ఆధునికత పేరుతో పాటను ఖూనీ చేసే విధంబెట్టిదనిన…

ఈ మధ్య కాలంలో ఫాస్ట్ బీట్ పేరుతో పాటల్లో సాహిత్యాన్ని ఖూనీ చేస్తుంటే నాకు ఎలా ఉంటుందో చెప్పడమే ఈ టపా ఉద్దేశ్యం.

పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లా అనే విజయవంతమైన పాటను ఇలా రీమిక్స్ చేశారు…

పచ్చగడ్డి.. పచ్చా పచ్చా పచ్చా…. పచ్చగడ్డి… పచ్చా పచ్చా…. ఇలా అన్నమాట.

పదాలను  ఇష్టమొచ్చినట్లు విరిచేసి ఖండా ఖండాలుగా  నరికేసి  మోడర్న్ కాకులకూ, గద్దలకూ వేసేయడమేనా ఆధునికత అంటే…

ఇలా పాడుతున్నపుడు నా స్వేద రంధ్రాల్లో సూదులు గుచ్చినంత సంబరంగానూ, నర నరాల్లో నిప్పెంటినంత ఆనందంగానూ ఉంటుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను అధ్యక్షా…

సూపర్ హిట్ అని ఆకాశానికెత్తేయబడుతున్న బిల్లా సినిమా  పాటలో

యాడుందే తాలీ (బాబూ! నార్త్ ఇండియన్ తాలీ నా? సౌత్ ఇండియన్ తాలీ నా?)

ఐ వొణ వొణ (ఏందబ్బా ఈ రణ గొణ?)మేక్ యూ ఆలీ

గిమ్మీ మై తాలీ (మళ్ళీ అదే) మై లైఫీస్ కాలి కాలీ (కాలి కాలి బూడిదైపోయిందా తల్లే….)

ఈ టపా ఇక్కడి దాకా రాసేసి నిద్రకుపక్రమించాను.

రాత్రి కల్లో నేను బెత్తం తీసుకుని ఈ పాట పాడిన హేమచంద్రను, మాళవికనూ చెడా మడా వాయిస్తున్నాను తాళి, ఖాళీ అనే పదాలు సరిగ్గా పలికేదాకా… 🙂

24 thoughts on “ఆధునికత పేరుతో పాటను ఖూనీ చేసే విధంబెట్టిదనిన…

 1. ఎందుకండీ అంత బాధ!చూడ్డం మానేస్తే పొలా?
  నేను తెలుగు సినిమా చూడడమే మానేసాను.గమ్యం,గ్రహణం లాంటివి తప్ప!
  అలాగే చచ్చినా తెలుగు న్యూస్ చానెల్ అసలే చూడను.
  తెలుగు టీవీ చానెల్ లో పాటల ప్రొగ్రాములు వినడం కూడా చెయ్యను.
  అఫ్‌కోర్స్ అందువలన ఒక్కొసారి బ్లాగెటప్పుడు తెలుగు పదాలు గుర్తుకి రాక కష్టమనిపించినా ఇప్పుడు ఓకే!
  మంచి పుస్తకాలు చదవడం మాత్రం మొదలుపెట్టాను.వాటితొ మాత్రం ఏ బాధ లేదు!

  • చాలా మంది కొత్త గాయకులు సరైన ఉచ్చారణతో బాగా పాడుతున్నారండీ. వాళ్ళకోసం చూస్తాను.

  • అవునండీ హేమచంద్ర చాలా చక్కగా పాడతాడు. కానీ ఈ పాటలో ఎందుకిలా (తాళి అనే పదాన్ని తాలి అని) పాడాడో అర్థం కాలేదు.

  • హ హ 🙂 భలే ఉన్నాయి పేర్లు. ఇలా పేరు బెట్టి పిలిస్తే వాళ్ళకి ఖూనీ చేయడం వల్ల కలిగే బాధేంటో తెలుస్తుందనుకుంటా…

 2. హ హ హ.
  చిరుత సినిమాలో ఒక కామెడీసీన్లో ఒక సెక్యూరిటీ గార్డుంటాడు. వాడికి సినిమా పాటల పిచ్చి. వాణ్ణి మాయపుచ్చడానికి చరణ్, వేణుమాధవ్ మాటల్లో పెడతారు .. వాడు కూడా రీమిక్సులు చేస్తాన్సార్ అని చెప్పి పండు వెన్నెల పండు పండు ప ప ప ప పండు వెన్నెల జాబిలీ …అని

  • అదేం జాఢ్యమో తెలియదండీ, నత్తి వచ్చినట్లు ఒకే అక్షరాన్ని మళ్ళీ మళ్ళీ పలికేసి రీమిక్సులని పేరు పెట్టేస్తుంటారు.

  • నిజమే….సంగీత దర్శకులు శ్రద్ధ పెట్టాల్సిన విషయమే. కానీ కొన్ని చోట్ల గాయకుల ఇంప్రొవైజేషన్ కోసం వదిలేస్తే కూడా ఇలాంటి చచ్చు ప్రయోగాలు చేస్తుంటారు.

