ఏమిటీ మూర్ఖత్వం?

ఇవాళ రాష్ట్రంలో ఉస్మానియా విద్యార్థులు చేస్తున్న రభస చూస్తుంటే నాలో అసహనం చెలరేగుతుంది. చిన్నప్పుడు పిప్పరమెంట్ తింటుంటే ఎవరైనా సావాస గాళ్ళు వచ్చి అడిగితే నోట్లో ఉన్నా సరే బయటకు తీసి చొక్కా మడతలో పెట్టి కొరికి సగం పంచిచ్చే వాళ్ళం. రాష్ట్రమేమన్నా పిప్పరమెంటు బిళ్ళా, అడగ్గానే సగం కొరికి ఇచ్చెయ్యడానికి?వాళ్ళను వాళ్ళు తగలబెట్టుకుని ఏం సాధిద్దామని?. వాళ్ళకు నచ్చజెప్పకుండా వాళ్ళ త్యాగాలను బలిదానాలని కీర్తించే భజన పరులు కొందరు. వీళ్ళలో ప్రొఫెసర్లు కూడా ఉండటం మరీ విడ్డూరం. కొంచెం కూడా తర్కం లేకుండా మాట్లాడటం వీళ్ళ ప్రత్యేకత.

తన సెలైనాహారదీక్షతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అల్లకల్లోలంలోకి నెట్టేసిన కేసీయార్ పిల్లి కూతలకు భయపడిపోయిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమౌతుందంటూ ప్రకటన చేసింది. దీనికి  సీమాంధ్ర ప్రాంతాల నుంచి దిమ్మదిరిగే స్పందన ఎదురవడంతో ఆ ప్రకటన వెనక్కు తీసుకుంది. జేసీ లాంటి విజ్ఞుల సలహాతో రాష్ట్ర విభజన అంత తేలిగ్గా జరిగే ప్రక్రియ కాదనీ  తేల్చాల్సిన విషయాలు చాలా ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం తదుపరి ప్రకటనలో రాష్ట్ర విభజన కోసం విస్తృతమైన చర్చలు జరపాలనే అభిప్రాయం  వ్యక్తం చేసింది.

దాని ఫలితమే శ్రీకృష్ణ కమిటీ. ఎవరేమన్నా ఈ కమిటీ రాష్ట్ర విభజన కోసం వేసిన కమిటీయే. అసలు ఇప్పుడు సమైక్యంగానే ఉంటే మళ్ళీ సమైక్యంగా ఉండటానికి కమిటీ ఎందుకు? తెలంగాణా వాదుల డిమాండ్ మేరకే కదా ఈ కమిటీ ఏర్పడింది. దాన్ని గడ్డి పీకమని చెప్పి వీళ్ళు మాత్రం రోజూ ఉద్యమాలు చేస్తూ హైదరాబాద్ ను రావణకాష్టంగా మారుస్తారట. ఇదెక్కడి న్యాయం? అసలు వీళ్ళు విద్యార్థులేనా?

కొంచెం కూడా ఆలోచించరా? వీళ్ళకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ఆ కమిటీ దగ్గరకు వెళ్ళి తమ వాదనలేమిటో బలంగా వినిపించాలి గానీ ఇలా వాళ్ళను వాళ్ళు తగలబెట్టుకుంటూ, వాళ్ళ భవిష్యత్తునే కాకుండా ఉస్మానియాలో చేరిన పాపానికి అమాయకులైన మిగతా విద్యార్థుల భవిష్యత్తును కూడా పాడుచేస్తూ ఏం సాధిద్దామనుకుంటున్నారో నాకర్థం కావడం లేదు.

39 thoughts on “ఏమిటీ మూర్ఖత్వం?

 1. నిజమే…ఇవాళ రాష్ట్రంలో ఉస్మానియా విద్యార్థులు చేస్తున్న రభస చూస్తుంటే ఏం సాధిద్దామనుకుంటున్నారో మనిషిగా ఆలోచించే ఎవరికీ అర్థంకాదు.

