ఇదే ఆఖరి రోజు

రంగా ఓ రోజు బార్ లోకి వెళ్ళి బేరర్‌తో

“మీ దగ్గర మాంఛి కిక్కిచ్చే మందు ఏదుంటే అది ఓ పెగ్గు కొట్టు” అన్నాడు.


ఒక పెగ్గు పోసి ఇవ్వగానే గట గటా తాగేసి రెండో పెగ్ ఇవ్వమన్నాడు. ఇచ్చారు. మళ్ళీ ఒక్క గుక్కలో దాన్ని తాగేసి మూడో పెగ్ ఇమ్మన్నాడు. ఇలా వరుసగా ఐదారు పెగ్గులు లాగించేశాడు.


ఇక అలాగే ఇస్తే అక్కడే పడిపోతాడని ఆ బేరర్ ఇంక చాలన్నాడు.

అతనికి మళ్ళీ డౌటొచ్చి…


“ఇంతకీ ఏమైంది సార్! పెగ్గు మీద పెగ్గేసేస్తున్నారు….భార్యతో ఏమైనా గొడవ పడ్డారా ఏంటి? ”  అడిగాడు బేరర్.

“అవునయ్యా… నా భార్య నాతో గొడవపడి  నెల రోజుల దాకా మాట్లాడనంది.”

“అవును… ఐతే ఏంటిప్పుడు.. దానికి తెగ బాధపడిపోవాలా?”

“బాధ పడక ఏంచేయమంటావ్ రా బాబూ.. ఇదే ఆఖరి రోజు!!!”

ప్రకటనలు

15 thoughts on “ఇదే ఆఖరి రోజు

 1. హ హ హ బావుందండీ మీ జోకు.
  మీ టపా టైటిల్ చూసి, మీరు బ్లాగు మూసేస్తున్నరనుకుని కంగారుగా గబగబా వచ్చి చూస్తే ఇదీ విషయం 😀

  • ఎలాగైతేనేం మిమ్మల్ని నా బ్లాగుకు రప్పించింది కదా.. నా కంతే చాలు. 🙂

 2. i dont want to ask u abt d above one but i wanna ask u only one thing that is should youth or young ones enter politics or not i herad onr thing that these political leaders will downthrode n use us ? is my thought correct or not i wanna a good ans n d other one is, is there no one who was elected as a poletition without having a background ? wilu pls send me d ans to my mail thanking u very much bye

 3. బాగుంది రవీ!
  ఎలా ఉన్నావ్ బా‎స్?
  బుక్ ఎగ్జిబిషన్ తర్వాత కలవటం కుదరలేదు.
  త్వరలో కలుస్తాననుకుంటున్నాను.

  నా “అంతర్వాహిని”లో వ్యాఖ్యానించినందుకు ఈ “అంతర్వాహిని” బ్లాగర్‌కు కృతఙతలు!
  😉

  • నరేష్… గారూ, వీలుంటే బ్లాగర్ల సమావేశానికి రాకూడదూ…. ఎంచక్కా అందర్నీ కలవచ్చు….

 4. రవీ, నేను నవ్వించలేకపోయినా నేను నవ్వేడ్వ వచ్చుకదా. కాని నవ్వనే!! .అట్లాంటిది నన్నూ నవ్వించారు. చాల బాగుంది.యేంటీ ఒక్క సారిగా బోయ్_ కాట్ చేసారు నన్ను?…..అభినందనలతో….నూతక్కి

  • అయ్యో ఎంత మాటండీ, నేను మీ బ్లాగులో వ్యాఖ్యానించకపోయినా క్రమం తప్పకుండా చదువుతూనే ఉన్నానండీ.. మీ టపాలు మంచి అర్థవంతంగా ఉంటున్నాయి. ఎలా వ్యాఖ్యానించాలో తెలియక అలా ఉంటున్నానంతే…..

 5. ఇవాళ మీ ఉత్తమ టపాలు శీర్షిక లొని టపాలు చదువుతూ ఉన్నాను.మధ్యలొ “ఇదే ఆఖరి రొజు” టపా కనిపించింది.
  నాకు అనిపించింది ఎదైనా అంశం మీద టపా మొదలుపెట్టి ఇదే ఆఖరి రొజు అని చెప్తున్నారేమో అని టపాని చూసాను.
  విషయం తెలిసాక బాగా నవ్వొచ్చింది అండి.

  జోకు బాగుంది.
  :):)

వ్యాఖ్యలను మూసివేసారు.