా ఉండేవి కాదు. అక్కడ సముద్రం మాత్రం బాగుంటుంది.

  • >>అంతకుముందు ఆ మాత్రం సదుపాయాలు కూడా ఉండేవి కాదు
   అవును అలాగే సరిపెట్టుకున్నాం…

 3. How about food? Darunam! Baby Corn, Mushroom tappa emi kooragayalu levata!!! adento, bendakaya, vankaya lanti basic veggies kooda levu!!! Beach matram bagundi 🙂

  • నాకు అది పెద్ద ప్రయారిటీ కాదు కాబట్టి దాన్ని గురించి రాయలేదు. కానీ మీరన్నట్లు ఎక్కువ ఆప్షన్స్ లేవు.

 4. Here in India the Government priority is not to provide entertainment to the people.
  You may go to any private beach resorts in INDIA. Then u will come to know difference.
  Your kind of people half rich, half poor and u r not capable spend money to get good facilities but asking for
  more comforts.

  • మీకు ప్రభుత్వ సంస్థలంటే భలే అభిమానం ఉన్నట్లుంది.
   అవును, మేం చెడి బతికిన వాళ్ళమే ( మీరన్న half rich/half poor కి నాకు తెలిసిన అచ్చ తెలుగు అర్థం ఇదే). మా స్థోమత అంతే…
   రోజుకు ఓ రూమ్ కి 1300 రూపాయలు ఖర్చు పెట్టేటపుడు రూమ్ లో కనీసం శుభ్రత, అందులో ఉండే ఫ్యాన్లూ, ఏసీలు, టీవీలు సరిగా పనిచేయాలనుకోవడం కూడా అత్యాశేనా? హన్నా మరీ ఇంత దారుణంగా మాట్లాడుతారేంటి మీరు? పైగా మా వ్యక్తిగత ఆర్థిక స్థోమత మీద కామెంట్లు.

   • మీ స్థోమత గూర్చి వ్యాఖ్యానించే హక్కు నాకు లేదు గాని, చాలా సార్లు ప్రభుత్వ వసతులు, ప్రైవేటు వసుతులు ఉపయోగించిన తర్వాత నాకు కూడా చాలా మంది వాటిల్లో వ్యత్యాసం చూసి ప్రభుత్వాన్ని కించపరుస్తున్నారు అనిపిస్తుందండి. మీరనట్టు కనీసపు అవసరాలు ఉండాలి వాస్తవమే కానీ, మరీ ప్రైవేటు వాటిల్ల ఉండాలి అని ఆశపడటం మాత్రం అత్యాశ. దానికి ప్రభుత్వాన్ని నిందించటం కూడా తప్పే. బహుశా ఆవిడ దాని గూర్చి అంటున్నట్టున్నారు. మన రాష్ట్రం లోని పర్యాటక శాఖ గూర్చి నాకు అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు కానీ ఈ మధ్య వారు కూడా ఏదో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుంది. అందుకే బాలేదు అని కంప్లైంట్ చేసేకంటే ఇది చేసారు, ఇంకా చేస్తే బాగుణ్ణు అని హర్షిస్తే మంచిది అనిపిస్తుంది.

 5. @అనుపమ గారు, ఇక్కడ మీకు ఇంకా వివరణ ఇవ్వాలి.
  ప్రైవేటు వాళ్ళకి, గవర్నమెంటు వాళ్ళకి పోలిక అనవసరం. మనం ఖర్చు పెట్టిన డబ్బుకు సరైన సేవ ఉందా లేదా అన్నదే నేను ఆలోచించింది. మాకు అక్కడ కేటాయించిన గదుల్లో ఒకదానికి అసలు ఏసీయే పనిచేయలేదు. దానికి ఏసీ చార్జీలు తగ్గించమంటే తగ్గించలేదు. లేదా వేరే రూమ్ ఇవ్వమంటే ఇవ్వలేదు. మిగతా గదుల్లో కనీసం వేరే బెడ్ వేయమన్నా దానికి దిక్కు లేదు. మేమే మోసుకున్నాం. అక్కడ గదుల్లో టవల్స్ లేవు. సోపులు లేవు. మీరే చెప్పండి ఏ ప్రైవేటు సంస్థల్లోనైనా ఇంత బాధ్యతా రాహిత్యం ఉంటుందా?