 2. ఇవాళ రాష్ట్రంలో ఉస్మానియా విద్యార్థులు చేస్తున్న రభస

  మీ కళ్ళకు రభస లెక్క కనిపిస్తె ఆశ్చర్యం అనిపించదు. చిదంబరం ప్రకటన చెయ్యంగనే కడప యునివర్సిటీ పిల్లలు ముప్పయ్యారు లక్షల రూపాయల BSNL కేబులు తగుల బెట్టితే మీకు దారుణం అనిపించదు. కనీసం రభస అనిపించదు! వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీ వాళ్ళు కాల్ సెంటర్ లల్ల బడి కంప్యూటర్లు పగుల గొట్టు తుంటే మీకు వీనుల విందుగ ఉంటది! తెలంగాణా పిల్లలు తీవ్ర నిర్భంధం లోపట కూడ బతుకు పోరు చేస్తుంటే, ప్రభుత్వ అణిచి వెత చూసి తీవ్ర నిరాశకు లొనై ఆత్మ త్యాగం చేసుకుంటే మీకు రభస లెక్క, మూర్ఖత్వం లెక్క ఉంటది.

  సీమాంధ్ర ప్రాంతాల నుంచి దిమ్మదిరిగే స్పందన ఎదురవడంతో ఆ ప్రకటన వెనక్కు తీసుకుంది

  చెప్తున్న కద! మీరు చేస్తె ‘దిమ్మ తిరిగే స్పందన’, ఇంకొకరు చేస్తె రభస, మూర్ఖత్వం! మీ పోస్టుల ఎంత నిజాయితీ ఉందో దీన్ని బట్టి తెలియడం లేదా? తాను చేస్తె సంసారం, ఇతరులు చేస్తె వ్యభిచారం అన్న సామెత గుర్తు కొస్త లేదూ?

  తెలంగాణా వాదుల డిమాండ్ మేరకే కదా ఈ కమిటీ ఏర్పడింది

  అట్ల అని మీరు కల గన్నరా? సమైఖ్యాంధ్ర విషయాన్ని గూడ పరిశీలించమని ఉన్నంక తెలంగాణా కోసం ఏర్పాటైన కమిటీ ఎట్లయితది? తీరా మా వాదనలు వినిపించి కమిటీని ఒప్పించినా మీరు అడ్డు పుల్ల ఎయ్యరని గ్యారంటీ లేదు. ఇంతకూ ముందు ఇట్లాంటి కమిటీల తీర్పులను ఎన్నింటినో పాతరేసిన చరిత్ర మన కున్నది. ఇలాంటి కమిటీలను నమ్మే స్థితిలో తెలంగాణా వాళ్ళు లేరు. ఉద్యమం తోటే తెలంగాణని సాధించు కొని తీరుతరు.

  ఏమిటీ మూర్ఖత్వం

  తోటి తెలుగు సోదరుల ఆవేదనను, ఆక్రోశాన్ని, బలిదానాలను అర్ధం చేసుకో లేని వాళ్ళది మూర్ఖత్వం.

  • అయ్యా తెలంగాణా యోధుడు గారూ, ఉస్మానియా విద్యార్థులు కేంద్రప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ ప్రకటించక మునుపు చేసిన ఉద్యమాలను నేను రభస అనలేదు. శాంతినెలకొల్పే ప్రయత్నంలో భాగంగా కేంద్రప్రభుత్వం తటస్థ వైఖరిని అవలంభిస్తూ నిష్పాక్షిక కమిటీని వేసినపుడు దాన్ని గడ్డి పీక్కోమని అని అనడం మూర్ఖత్వం కాదా?
   పసలేని వాదనలతో పబ్బం గడుపుకునే వారికి ఇవన్నీ ఎలా రుచిస్తాయి లెండి…
   >>తాను చేస్తె సంసారం, ఇతరులు చేస్తె వ్యభిచారం అన్న సామెత గుర్తు కొస్త లేదూ?
   కేంద్రం ఏ నిర్ణయం తీసుకోక ముందు తెలంగాణా కోసం చేసిన ఉద్యమం ఎంత న్యాయమో…రాష్ట్రం సమైక్యంగా ఉండటానికి సీమాంధ్రులు చేసిన ఉద్యమాలు అంతే న్యాయం. కాదంటే పై న మీరు చెప్పిన సామెత మీకే వర్తిస్తుంది.
   కానీ ఒక మధ్యవర్తి నియమింప బడ్డాక సీమాంధ్ర ప్రాంతాలు సంయమనం పాటిస్తుంటే మీరు ఎందుకు సంయమనం పాటించరు?
   >>సమైఖ్యాంధ్ర విషయాన్ని గూడ పరిశీలించమని ఉన్నంక తెలంగాణా కోసం ఏర్పాటైన కమిటీ ఎట్లయితది?
   నేను టపాలో అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మీరు వాదిస్తే నేనింకేం మాట్లాడలేను. ఆల్రెడీ సమైక్యంగా ఉన్నపుడు కమిటీ ఏంది మళ్ళీ పరిశీలించేది? కేసీయార్ ప్రత్యేక రాష్ట్రం కోసం దీక్ష చేయబట్టే కదా.. ఇంత దాకా వచ్చింది. దీనిలో కలగనడం ఏంటో నాకర్థం కావడం లేదు.
   >>తోటి తెలుగు సోదరుల ఆవేదనను, ఆక్రోశాన్ని, బలిదానాలను అర్ధం చేసుకో లేని వాళ్ళది మూర్ఖత్వం.
   అందరూ తెలుగు వాళ్ళు ప్రశాంతంగా ఉండటానికి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిందిపోయి గడ్డి పీకండి, ఆంధ్ర ఉత్పత్తులను బహిష్కరిస్తాం ఇడ్లీ సాంబార్ ను కనబడనీయం… అని మతిలేని మాటలు మాట్లాడే వాళ్ళది నిజమైన మూర్ఖత్వం.

