మే 2010, e-తెలుగు సమావేశం విశేషాలు

సమావేశానికి హాజరైన వారు

 1. వీవెన్ – వీవెనుడి టెక్కునిక్కులు
 2. సుజాత – మనసులో మాట
 3. సతీష్ యనమండ్ర – సనాతన భారతి
 4. అరిపిరాల సత్యప్రసాద్ – జోకాభిరామాయణం
 5. రవిచంద్ర – అంతర్వాహిని
 6. ప్రవీణ్ – సాహిత్య అవలోకనం
 7. కృపాల్ కశ్యప్ – కబుర్లు
 8. శ్రీనివాస రాజు – శ్రీనివాసీయం
 9. శ్రీనివాస కుమార్ – జీవితంలో కొత్తకోణం
 10. ఎమ్మెస్ నాయుడు – ఎమ్మెస్ నాయుడు
 11. శ్రీహర్ష – కిన్నెరసాని

ఇంకా ఔత్సాహికులు సాయిరాం (జ్యోతిష శాస్త్రజ్ఞులు), శ్రీకాంత్ పాల్గొన్నారు.

చర్చకు వచ్చిన అంశాలు:

 • ముందుగా అరిపిరాల గారు, బ్లాగర్ల సమావేశం, e-తెలుగు సమావేశం మద్య నిర్దిష్టమైన విభజన రేఖ ఉండాలని సూచించారు. e-తెలుగు తరపున కథల పోటీ, అంతర్జాల అవధానం లాంటివి నిర్వహిస్తే సంస్థకు మరింత ప్రచారం చేకూరగలదని అభిప్రాయపడ్డారు.
 • e-తెలుగు తరపున చేపట్టబోయే రచయితల వర్క్‌షాప్ ఈ నెల 30 వతేదీన నిర్వహించాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ప్రస్తుతం ఇందులో వీవెన్, కశ్యప్, సుజాత, అరిపిరాల సత్యప్రసాద్, రవిచంద్ర, తదితరులు సభ్యులుగా ఉన్నారు.

 • ప్రస్తుతం అంతర్జాల మాద్యమంలో ఉన్న కొంత సాహిత్యం పత్రికల్లో వచ్చే సాహిత్యం కన్నా మంచి నాణ్యత కలిగి ఉండటం గమనించే ఉంటారు. వీటిని ముద్రణలోకి తీసుకెళ్ళేందుకు e-తెలుగు ఏమైనా చేయగలదా? అనే విషయం కూడా చర్చకు వచ్చింది.

8 thoughts on “మే 2010, e-తెలుగు సమావేశం విశేషాలు

 1. […] This post was mentioned on Twitter by srinivas karasu. srinivas karasu said: Telugu blogs@ మే 2010, e-తెలుగు సమావేశం విశేషాలు: సమావేశానికి హాజరైన వారు వీవెన్ – వీవెనుడి టెక్కునిక్కులు సుజాత –… http://bit.ly/crs1y8 […]

  • పరవాలేదు. వచ్చే నెలలో హాజరు కావడానికి ప్రయత్నించండి.

 2. నేను ఈ సమావేశానికి వద్దామనుకున్నాను
  బతికిపోయానురా దేవుడా
  మార్తాండ సాక్షాత్కారం కలిగిందా
  ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో
  మే తొమ్మిదన మీ అందరికీ విమోచనం (మార్తాండ కధ) కలిగింది

 3. కృష్ణకాంత్ పార్క్ లో మధ్యాహ్నం కలిగిన sunstroke కంటే సాయంత్రం మార్తాండ తో సమావేశం ఇది చాలా డేంజెర్

  రవిచంద్ర గారు
  ఫోటోలు పెట్టండి ప్లీజ్ చూసి తరిస్తాం

 4. రవి గారూ
  సమావేశం ఎక్కడ జరిగిందో రాయలేదు.
  ఇంకా వివరాలు తెలిస్తే బావుండేది అనిపించింది

  • సమావేశం హైదరాబాద్, యూసుఫ్ గూడా, కృష్ణకాంత్ పార్క్ లో జరిగింది. ఒకవారం పాటు నా బ్లాగులో సైడ్ విడ్జెట్ గా ఉందండీ సమావేశం స్థలం. తెలిసుంటుందేమో అనుకున్నాను.

వ్యాఖ్యలను మూసివేసారు.