ఇది ఆరని కాష్టమేనా

ఉదయం అమరులైన 74 మంది జవాన్లు గురించి ఎన్డీ టీవీలో ప్రత్యేక బులెటిన్ ప్రసారం చేస్తుంటే చూస్తున్నా.

ఒక్కో జవాను కుటుంబానిదీ ఒక్కో గాథ. హృదయ విదారకంగా ఉంది.

భర్త మరణ వార్త వినగానే స్పృహతప్పి పడిపోయి ఇప్పటికీ లేవని నిండు చూలాలు,

జనన మరణాల గురించి ఏమీ తెలియక అమాయక చూపులు చూస్తున్న కుమారుడిని హృదయానికి హత్తుకుని గుండెలవిసేలా రోదిస్తున్న మరో ఇల్లాలు.

ఇలా ఎంత మందో..

ఏళ్ళు గడుస్తున్నా నక్సల్ సమస్యకు సరైన పరిష్కారం కనుగొనలేని నిర్లక్ష్యపు పాలకులు,

ప్రజల కోసం, సమాజం కోసం పోరాడుతున్నామని భుజాలు చరుచుకుంటూ, సమాజానికి కీడు తలపెడుతున్న అవినీతి నాయకులను, అధికారులనూ, రౌడీలనూ, బంధిపోట్లనూ  వదిలేసి దేశరక్షణకు నియమింపబడ్డ జవానులను బలిగొంటున్న నక్సలైట్లు.

మధ్యలో ఈ అమాయకులే సమిధలు.

8 thoughts on “ఇది ఆరని కాష్టమేనా

  1. అదేమిటో రవిచంద్ర గారు,ఇది రెండో సారి,మీరు పోస్టిన టాపిక్ మీదే నేను కూడా పొస్టాను.కాకపొతే నా పొస్టులో పూర్తిగా విరుధ్ధమయిన అంశాలు మళ్లీ!మన అభిరుచి ఒకటయిన ఆలోచన తీరు చాలా వేరు!

  2. నక్సల్ సమస్య,పాత బస్తీ అల్లర్లు,కాశ్మీరు సమస్య నా చిన్నపటి నుండీ వింటూనే వున్నాను.వీటికి పరిష్కారం వస్తుందనుకోవటం భ్రమ.

  3. నక్సల్ ఉద్యమం ఏనాడో గతి తప్పింది. ఇప్పుడు ప్రస్తుతం ఒకరి మీద ఒకరు ప్రతీకారం తీర్చుకొంటున్నారు. నాయకులదేమిపోయింది హాయిగా ఎ.సి. గదులలో కులుకుతారు. చిత్తశుద్దా పాడా.

  4. యిది అత్యంత బాధాకరమైన విషయమే అయినా బస్తర్ ప్రాంతంలో సల్వాజుడుం పేరుతొ ఆదివాసీలపై జరిగిన దారుణాలు చదివితే ఇది వారి ప్రతీకారంగా అర్థమవుతుంది. పాలక వర్గాలు మన వేలితో మన కన్నునే పొడిచే సాధనాలుగా వాడుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు గ్రీన్ హంట్ మొదలిడడానికి కారణం ఆ ప్రాంతంలో వేదాంత కంపెనీ వారి పెట్టుబడులు. వారికి లాయర్ గా పనిచేసిన చిదంబరం వారికి అడ్డు తొలగించే పనిలో వున్నాడు. ఆ కంపెనీ వారి నుండి బ్రిటిష్ చర్చి మొ.న వారు పెట్ట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఆ ప్రాంత ఆదివాసీలు మాది నిజమైన అవతార్ పోరాటమని ప్రపంచానికి విన్నవించుకున్నారు. ఈ వార్తలు చూసే వుంటారు. ఇప్పటికి పారా మిలటరీ బలగాలు, నాగా బెటాలియన్ ల అండతో సల్వాజుడుం ప్రైవేటు సేన 3000 మందికి పైగా గిరిజన స్త్రీలను చేరిచి చంపేసాయి, మొన్నటి సంఘటన రోజు జీ చానల్ (హిందీ) వార్తలలో చెప్పారు. ఇలాంటి వాస్తవాలు మన మీడియాలో రావడం లేదు. ఇది వాటికి ప్రతీకార చర్యే. సమర్ధనీయమా కాదా అన్నది అక్కడి వారి నిలవలేని పరిస్థితి చుసిన వారికి అవగతమవుతుంది.

వ్యాఖ్యలను మూసివేసారు.