స్వామీ వివేకానంద ఛలోక్తులు

 స్వామీ వివేకానంద
స్వామీ వివేకానంద

స్వామి వివేకానంద ఎంత గొప్ప వక్త అయినా అప్పుడప్పుడూ ఆయన ఉపన్యాసం మధ్యలో ఆయన్ను ఎగతాళి చేసేవాళ్ళూ ఉండే వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఆయన సరైన రీతిలో జవాబిచ్చేవాడు. అలాంటి సంఘటనలు కొన్ని…

 • ఓ సారి ఇంగ్లండ్ లో ఉపన్యసిస్తూ ఇలా చెబుతున్నాడు “కొన్ని వేల సంవత్సరాల పూర్వం నుంచే అద్భుతమైన నాగరికతతో విలసిల్లిన భారతదేశం లా కాకుండా ఈ ప్రాంతం ఒకప్పుడు మొత్తం అడవులతో నిండి ఉండేది”. అసలే ఆంగ్లేయులకు తమకే అన్నీ తెలుసన్న అహంకారం ఎక్కువ. ఇక ఇలా చెబుతుండగా శ్రోతల్లో ఉన్న ఇంగర్ సోల్ అనే రచయితకు చిర్రెత్తుకొచ్చింది. అతను వెంటనే ఒక కాగితం పై “I will kill you” అని రాసి స్వామి మీదకు విసిరేశాడు. స్వామి దాన్ని తీసి బిగ్గరగా చదివి అందరికీ వినిపించి “చూశారా! ఇప్పుడే మీ అనాగకరికత్వానికి ఇంకో ఋజువు దొరికింది” అన్నాడు.
 • మరో సమావేశంలో ఎవరో భగవద్గీత పుస్తకంపై మరేవో మత గ్రంథాలు పేర్చి స్వామి దగ్గరకు వచ్చి ” చూశారా ఇదీ భగవద్గీత స్థాయి” అన్నారు. స్వామి భగవద్గీత పుస్తకాన్ని ఒక్కసారిగా పక్కకు లాగడంతో మిగతా పుస్తకాలన్నీ కిందపడిపోయాయి. అప్పుడు స్వామి “చూశారా అన్నింటికీ ఇదే ఆధారం” అన్నాడు.
 • ఇంకో సమావేశంలో వివేకానంద మాట్లాడుతుండగా ఎవరో ఒక కాగితం పై “FOOL” అని రాసి ఆయన చేతికిచ్చారు. స్వామీజీ దాన్ని చూసి నెమ్మదిగా నవ్వుకుని అందరితో “మామూలుగా మనం ఏదైనా లేఖ రాసి చివర్న సంతకం పెట్టడం మరిచిపోతుంటాం. కానీ ఇక్కడ చూడండి. సంతకం పెట్టి లేఖ రాయడం మరిచిపోయాడు పాపం” అన్నాడు.

11 thoughts on “స్వామీ వివేకానంద ఛలోక్తులు

 1. naku Thakur (Ramakrishna) anna, Swamiji (vivekananda) garanna amitamaina bhakti bhavam. Vaari upanyasalu, kathalu, rachanalu anni adbhutalu, manaki margadarshakalu. Paina cheppinavi kooda idivarake telisina entho bagunnayi 🙂 Swamiji samayaspoorthi, chamatkaram, vijnyanam mundu evaru paniki raaru.

 2. మిగితా రెండూ బాగానే ఉన్నాయి కానీ, మొదటిదే బాగాలేదు.

  ఏ దేశ/ప్రాంత ప్రజలనైనా, మాదే మొదటి నాగరికత, మీరు అడవి మనుషులు అప్పుడు అన్నట్టు మాట్లాడితే ఎవడికైనా మండుద్ది. ఒక సన్యాసిగా ఆయన అలంటి రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసారంటే బాధగా ఉంటుంది.

  మిగితావి మాత్రం సరైనవే. స్వామీజీ ఎన్నో విషయాల్లో మనకి ఆదర్శనీయుడు, కానీ ఆయన కొన్ని మాటలు విపరీత జాతి వైరాన్ని పెంచే విధంగా ఉండటం గమనించాను.

  అంత కన్నా, విశ్వ శాంతికి ఉపయోగపడే విధంగా మాట్లాడి ఉంటె బాగుండేది అని నాకనిపిస్తుంది.

  • సీత గారూ,
   వాళ్ళను అడవి మనుషులని ముందు స్వామి అనలేదు. ముందు స్వామి అన్నది భారతదేశంలో అభివృద్ధి చెందే సమయానికి ఈ ప్రాంతం అడవిగానే ఉంది అని చెప్పారు. దానికి ఆ రచయిత I will kill you అని రాశారు. దానికి సమాధానంగానే ఆ చలోక్తి విసరడం జరిగింది. అది అతన్ని నియంత్రణలో పెట్టడానికి అన్నాడు. అందరినీ ఉద్దేశించి చేసింది కాదని నా అభిప్రాయం.
   ప్రపంచంలో ఇతర దేశాలకన్నా ముందే భారతదేశంలో సంస్కృతీ సాంప్రదాయాలు విలసిల్లాయని ఇప్పటికే చాలా పరిశోధనలు నిరూపించాయి. దాన్ని పట్టించుకోకుండా భారతదేశ ప్రజలు గురించి వాళ్ళు కూడా అలాగే మాట్లాడారండీ. ఎన్నో అపోహలు ప్రచారం చేశారు. అలాంటి వాళ్ళను నియంత్రించాలంటే అలా మాట్లాడక తప్పదు. ఇదీ నా సమర్ధన

 3. శ్రీ రవిచంద్ర గారికి, నమస్కారములు.

  స్వామీజీ ఛలోక్తులు చాలా బాగున్నాయి. ఇవి వారి “సమయస్పూర్తికి” నిదర్శనం. ఇటువంటివే, గాంధీజిగారికి, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు శ్రీ పట్ఠాభి గార్ల మధ్య; విశ్వనాథ సత్యనారాయణగారు – ఆయన సమకాలీన కవుల మధ్య కూడా జరిగినాయి.ఇవన్నీ వారి తెలివిని; సమయస్పూర్తినీ తెలియచేస్తూ, మనకికూడా తెలివిని ఇస్తాయి.

  భవదీయుడు,
  మాధవరావు.

  • మీరు కూడా ఇలాంటి సంఘటనలు మీ బ్లాగులో రాస్తే చదవాలని ఉంది.

వ్యాఖ్యలను మూసివేసారు.