నాడు బాలకార్మికుడు – నేడు వైద్యవిద్యలో అగ్రగణ్యుడు

తండ్రితో శివప్రసాద్
తండ్రితో శివప్రసాద్

పదమూడు సంవత్సరాల క్రితం(1997 లో) కర్నూలుకు చెందిన ఈశ్వరప్ప అనే ఒక మామూలు సెక్యూరిటీ గార్డు కుమారుడు  శివప్రసాద్  తల్లిదండ్రులు తనను చదివించే స్థోమత లేకపోవడంతో కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటం కోసం ఒక జౌళి మిల్లులో పని చేసేవాడు.

ఒక రోజు ఆ ఫ్యాక్టరీని పరిశీలించడానికి వచ్చిన శివకుమార్ రెడ్డి అనే అధికారి రోజుకు 26 రూపాయలు సంపాదించడం కోసం ఆ అబ్బాయి చదువుకు పుల్‌స్టాప్ పెట్టి అక్కడ గోతాలు(గోనెసంచులు) కుట్టే పనిలో చేరాడని తెలిసి చలించిపోయాడు.

వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, ఆ అబ్బాయి చదువుకు అవసరమయ్యే ఖర్చును తను భరిస్తానని చెప్పి ఒప్పించాడు. శివప్రసాద్ ఆ అధికారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. 2002 లో జరిగిన పదోతరగతి పరీక్షల్లో 600 కి గాను 512 మార్కులు సాధించాడు. ఇంటర్మీడియట్ ఒక ప్రభుత్వ కళాశాలలో చేరి 1000 కి 841 మార్కులు సాధించాడు. కానీ ఎంసెట్ లో ర్యాంకు సరిగా రాకపోవడంతో 2004 లో ఉచిత సీటు దొరకలేదు. ఒక సంవత్సరం పాటు కష్టపడి మరుసటి సంవత్సరం నంద్యాల లోని శాంతీరామ్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు సాధించాడు.

ఇటీవలే ప్రకటించిన ఫలితాల్లో 73.4 శాతం మార్కులతో కళాశాలలోనే ప్రథముడిగా నిలిచాడు.

మూలం:

టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్

ది హిందూ ఆర్టికల్

ప్రకటనలు

8 thoughts on “నాడు బాలకార్మికుడు – నేడు వైద్యవిద్యలో అగ్రగణ్యుడు

  1. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో కూడా ఒకబ్బాయి ఇలానే తన ప్రతిభను చాటాడండి.అమ్మ ఇరవై రూపాయల కూలీ ,అబ్బాయి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‍లో ఉండి చదువుకున్నాడు .పదవ తరగతిలో మంచి మార్కులు సాధించడంవల్ల అతని ఉపాధ్యాయులే ధన సహాయం చేసారు,తర్వాత ఇంటర్మీదియెట్‍లో కూడా మంచిమార్కులు తర్వాత ఎమ్‍సెట్‍లో మంచి ర్యాంకు సంపాదించి ఇంజనీరింగ్‍లో చేరాడు.

    • ఇలాంటి వాళ్ళను గూర్చి మనమే ప్రపంచానికి పరిచయం చేయాలండీ.. జీవితంలో ఎన్ని డక్కామొక్కీలు తిన్నా అలుపెరుగక పోరాడి విజయం సాధించే వాళ్ళు మనకు ప్రేరణగా నిలవాలి.

  2. బ్లాగ్ స్పాట్ బ్లాగ్ లలో కామెంట్ పెట్టబోతే “We’re sorry, but we were unable to complete your request” అని ఎర్రర్ వస్తోంది. మరి ఎలా కామెంట్ పెట్టాలో చెప్పగలరా.

వ్యాఖ్యలను మూసివేసారు.