మా ఊరి పండగ

గతనెలలో మా స్వగ్రామంలో జరిగిన అగ్నిగుండ ప్రవేశం దృశ్యాలు చిత్రీకరించాను. కాకపోతే అవి పరిమాణం పెద్దవిగా ఉండటం వల్ల యూట్యూబ్ లోకి ఎక్కించలేకపోయాను. వాటి కోసం వీడియో కన్వర్టర్లు వెతికి పరిమాణం తగ్గించి ఎక్కించేసరికి ఇదిగో ఇప్పటికి వీలుపడింది. మరి కొన్ని వీడియోలకోసం ఈ లింకును సందర్శించండి.

ప్రకటనలు

8 thoughts on “మా ఊరి పండగ

 1. మీరు ప్రత్యక్షంగా చూసారు కదా కాళ్ళు, చీరలు వేడికి కాలకుండా ఎలా ఉన్నాయి.

 2. సుధ గారూ, ప్రత్యక్షంగా చూడటమే కాదు నేను కూడా నడిచాను. మనసు నిండా భక్తిని నింపుకుని చేస్తారు కాబట్టి ఎవరూ కాలిందని చెప్పగా నేను వినలేదు. ఫోటోల కోసం ఇంతకు ముందు టపా రండి రండి పతిత పావన రంగని చూడరండి చూడండి.

 3. రవిచంద్ర గారు:

  చాలా బాగుంది ఈ విడియో.

  ముఖ్యంగా నాకు ఇందులో క్లారిటీ బాగా నచ్చింది.

  దీన్ని గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నా. మీ నంబరు ఇవ్వగలరా?

  అన్నట్టూ, ఇది ఏ వూళ్ళో?

  అఫ్సర్
  afsartelugu@gmail.com

  • Thanks very much. ఇది శ్రీకాళహస్తికి సమీపంలోని మా ఊరు చేమూరు లో తీసినది. ఇలాంటి పండగ మా చుట్టుపక్కల ఊళ్ళో కూడా జరుగుతాయి. ఈ సాంప్రదాయం ప్రారంభమైంది కూడా కడప జిల్లా నుంచి.
   I am sending my number to your mail….

  • అన్నట్టు ఈ వీడియో నేను తీసింది కాదు, నేను కూడానడిచా కదా… నా కెమరా పెద్దగా అనుభవం లేని వాళ్ళ చేతికివ్వడం వల్ల అలా జరిగింది. అందులో నా కెమెరా వీడియో కోసం ఉద్దేశించింది కూడా కాదు.

 4. వీడియో బాగుంది. హేతువాదులు, జనవిజ్ఞాన వేదికలు వంటివి ఎన్ని చెప్పినా ప్రజలలో అంతర్లీనంగా ఉన్న భక్తితత్వం ఈ లోకాన్ని నిలబెడుతోందేమో.

వ్యాఖ్యలను మూసివేసారు.