ఈ నెల బ్లాగర్ల సమావేశం

హాజరైన వారు: సీబీ రావు గారు, నేను, చక్రవర్తి గారు, అరిపిరాల సత్యప్రసాద్ గారు.

ఒకరోజు సెలవు పెడితే నాలుగు రోజులు స్వస్థలంలో గడిపిరావచ్చనుకున్నారేమో చాలా మంది సమావేశానికి హాజరు కాలేదు. (బాబూ, మీరామాట చెప్పుంటే నేను కూడా ఎంచక్కా ఊరికి చెక్కేసుండే వాణ్ణి కదా! 🙂 )

హాజరైంది నలుగురమే.. కానీ మంచి ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకున్నాం. సత్యప్రసాద్ గారు ఇ-తెలుగు సభ్యులుగా చేరారు. ఇ-తెలుగు ద్వారా ఏమేం చేయవచ్చో కొన్ని సూచనలు కూడా చేశారు.

మైక్రోఫైనాన్స్ లో పనిచేస్తున్న అరిపిరాల గారు దాని గురించి మాకు చక్కటి విషయాలు తెలియజేశారు. ఇంకా కథా సాహిత్యం గురించి, కథలెలా రాయాలి ఇత్యాది విషయాల గురించి మాట్లాడుకున్నాం.

4 thoughts on “ఈ నెల బ్లాగర్ల సమావేశం

    • అవునండీ అది మా పొరపాటే… ముందుగా తెలియబరచి ఉండాల్సింది. ఇక నుంచి వారం ముందుగా సరైన సమాచారం అందజేస్తాం.

వ్యాఖ్యలను మూసివేసారు.