డార్లింగ్ చూసొచ్చా..

కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఏ సినిమా చూద్దామా అని ఆలోచిస్తుంటే మా రూమ్మేటు డార్లింగ్ కి వెళదాం అన్నాడు. కరుణాకరన్ సినిమాలు కనీస గ్యారంటీ ఉంటాయి కదా అని సరిపెట్టుకున్నా. తీరా సినిమా కెళ్ళాక నన్ను ఏ మాత్రం సంతృప్తి పరచలేదు.

జయాపజయాలతో సంబంధం లేకున్నా ప్రభాస్ ఇప్పటి దాకా నటనలో నన్నెప్పుడూ నిరాశపరచలేదు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఆకట్టుకోలేదు. కథలో అక్కడక్కడా కనిపించే చిన్న చిన్న ఆసక్తికరమైన మలుపులు తప్ప కథనంలో ఎక్కడా నవ్యత లేదు.

సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. ముక్కు మొహం తెలియని సంగీత దర్శకుడు. బయటకు వచ్చాక ఒక్క ట్యూన్ గుర్తుకు తెచ్చుకుందామన్నా గుర్తు రావడం లేదు. అలాగే అనంత శ్రీరామ్ పల్లవులు కూడా పెద్దగా ఆకట్టుకొనేలా లేవు. నటన చాలాచోట్ల కృతకంగా అనిపించింది. డ్యాన్స్ పెద్దగా లేదు.

అంతకంటే మించి ఈ సినిమా చూసింతర్వాత అసలు ప్రేమ అన్న పదం మీదే విసుగు పుట్టింది(ఇది కేవలం సినిమాల్లో ప్రేమ గురించి మితిమీరిన వాడకం పట్ల అని గమనించగలరు). అసలు ప్రేమ అనే పదం ఊసే లేకుండా ఒక సినిమా వస్తే చూడాలని ఉంది.

18 thoughts on “డార్లింగ్ చూసొచ్చా..

 1. నేనూ నిన్నె చూసొచ్చా….రెగ్యులర్ పిచ్చి కామెడీ లేకపోవడం కాస్త రిలీఫ్ ఈ సినిమా కి.నాకు ఓకే అనిపించింది ఈ సినిమా.కాకపోతే ప్రభాస్ డ్రెస్సింగ్ మాత్రం…….ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది లెండి దాని గురించి.కొత్త ట్రెండ్ అని చెప్తే ఏదయినా వేసెసుకునేట్లున్నాడు ఈయన అనిపించింది.ఒక పాట లో అయితే ఆడపిల్లలు వేసుకునే టాప్ లాఉన్నాయి బట్టలు.ఒకేలాంటివి ఒక 5 జతలు కుట్టించేసినట్లున్నారు.ఆడ వాళ్ళు పమిట సర్దుకున్నట్లు ప్రభాస్ మాటిమాటికీ జారిపోయే టీ చొక్కా ని పైకి లాక్కోవడం కామెడీ గా అనిపించింది నాకు.
  మీరన్నట్లే ‘లవ్ చేస్తున్నడే నిన్ను”,”నువ్వు లవ్ చేస్తున్నావా” ఈ మాటలు విని విని నాకూ విసుగొచ్చేసింది.

  • అవునండీ ప్రభాస్ డ్రస్సులు మరీ ఛండాలంగా ఉన్నాయి.

  • ఏమోనండీ… నాకు మాత్రం నచ్చలేదు. కాకపోతే ఇప్పుడు వచ్చే చాలా సినిమాల్లాగా కాకుండా అసభ్యతకు, అశ్లీలతకు దూరంగా ఉండటం మాత్రం పాజిటివ్ అంశమే….

 2. మాస్ మసాలాలు పెద్దగా లేవు ఈ సినిమాలో.కాబట్టి హిట్ డవుటే పైగా సింహం
  వచ్చింది గా మొన్న. రవి చంద్ర గారన్నట్లు అసభ్యం,అశ్లీలత లకి దూరం గా వుండే సినిమా చూడాలంటే చూడచ్చు.

 3. సూపర్ అని చెప్పను కాని. కాస్తంత చల్ల,చల్లగా కూల్ గా అనిపించింది నాకు. నిజం చెప్పాలంటే ప్రభాస్ కోసమే సినిమాలకెళ్తాను నేను. మరి అందుకేనేమో నాకు దుస్తుల విషయం లో ఎటువంటి కంప్లైంట్స్ లేవు…నటన అదీ పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఎటూ కళాఖండం కాదు కాబట్టి. పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం ఎదయినా ఉంది అంటే అవి ప్రభాస్ డాన్సులు. డార్లింగ్ లో డాన్సులు బాగ చేశాడు. అర్జున్ కి, జూ. ఎంటీయార్ కి పోటీ కాకపోయినా ఒక స్టేజ్ లో వాళ్ళిద్దరు ఎందుకో గుర్తొచారు.
  –సుధ

  • ఎంత కళాఖండం కాకపోయినా ప్రథమార్థంలో కాజల్ నటన చాలా కృతకంగా అనిపించింది. చూస్తుంటే అదో రకమైన ఇబ్బందిగా అనిపించింది. ప్రభాస్ నటన బాగాలేదని చెప్పను గానీ ఇంకా బాగా చేసి ఉండవచ్చని మాత్రం అనిపించింది.

 4. ప్రస్తానం చూడండి…మంచి సినిమా అని తప్పక అంటారు…మీరు చెప్పే ఆ ప్రేమా ఊసే ఉండదు…

 5. […] This post was mentioned on Twitter by srinivas karasu. srinivas karasu said: Telugu blogs@ డార్లింగ్ చూసొచ్చా..: కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఏ సినిమా చూద్దామా అని ఆలోచిస్తుంటే మా రూమ్మేటు డార్లి… http://bit.ly/d2bopf […]

 6. nenu kooda darling choosanu… assalu nachaledu! dresses or action or songs or story… nothing is impressive… dance lo improvement vundi prabhas ki…
  just movie locations valla evarikaina cool effect vachi vundachu…

 7. darling chusa, mee review bagundanipinchindi prabhas ki cinemala meeda intrest ledani ardam ayyindi
  atadi dresslu comedyga unnayi, cinema bagopoyina naaku badanipinchaledu endukante..pirated dvd kabatti monna koti mooka movie chusa hall lo enta papam chesano telisindi.

వ్యాఖ్యలను మూసివేసారు.