అవి నేను ఎన్ ఐ టీ వరంగల్ లో ఉన్నత చదువు (ఎంటెక్) వెలగబెడతున్న రోజులు…
ఓ రోజు మధ్యాహ్నం కాళ్ళు మెస్సు వైపు కదలనని మొరాయిస్తున్నా ఆకలి వాటిని భారంగా ఈడ్చుకెళుతోంది. అక్కడ శాకాహారులకు ఐదో నంబర్ మెస్సు ప్రత్యేకం. “అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఒక్క మెతుకు వదిలి పెట్టినా పాపమే” అని చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ చెప్పిన మాటలు నా మెదడులో సుడులు తిరుగుతున్నా తప్పని సరి పరిస్థితుల్లో ఎన్నో సార్లు తిండి వదిలేశాను ఆ మెస్సులో…
ఆ రోజు మెస్సులో జిలేబీ స్పెషల్. అన్నం తినడం పూర్తి చేసిన తర్వాత చవిచెడిపోయిన నోరు తీపి చేసుకుందామని జిలేబీ చివరి దాకా అట్టే ఉంచాను. నెమ్మదిగా మెస్ బయటకు వచ్చి విశ్రాంతి కోసం అక్కడే వేసి ఉన్న ఓ బెంచీ మీద కూర్చుని ప్రశాంతంగా జిలేబీ తినడానికి ఉపక్రమించాను.
రెండు ముక్కలు నోట్లోకి వెళ్ళాయో లేదో ఎక్కడ నుంచి వచ్చిందో ఓ కుక్క నా పక్కనే కూర్చుని ఆశగా జిలేబీ వంకే చూస్తోంది. దాని మీద కొంచెం జాలిపడి మిగతా భాగం దాని ముందు పడేశాను.
అది నెమ్మదిగా దాని దగ్గరకు వచ్చి వాసన చూసి “దీన్ని కుక్కలు కూడా తినవు” అన్న సామెతను నిజం చేస్తూ వెనక్కి చూడకుండా తిరిగి వెళ్ళిపోయింది. నాకైతే అక్కడ మొదలైన నవ్వు తిరిగి ల్యాబ్ కు వెళ్ళేదాకా ఆగనే లేదు…
hahaha ! super !
Thank you 🙂
హాస్టల్ తిండి గురించి నాకు చెప్పకండి…తొమ్మిదేళ్ళు తిని ఇంకా బతికి ఉన్నా, అదే ఆశ్చర్యం
🙂 అయితే మీది గట్టి ప్రాణమండోయ్… 🙂
🙂
LOL..ఇక నుంచి మీరు హాస్టల్ కు వెళ్ళినప్పుడల్లా తినబొయే ముందు ఒక ముద్ద ఆ కుక్క కి పెట్టి,అది తింటేనే మీరూ తినండి.మీ అరోగ్యానికి శ్రేయస్కరం గా ఉంటుంది.
అదృష్ట వశాత్తూ ఆ పరిస్థితి ఇంకా రాలేదు 🙂
అది ఎంగిలి చేసిన ముద్దా మీరనేది…..హ హ
నేను గత పదకొండు సంవత్సరాలుగా హాస్టలు తిండి తింటూనే ఉన్నా. 😦 ఏమాటకామాటే చెప్పుకోవాలి. తిండి సంగతి ఎలా ఉన్నా, హాస్టల్లో వండినన్ని రకాలు బయట దొరకవు. ఇంట్లో కూడా అన్నిరకాలు చేసుకోవటం కష్టం. 😀 😛
రకాల(వెరైటీ) విషయం లో నేనూ అంగీకరిస్తాను. కానీ ఎన్ని రకాలు చేస్తే ఏం ప్రయోజనం? ఏ రాయి అయితేనేమి పళ్ళూడగొట్టుకోవడానికి అన్నట్టుండేవి కూరలు 🙂
నేను మెస్ లో కుక్కు ని పిలిచి అడిగేవాడిని….ఏమయ్యా?మెస్ లో ఒక కుక్కయినా వుందా అని?
లేక పోవడానికి కారణం కూడా చెప్పే వాడిని…
వంటలు దరిధ్రం గా వుండడమే కారణమనీ…[కుక్కలు కూడా తినవు ఈ మెస్ లో అనీ]…
papam aa kukka eppudo mee hostel lo sweet ni porapatuna ruchi choosi vuntundi… 🙂
btw, photo chalaaaaaaaa bagundi… chala chala chala…. kallu tippukoleka potunna… endukante, maa kukka (peru Shiva) chinnappudu acham ga alaage vundedi… poyi 5 years avutondi… naa toh 8 years vundi… i miss shiva even now… hmm…
రవిచంద్ర గారు మీ హస్టల్ తిండి అనుభవం బాగుంది..నేను 5th మెస్ లొ 1st yr తిన్నాను. మరీ దారుణంగా ఉండెది. అప్పుడప్పుడు తిండి అంటేనె విరక్తి వచ్చేది .అన్నట్టు కుక్కలు సర్వ సాదరణము కదా NITW లో.
నాలాగే మీరూ బాధితులన్న మాట 🙂
hostel food vanta batti, sannaga unndi , actor krishnudu la tayaraina vaallu kooda naaku telusu hahaha..
నిజమేనండోయ్… నేను ఇలా కంప్లైంట్ చేసినప్పుడల్లా నా మీద కోపంతో ఇంతెత్తున లేచే వాళ్ళుండేవారు. వాళ్ళకి హాస్టల్ తిండంటే ప్రాణం 🙂
NITW lo veg mesalu gurinchi naku anthaga theliyadhu…nenu first year lo vunnappudu 4th mess lo thinevadini…adhi veg mess…. kani food bagane vundedhi(APR ane ECE staff valla)….tharvatha 3rd and 1st mess lo nonveg vundedi afternoon…and its impossible eat in mess in the nights.. kani lastyear (2009-10) lo food court ani okati start ayyindhi ..akkada thinnaka patha mess la viluva thelisi vachindi….