పాపం ఉత్తరప్రదేశ్ ప్రజలు

ఉత్తర ప్రదేశ్ జనాల్ని చూస్తే నాకు జాలేస్తుంది. ఓ పక్క ములయాం.. ఓ పక్క మాయావతి.. దొందూ దొందే… ఎవర్ని ఎన్నుకున్నా తీరు మారదాయే..

ఒక్క పదిరుపాయల కోసం క్యూల్లో నిలబడి తొక్కిసలాటలో జనాలు చచ్చిపోతుంటే ఈవిడకు మాత్రం నోట్లతో కోట్ల రూపాయల దండలు కావాలసివచ్చాయట.. ఔరా! ఎంత దౌర్బాగ్యం పట్టిందిరా మన దేశానికి…

మన దేశం డబ్బుండీ పేద దేశం అయింది ఎందుకంటే ఇలాంటి చీడ పురుగుల వల్లే..డబ్బును ఇనప్పెట్టెలో పెట్టి పూజ చేసుకుని పీనాసి పీనుగుల వల్లనే..

ఓ పక్క ఆకలితో అన్నమో రామచంద్రా అని జనం అల్లాడుతుంటే ఈమెమో కోట్లు బెట్టి విగ్రహాలు పెట్టిస్తుందట..
“ఎవడిక్కావాలండీ ఈ విగ్రహాలు.. కూడు పెడతాయా? గుడ్డ పెడతాయా? ” అని నాయకులను నిలదీసి సాగనంపే రోజు వస్తుందా?

ప్రకటనలు

11 thoughts on “పాపం ఉత్తరప్రదేశ్ ప్రజలు

  1. ఈవిడ నిఝంగా అదో టైపు.క్రిందటి సారి ఎలక్షన్ల టైము లో ఆస్తులు విలువ తెలిపినప్పుడు ఐదు సంవత్సరాల్లలో ఇంత ఆస్తి ఎలా కూడపెట్టారని విలేఖర్లు అడిగితే ఆవిడ సమాదానం: మిగిలిన రాజకీయనాయకుల తో పోల్చుకుంటే తమ నాయకురాలు ఇంత బీదరాలా అని నామోషి చెంది వారి కార్యకర్తలు చందాలు వసూలు చేసి ఆమె కి ఆస్తులు కట్టపెట్టారంటా!!!

    • కావచ్చు కానీ వాళ్ళ పరిస్థితి మనకన్నా ఘోరంగా ఉందని చెప్పడమే నా ఉద్దేశ్యం.

  2. Eerojullo mana desam lo etuvaipu choosina elanti saghatanalu chavi chustunnamu. Rajakiya vettalu tama tama svarthamukosam prajala sommu ni , guoravamu ni mattikaluputunnaru. Atu uttarpradesh lo aina , itu andhrapradesh lo aina thiru okkate . Okkokkasari democracy kanna , monarchy unte desam marugupadutundani anipistundi.

    Kaani maarpu mana andari alochana loni ravali .okka rajakiya vettalani anukuni labham ledu..Naku telisinantha varaku “Andaru Dongale.” mana praja Swamyam lo…Marpu raaadu ….Tevaali…evaro rajakiyavettalu kaadu …Manamu..

వ్యాఖ్యలను మూసివేసారు.