  • నిజమేనండి ..అంత పైకం చెల్లించి అవసరమైనవి కోరుకోవటంలో తప్పు ఉందని నా అభిప్రాయం కాదు! కాని కొంతమంది పదేపదే రెండు వ్యవస్థల మధ్య తేడ చూసి ప్రభుత్వాన్ని దూషిస్తూ ఉంటారు.వారి గూర్చి మాత్రమే నేను అంటున్నాను..బ్రహ్మాండమైన టూరిస్టుప్రదేశాలు మన రాష్ట్రంలో కూడా చాలా ఉన్నాయి…ఆలస్యంగా అయినా వాటి మీద మనసుపెట్టి మన ప్రభుత్వం ఏదో ఒక పని చేస్తోంది. రోజూ వేలమంది తిరిగే విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారిలో జనాలు ఆగి తినేందుకు మంచి హైజీనిక్ రెస్టారెంట్( నీట్ గా ఉండే సౌచాలయాలతో సహా) పెట్టింది. మనమే వారిని “discourage ” చేసి ఇంకా చెడు చేస్కోవటం ఎందుకు అని నా మాట. ఇంతకీ అక్కడ కంప్లైంట్ రిజిస్టర్ లో రాశారా మీరు?

   • >>చేసి ఇంకా చెడు చేస్కోవటం ఎందుకు అని నా మాట.
    Yes I agree with you on this. కానీ అక్కడి నిర్వహణ గురించి నేను రాసింది కేవలం రెండే రెండు సరదా వాక్యాలు. కేవలం సరదాగానే. ఎందుకంటే ముందుగా చెప్పినట్టుగానే నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడినే. నాకు లగ్జరీస్ మీద పెద్దగా ఆసక్తి కూడా లేదు.

    కంప్లైంట్ రిజిస్టర్ లో రాశాం.

 6. manchi pani chesaru..deeniki mana prabhutvam spandistundani aasiddam.
  ee sari nenu kuda ee beach ki velli spandinchindo/ledo telsukuni vastanu. 🙂
  annattu meeru naako weekend holiday spot gurchi chepparu.daniki naa dhanyavadalu.

  • కానీ రెండు రోజులు కేవలం బీచ్ కే అయితే కొంచెం ఎక్కువేమోనండి. మీరు చుట్టుపక్కల కూడా ఏమైనా దేవాలయాలు లాంటివి చూసే ఏర్పాటు చేసుకోండి.

 7. U are right ! When I went to suryalanka about two years ago, the APTDC facilities were very discouraging. I think they are all contract or outsoursed workers who run the facilities.

  Its a shame that things have never been improved. If u are travelling from vijayawada, its better to pick up food from the city and drive to bapatla. Nevertheless, its a wonderful experience to see truck loads of fish rushing to be auctioned, every evening.

  • అవునండీ చాలా బాగున్నాయి. కాకపోతే అంత బాగా తీసిన ఫోటో గ్రాఫర్ గొప్పతనం కూడా ఉందనుకోండి…

 8. mmmmm……………beach gurinchi inkaaa raayaalsindi………………

  nenu idi 5saari skp cheyadam.

  nenu koutilya amaraavativellam …taruvata suryalanka veldam anukunte naaku fever vachindi……….

  picss inka upload cheyandi bosss

  • వినయ్ గారూ, అవును బీచ్ గురించి ఇంకా రాయాల్సింది. కౌటిల్య చెప్పారు వెళుతున్నామని. మిస్సయ్యారా? సర్లెండి మళ్ళీ ఎప్పుడైనా చూడచ్చు.

   నా కెమరా నీళ్లలో పడి పాడైంది. 😦 ఫ్రెండ్స్ తీసినవి ఉన్నాయి. ఇంకా అప్లోడ్ చేయలేదు వాళ్ళు. చేసిన తర్వాత మీకు లింక్ పంపిస్తాను.

 9. మా బావగారు ఇండియాలో రూం తీసుకునే ముందర ఆ రూము లోకి వెళ్లి చెప్పిన వన్నీ(వేడినీళ్ళు, TV, AC etc.) ఏక్ ) ఉన్నయ్యో లేవో చూసి తీసుకునే వాళ్ళు. ఇప్పుడు అర్ధమయ్యింది ఎందుకో.

వ్యాఖ్యలను మూసివేసారు.