అశాశ్వతం

ఇక్క్యూ అనే జెన్ గురువు చిన్నప్పటి నుంచే చాలా తెలివైన వాడు. అతను విద్యాభ్యాసం చేసే సమయంలో గురువు దగ్గర ఒక విలువైన టీకప్పు ఉండేది. అది చాలా పురాతనమైనది, విలువైనది. అది ఒకసారి పొరపాటున ఇక్క్యూ చేతిలోంచి జారిపడి పగిలిపోయింది. అతను ఆందోళనలో పడిపోయాడు. గురువు సమీపిస్తున్నాడనగా ఆ ముక్కలను తీసుకుని వెనక దాచుకుని
గురువును ఇలా అడిగాడు “మనుషులు ఎందుకు చనిపోవాలి?”
“అది చాలా సహజం. పుట్టిన ప్రతిదీ ఒక నిర్ణీత సమయం తరువాత మరణించక తప్పదు” అన్నాడా గురువు.

అప్పుడు అతను వెనుక దాచిపెట్టిన ముక్కలను చూపిస్తూ “మీ టీకప్పుకు కూడా ఆ నిర్ణీత సమయం దాటిపోయింది” అన్నాడు.

గురువు నవ్వుతూ అతని భుజం తట్టాడు.

4 thoughts on “అశాశ్వతం

  1. నాకో ఐడియా వచ్చింది. ఈసారి ఇంట్లో ఏదైనా నా కర్మకాలి పగిలితే అప్పుడు ఆ నిర్ణీత సమయం దాటిపోయింది అని ఒకమాట చెప్పి తప్పించేసుకొంటాను. ఎలా వుంది ఐడియా.

  2. లలిత గారు

    చిన్నప్పుడని ఏముంది ఇప్పుడు చేయి జారుతుంటాయి కదా అందుచేత ఇప్పుడు కూడా ఈ మంత్రాన్ని ఉపయోగించవచ్చు. కాని ఫలితం మాత్రం చెప్పలేము. ఓ సారి ప్రయత్నించి చూడండి. తర్వాత మాకు చెప్పడం మరిచిపోవద్దే.

వ్యాఖ్యలను మూసివేసారు.