ఆహా.. ఉగాది పచ్చడి

ఉగాది పచ్చడి

ఇంటి దగ్గర ఉన్నపుడైతే మామిడి పిందెలు, వేపపూత సేకరించే బాధ్యత నాది. పచ్చడి తయారు చేసే బాధ్యత మా అమ్మది. ఇక్కడ హైదరాబాదులో సెలవురోజుల్లో అలవాటు ప్రకారం ఆలస్యంగా నిద్ర లేచి బద్దకంగా స్నానం చేసి ఉగాది పచ్చడి కోసం గుడికైనా వెళ్దామనుకుంటున్నా. ఇంతలో తలుపు తట్టిన చప్పుడైంది. తలుపు తీసి చూస్తే స్వయానా మా ఇంటి యజమాని చేతిలో పైన చూపించిన పచ్చడి పట్టుకుని నిల్చున్నాడు. అది చూడగానే ప్రాణం లేచి వచ్చింది. నోరూరింది. ఏంటి? ఫోటో చూసి మీకూ నోరూరుతుందా? అయితే ఎంచక్కా ఉగాది పచ్చడి ఆరగించేయండి… శుభం…

అందరికి వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ప్రకటనలు

13 thoughts on “ఆహా.. ఉగాది పచ్చడి

  1. మీకు,మీ కుటుంబానికి కూడా వికృతి నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.

  2. 🙂 🙂 మీకు,మీ కుటుంబానికి కూడా వికృతి నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.

    • మధు గారూ, ఈ టపా గత ఏడాది రాసిందండీ, మీకు మీకు కుటుంబానికి ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు

వ్యాఖ్యలను మూసివేసారు.