తప్పు-ఒప్పు

జపాన్ లో ఓ బౌద్ధ గురువు మంచి ఆధ్యాత్మిక వేత్తగా పేరు గాంచాడు. మంచి పేరుండటం వల్ల ఆయన వద్ద ఆధ్యాత్మిక సాధన కోసం విద్యార్థులు దేశం నలువైపుల నుంచి తరలి వచ్చేవారు. ఒకసారి అలా అభ్యాసం సాగుతుండగా ఒక విద్యార్థి దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. మిగతా శిష్యులు దాన్ని గురువుకు ఎరుక పరచి సదరు శిష్యుడిని ఆశ్రమం నుంచి బహిష్కరించాల్సిందిగా కోరారు. కానీ ఆయన మాత్రం దాన్ని గురించి ఏమీ పట్టించుకోలేదు.

తరువాత కొన్ని రోజులకు అదే విద్యార్థి మళ్ళీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అప్పుడు కూడా ఆ గురువు దాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈసారి మిగతా శిష్యులకు బాగా అసంతృప్తి కలిగింది. అందరూ కలిసి  గురువుకు ఒక లేఖ పంపారు. తక్షణమే ఆ శిష్యుణ్ణి ఆశ్రమం నుంచి పంపించేయక పోతే  తామంతా వెళ్ళిపోతామని దాని సారాంశం.

గురువు ఆ లేఖను చదవగానే అందర్నీ తన ముందుకు పిలిచి

“నాయనలారా? మీరంతా విజ్ఞత గలవారు. మీకు ఏది మంచో ఏది చెడో తెలుసు”.

“మీరు ఇక్కడ కాకపోతే మరో చోటనైనా లక్షణంగా చదువుకోగలరు. కానీ మీ సహోధ్యాయికి ఏది తప్పో ఏది సరియో తెలియదు. అతనికి నేను కాకపోతే ఇంకెవరు ఉపదేశిస్తారు. కాబట్టి మీరు అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయినా నేను మాత్రం అతన్ని ఇక్కడే ఉంచుకుంటాను”

అన్నాడు స్థిరంగా…

పక్కనే ఉండి ఇదంతా ఆలకిస్తున్న దొంగతనానికి పాల్పడ్డ శిష్యుడి నయనాలు అశ్రుపూరితాలయ్యాయి. ఆనాటి నుంచి తన పద్ధతులు మార్చుకుని గౌరవప్రదమైన జీవితం గడపసాగాడు.

12 thoughts on “తప్పు-ఒప్పు

 1. దొంగతనాలు చేసేవాళ్ళు అంత సులభంగా మారరు. అలాగైతే ప్రపంచంలో ఇన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఎందుకు ఉంటాయి?

  • చెరసాల శర్మ,
   నువ్వు బైరాగి ఆశ్రమం లో చేరడానికి ఫిక్స్ అయ్యిపోయావు అనుకుంటా అక్కడ ఏం చెయ్యాలో చెయ్యకూడదో కూడా అప్పుడే డిసైడ్ చేసేసినావా ?
   ఈ మధ్య నీ చాలెంజ్ లు మాకు కనిపించడం లేదు
   సరదాగా ఒక చాలెంజ్ చెయ్యు బ్లాగుల్లో కాస్త కామెడీ దొరుకుతుంది మా అందరకీ

  • పోలీస్ స్టేషన్లు , కోర్టులు ఉన్నది కూడా నేరస్తుడిలో పరివర్తన తీసుకురావడానికే. ఈ కథలో గురువు అదే పని చేశాడు.

 2. నరికేయండి, శర్మ గారు చెప్పినట్టు కాళ్ళు చేతులు నరికేయండి

 3. ప్రవీణు

  ఇదే కధ నువ్వు రాస్తే దొంగతనం బదులు వదిన ని రీప్లేస్ చేస్తావేమో
  ఇంత మంచి పోస్ట్ రాసినందుకు నీ లాంటి కామెంట్లు రాయడం వల్ల ఈ వైపు కూడా రాకూడదు అని అనుకుంటారు

 4. ఒక స్వామిజీ తేలు కధ కూడా ఇలాంటి నీతినే చెబుతుంది.మాటి మాటికి కరుస్తున్న తేలుని ఒడ్డుకి చేరుస్తున్నారెందుకని అడిగిన శిష్యుడికి కరవడం తన లక్షణం అయిన ఆ తేలు పరోపకారం నా లక్షణం గా చెసుకొమ్మని నాకు పాఠంగా చెబుతుందని ఆ గురువు గారు చెబుతారు.
  చాలా చాలా మంచి కధ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు రవిచంద్ర గారు.

వ్యాఖ్యలను మూసివేసారు.