అవే తప్పుకుంటాయి…

bumpy road 2ఓ నిరక్షరాస్యుడైన మంత్రి ఓసారి కార్లో తన గ్రామానికి వెళుతున్నాడు.

రోడ్డు బాగా లేకపోవడంతో కారు బాగా కుదుపులకు లోనవుతోంది.


ఆ మంత్రి డ్రైవర్ ను ఉద్దేశించి “ఏంటయ్యా కారు అలా ఊగిపోతుంది?” అన్నాడు


“రోడ్డంతా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి సర్” అన్నాడా డ్రైవర్ సగం ఇంగ్లీషులో, సగం తెలుగులో మాట్లాడుతూ


“ఆ ఉంటే ఏంటి? హారన్ మోగించు అవే పక్కకు తప్పుకుంటాయి” అన్నాడా మంత్రి.

15 thoughts on “అవే తప్పుకుంటాయి…

  1. నాకు తెలిసి ఆంధ్ర ప్రదేశ్ నాయకులలో అతి తక్కువ చదువుకున్నది తల్లా అంజయ్య గారు. అతను చదివినది టెంత్ క్లాస్ వరకు. అక్షరం ముక్క రాని నిరక్షరాస్యురాలు ముఖ్యమంత్రి అయినది మాత్రం బీహార్ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి అయిన తరువాతే చదవడం, వ్రాయడం నేర్చుకుంది రబ్రీ దేవి.

  2. అతని పూర్తి పేరు తల్లా రామకృష్ణారెడ్డి. అతను రాజకీయాలలోకి రాకముందు దినసరి కూలీగా పని చేశారు.

  3. రవీ,మన ప్రియతమ స్వర్గీయ ముఖ్యమంత్రి అంజయ్య గారి పై యీజోకు ఎక్కడో చదివినట్లు గుర్తు. ముఖ్య మంత్రిగా ఆయనపై చలోక్తులు చాలా వచ్చాయి. మీ ఫోటొ కూడా బాగుంది. అభినందనలు.
    శ్రీక్రీష్ణకాంత్ పార్క్ సమావేశ ఫోటొలు మరికొన్ని ప్రచురించాను. చూడండి.. గిజిగాడు.

వ్యాఖ్యలను మూసివేసారు.