కృతజ్ఞత నిండిన మది గీతాలాపన చేస్తే

అతను ఓ అనాథ. ఓ బడి పక్కన అడుక్కుంటూ ఉంటాడు. ఊరూ తెలీదు, పేరూ తెలీదు. ఒంటి మీద మాసిపోయి, చిరిగిపోయిన బట్టలు, కలుపు మొక్కల్లా ఎదిగిపోయిన జుట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే చూస్తునే అడుగు దూరం నుంచే తప్పుకుని వెళ్లే రూపం.

అలాంటప్పుడే ఓ పాప అతన్ని చూసి జాలిపడింది. అతన్ని తమ ఇంటికి తీసుకెళ్ళేదాకా ఒప్పుకోలేదు. ప్రాణంగా ప్రేమించే కూతురు అడిగిన కోరిక కాదనలేకపోయాడా తండ్రి. అలాగే అతన్ని ఇంటికి తీసుకెళ్ళి తమ ఇంట్లో పెట్టుకున్నారు.

కృతజ్ఞతతో నిండిపోయిన అతని మనసు పాడుకున్న పాటే ఇది. ఆకాశమంత సినిమా లోది. వేటూరి పద విన్యాసాలకో మచ్చుతునక. విద్యాసాగర్ మస్తిష్కంలో పురుడు పోసుకున్న భావగీతిక.

ఒకానొక ఊరిలో.. ఒకే ఒక అయ్య…

ఒకే ఒక అయ్యకు తోడు ఒకే ఒక అమ్మ…

ఒకే ఒక అమ్మ బిడ్డ ఒకే ఒక అమ్ము…

అది చూపుతోనే మాటలాడే కరుణ ఉన్న కన్ను..

చ: బంధాలే లేక కొందరు పిచ్చి వాళ్ళు అవుతారు. బంధాలే ఉండి అయ్య పిచ్చి ఎక్కిపోతాడు…

కాలేస్తే కందునని దోసిట్లో పెంచారు

ఎండకన్ను సోకకుండా గుండెల్లో దాచారు

పసిపాపే పసిపాపే ఉసురూ.. ప్రాణానికే ప్రాణాలనే ఇస్తారూ ఎదురూ…

చ: పురుగునే చూస్తే కొందరు పరుగు అందుకుంటారు

భూకంపమే వస్తున్నా అక్క పూమాలనే అల్లునుగా

పుట్టినది ఒక బిడ్డ… పుణ్యానికి ఒక బిడ్డ

ఇరుపాపల అల్లరికి మా అక్కే జోలాలిగా

ఈ అక్క మా ఇంటికి మిన్నా

మాయక్క మనసు ముందు హిమాలయం చిన్నా…

చ: పుడుతూనే తల్లులు కొందరు పుణ్యం కొని తెస్తారు..

మా పుణ్యం కొద్దీ మాకే వరాలనే ఇస్తారు..

వరమై మా యమ్మ మా కోసం రావమ్మా

చీమ జోలికెళ్ళదురా సింగంరా ఈ యమ్మ

మరలా ఓ జన్మంటే అడిగేస్తా ఓ వరమే

ఈ మాలక్ష్మికో ఆ మాతల్లికో పసిపాపనవుతా…

ఇండి పాప్ సంగీతంలో నిష్ణాతుడైన కైలాష్ ఖేర్ గొంతులో భావాలు బాగానే పలికినా అక్కడక్కడా వినిపించే ఉచ్ఛారణా దోషాలు తీయటి పాయసంలో మెంతిగింజల్లా తగులుతాయి. కానీ వింటుంటే తప్పక స్పందింపజేసే పాట.

ప్రకటనలు

2 thoughts on “కృతజ్ఞత నిండిన మది గీతాలాపన చేస్తే

  1. కృతజ్ఞత నిండిన స్వరమే అయి ఉండవచ్చును – నిజానికి కథలో సన్నివేశం ఇదివరకు
    నాకు తెలియదు. టివి పాటల పోటీల్లో పిల్లలు పాడుతూ ఉంటే విషాదం ధ్వనించి పూర్తిగా
    ఎప్పుడూ వినలేదు – ఇప్పుడు ఇక్కడా వినలేకపోయాను !! నిజానికి విషాద గీతాలు
    వినడమూ , పాడుకోవడమూ అలవాటే అయితే అలనాటి గీతాలే మక్కువ..

వ్యాఖ్యలను మూసివేసారు.