మనకెందుకింత మొహమాటం?

శ్రీశైలం ఆనకట్ట దగ్గర విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే యంత్రం ఒకటి పని చేయడం మొరాయించింది. మన దేశానికి చెందిన ఇంజనీర్లు సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దాంతో ఆ యంత్రాన్ని సప్లయ్ చేసిన జర్మనీ నుంచి నిపుణులని రప్పించాల్సి వచ్చింది.

వాళ్ళు వచ్చీ రాగానే పని ప్రారంభించారు. కొన్ని గంటల వ్యవధిలోనే సమస్య ఎక్కడో కనిపెట్టారు. దానికి పరిష్కార మార్గం కూడా సూచించారు. ఆ సమస్యాత్మక ప్రదేశం దగ్గరికి వెళ్ళాలంటే మొలలోతు బురద నీళ్ళు దాటి వెళ్ళాలి. నీట్ గా డ్రెస్ చేసుకొచ్చిన మన ఇంజనీర్లు అక్కడికి వెళ్ళమనగానే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. పని వాళ్ళనెవరినైనా వెళ్ళమని పురమాయిస్తున్నారు.

వీళ్ళతో అయ్యేపని కాదనుకున్న ఆ జర్మన్ ఇంజనీర్లు గబాగబా సూటూ బూటూ విప్పి పక్కన పడేసి బురద నీళ్ళను దాటుకుంటూ వెళ్ళి పని పూర్తి చేసుకుని వచ్చేశారు. పని ఎలాంటిదైనా దాని పట్ల వారు చూపించే చొరవ, గౌరవం మనం పాశ్చాత్యుల నుంచి నేర్చుకోవాలేమో.. అనిపిస్తుంది నాకు.

8 thoughts on “మనకెందుకింత మొహమాటం?

  1. @Lalitha, @budugoy
    ఈ వార్త ఇప్పటిది కాదు నేను స్కూల్లో ఉండగా ఏదో వార్తా పత్రికలో చదివినది. ఇప్పుడు గుర్తొచ్చి రాశానంతే……

వ్యాఖ్యలను మూసివేసారు.