అట్నుంచి నరుక్కురండి

హిట్లర్ ఎంత నిర్దయుడో తెలియజేసే సంఘటన ఇది. ఆయన హయాంలో రాజద్రోహం చేస్తే మరణ శిక్షే! దానికిక తిరుగే లేదు… అలా ఒక సారి సైనికులు కొంతమంది రాజద్రోహులను పట్టుకొని హిట్లర్ ముందు హాజరు పరచారు. హిట్లర్ వారందర్నీ వరసలో నిలబెట్టి శిరచ్ఛేదం చేయాల్సిందిగా తలారిని ఆజ్ఞాపించాడు.

మళ్ళీ ఏదో ఆలోచిస్తున్న వాడిలా వరుసలో మొదట నిల్చున్న ఖైదీని ఉద్దేశించి చనిపోయే ముందు తన చివరి కోరిక ఏంటో చెప్పమన్నాడు. ఆ ఖైదీ కాసేపు ఆలోచించి అటువైపు నుండి నరుక్కురమ్మన్నాడు. అంతమందిని నరుక్కుంటూ వస్తే తన దగ్గరికి వచ్చేసరికి తనమీద కనీసం దయకలుగుతుందని ఆశించాడు పాపం! కానీ ఆ కత్తికి కనికరం తెలియదు కదా! యధావిధిగా తనపని పూర్తిచేసుకుంటూ వెళ్ళిపోయింది ఆ నియంత రక్తదాహానికి సంకేతంగా…

ప్రకటనలు

6 thoughts on “అట్నుంచి నరుక్కురండి

  1. హిట్లర్ తప్పు దారి పట్టిన ఒక లీడర్ … కొన్ని కోట్ల మందిని సామూహికంగా తనని అనుసరించేలా చేసిన ఒక ఉన్మాద లీడర్ …

    అదే ఇదే మనిషి ఒక మంచి మార్గం లో వుండి వుంటే … ప్రపంచం లో ఒక గొప్ప నాయకుడు గా ప్రపంచానికి దిశా నిర్దేశం చేసే వాడిగా మిగిలే వాడు …

వ్యాఖ్యలను మూసివేసారు.