 3. అవునండీ అందరం బాధితులమే .. సినిమా కు వెళ్లకపోయినా,
  తలనొప్పి తగ్గించుకోవటానికి టీ కొట్టు దగ్గర వెళ్తే అక్కడ ఇదో తలనెప్పి కదా.. అలా విన్న ఓ రెండూ పాట ల గురించి నేను బ్లాగుదామనుకుంటున్నా

  • మీరు తప్పకుండా రాయాల్సిందేనండీ….నేను మీ టపా కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

 4. well said sir,
  kaakapothe andaru kaadu sir,
  kontha mandi like ar rahman kaani keeravaani kaani yuvan kaani harris jayaraj kaani manisharma kaani manchivikudaa isthunnaru , kaakapothe takkuva.

  eey madhya vacche caallaku bhasha meeda pattu ledu , edo atladuthunnaru anthey kaani , manchi base ledu , uccharana teluvadu . mukhyangaa mana indian established singers ne theesukondi ……udit narayan unnadu , entha goppa singer , sadhana sargam unnadi ,entha sweet singer kaani uchharana dosham undi .
  ade malli ADNAN SAMI unnnadu telugu tamilam la lo padadu . entha baaga paadadu .. okka saari ayana paadaina telugu songs vinandi ” yuva movie lo nundi, inkaa shankar daada MBBS and shankar dada zindabad nundi vinandi. ..telugu aayanaku touch leka poyinaa uchcharana doshalu ekkuva gaa lekundaa ela paadado vinandi …..enduku cheputhunnantey adey udit kaani sadhana sargam kaani ela paaduthunnarantey , anni uchharana doshaley , oka song kaadu inkoti kaadu .. prati song lo nu spashtangaa telisey laaga doshalu.
  eey bharateeya bhasha touch leni adnan sami baaga paadangaa lendi veellaku emochchindi ….eey madhya native singers kudaa atlaagey pothunnaru …..

  inkokati music xompostion kuuda motham western style lo ne untundi andukey….. oooo prema ….badulu gaa auuu phrrrreeeemmmaaaa ani videesi chinchi namili mingi paadutunnaru…..

  eey vishayam lo ar rahman nundi chakri daaka antaa okatey ayyaaaru….

  inkokati entantey eey madhya prekshakulaku kuda bhasha teluvadu , edo stylish gaa paaduthunnamanukuntunnaru ….
  ikkada oka music director gurinchi cheppali

  adey mana mickey j meyor ,,.
  atani songs elaa untaayantey chappati koora laaga untaayi. enta manchi saahityamunna kaani , endukantey eeayana songs lo majority varaku melody kosam try chesthu bhasha gurinchi pattinchukodu…correct gaa vinandi , songs lo uccharana undadu , vottulu deergaala pattimpu undadu mukhyan gaa vottulu vundavu.. adi songs kudaa aaa feel lekundaa singers tho paadisthaadu ….
  ikkada ar rahman tho polchithe purthy viruddham … rahman songs lo kudaa akadakka vattulu deergaala pattimpu undadu kaani manchi feel tho paadisthaadu .
  idi cover chesthundi daanini…..

  mickey eey vishayam lo nerchukovaali…

  maroka vishayam direcor lu kuda edo okari kinda dance master lu gaa no ledaa camera men kaano assistant directors gaano chesi vasthunnaru … chaala mandiki ituvanti uccharana sangathulu emi pattavu,,, edo hero vachhada, gun to kaalchaadaa heroine to kalisi egiraadaa , rendu maass songs ade dappu lato vaayinchadaalu, rendu edo artham kaani songs pettaraa , ade edo fast beat songs , veetlalo beats ey kaani song vinipinchadu…….itlaa undi neti taram directors di….
  kontainaa creativity ledu ….
  eppudu choosinaa hero vasthe sumo lu paiki levatam, addangaa narukuthaa, kanti choopulato champutha , pitthi champutha ani penta dilogulu thappisthe emi undavu…..

  eey vishayam lo mana lyricists baagane unnaru ley ..
  veellani anataaniki ledu

  deeniki okati directors manchi vaallu raavali , prekshakulu manchi music ni encourage cheyaali , manchi music directors raavali ……

  mukyangaa manaki bhasha konchem teliyaali

  neenu kuda oka article raaddamanukunnadi ikkada raasthunnanu …….

  atlaagey manchi song to relax kaandi ……

  eey song lo fusion of nadaswaram and western classical ni vinandi .. entha baagaa undoo vinandi….
  appudappudu itlanti songs kuddaa vasthuntaayi mari……..andukondi

 5. నేలకు రంగులు నీ వరమా? అనేది తప్ప మిగతాది అంతా self explanatory అని పిస్తుంది.
  అంతకంటే మించి ఏదైనా అర్థం ఉంటే వివరించగలరు.
  నేలకు ఈ రంగులు నీ వరమా అంటే నీ వల్ల వర్షాలు కురిసి భూమ్మీద పచ్చని ప్రకృతి వర్ధిల్లుతోంది అని అర్థం చేసుకున్నాను.

 6. ప్రతీ చింత పండు అమ్ముకునే సన్నాసీ డైరెక్టరూ,మ్యూజిక్ డైరెక్టరూ ఐపోతే ఇలాగే ఉంటుందండీ! 🙂

  ముందు మ్యూజిక్ డైరెక్టర్లని కూర్చోబెట్టి ఒక సంవత్సరం పాటు తెలుగు భాషలోని 56 అక్షరాలనూ ఎలా పలుకుతారో నేర్పించాలి.తరవాత పాటగాళ్ళు అందరికీ ఒక సంవత్సరం ,సంవత్సరంన్నర వరకూ తెలుగు భాషలో అక్షరాలు-వాటి ఉచ్చారణా విధానాలు అనే పాఠం వల్లె వేయించి అక్షరాల పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గితేనే వాళ్ళతో పాటలూ అవీ పాడిస్తే బాగుంటుంది.

వ్యాఖ్యలను మూసివేసారు.