ఎవరతను?

ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అప్పుడే ఆఫీసులో అడుగుపెడుతున్నాడు.

దారి పక్కనే ఓ బక్కప్రాణి కుర్చీలో జారగిలబడి కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఎండీ డైరెక్టుగా అతని దగ్గరకెళ్ళి

“నీ జీతమెంత?” అని అడిగాడు.

ఉన్నట్టుండి అలాంటి ప్రశ్న ఎదురయ్యేసరికి ఆ యువకుడుకొంచెం తడబడి

“నెలకు 2000 దాకా సంపాదిస్తాను. ఎందుకు సర్?”

ఎండీ మరే సమాధానమివ్వకుండా జేబు లోంచి పర్సు తీసి 6000 రూపాయలు బయటకు తీసి అతనికిచ్చి,

“ఇక్కడ మేం జీతాలిచ్చేది శ్రద్ధగా పనిచేయడానికి, కుర్చీలో కూర్చుని పగటి కలలు కనడానిక్కాదు. ఇది నీ మూడు నెలల జీతం. ఇది తీసుకుని వెళ్ళిపో. మళ్ళెప్పుడూ నాకు కనిపించకు” అన్నాడు.

చుట్టూ చేరి ఆశ్చర్యంగా తిలకిస్తున్న ఇతర ఉద్యోగులను ఉద్దేశించి,

“చూశారుగా. అలా ఉంటే రేపు మీ గతి కూడా అంతే” అన్నాడు బాస్.

దానికి ఉద్యోగుల నుంచి  దిమ్మతిరిగే సమాధానం వచ్చింది.

“అతను పిజ్జా డెలివరీ బాయ్ సర్”

*నాకొచ్చిన ఈ మెయిల్ ఆధారంగా…credits to లలిత

11 thoughts on “ఎవరతను?

  1. హహహా…మా ఫ్రెండు ఆఫీసులో కూర్చున్నప్పుడు నన్ను వాళ్ళ బాస్ ఇలా అపార్ధం చేసుకుంటే బాగుండు.(నా జీతాన్ని డాలర్లలో చెప్తా)

  2. హ హ్హ
    సూపర్
    చివరలో అందరికంటే ఎక్కువ బాధ పడేది డెలివరీ బాయ్ అనుకుంటా
    ఐదు వేలు అని చెప్పి ఉంటే 15000 దాకా వచ్చేవి అని 😛

వ్యాఖ్యలను మూసివేసారు.