 3. రవి చంద్ర,
  “మీరు చేసే తప్పు లేదు గానీ మేం చేస్తే తప్పా?” ఈ వాదన ఒకటి ఉన్నంత కాలం రెండు వైపుల వాళ్ళనీ ఎవరూ సముదాయించలేరు.

  పిల్లల విద్యా సంవత్సరం ఏమవుతుందో,భవిష్యత్తు ఏమవుతుందో అనే చింత నాయకులకెలాగూ లేదు. కనీసం విద్యార్థులకైనా ఈ కనువిప్పు కలుగుతుందేమో చూద్దాం అనుకుంటే అదీ లేదు. తాము కేవలం పావులమనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోక, చదువుపాడు చేసుకుంటున్నారంటే ఆవేదనగా అనిపిస్తోంది.

  వాతావరణం కాస్త చల్ల బడుతుండగానే నాయకులకు భయం! జనం మర్చిపోతారేమో అని ఏదో ఒక ఇష్యూ లేవదీసి గొడవ చేయడం మామూలైపోయింది.

  ఈ నాయకులు రగిల్చిన అగ్నిలో మరో సమిథ యాదయ్య!

 4. శ్రీకృష్ణ కమిటీ తర్వాత ఒక వర్గం వాళ్ళు శాంతంగా ఉన్నపుడు వీళ్ళు మాత్రం మాకు ఇప్పటికిప్పుడు రాష్ట్రం విభజించెయ్యాలంటే ఎట్లా కుదురుతుందండీ?…..వీళ్ళు కూడా సంయమనం పాటించాలి కదా….

 5. మీ ఆవేదన బాగుంది కాని,

  1) కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు బట్టడం బాగోలేదు.
  2) విద్యార్దులను తప్పు బట్టడం బాగోలేదు.

  అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు సై అన్నాయి. ఆ పార్టీలకే ప్రజలు పట్టం కట్టారు. ఆ పార్టీలు ఎన్నికల వాగ్దానాలకు అనుగుణంగా కేంద్రం ప్రకటన చే స్తే దాంట్లో మీకు తప్పు ఏమి కనిపించింది ?

  ఎంత కాలం రాజకీయ నాయకుల మాటలకు మోస పొమ్మంటారు ? వారి చర్యలు వలన ఇబ్బందులు కలుగుతున్న మాట వాస్తవమే అయినా, వారిలో ఎంతో ఆవేదన వుంది just like your post.

  • >>కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు బట్టడం బాగోలేదు.
   కేంద్రం ఈ సమస్యపై సరైన అవగాహన లేకుండా ఇచ్చిన మొదటి ప్రకటన కచ్చితంగా తొందరపాటు చర్యే.. .
   >>విద్యార్దులను తప్పు బట్టడం బాగోలేదు.
   వివేకం కోల్పోయి ప్రవర్తిస్తున్నవారిని కచ్చితంగా తప్పు పట్టాల్సిందే….విద్యార్థి దశలో ఆవేశం సహజం. కానీ అది అభివృద్ధిని, వారి జీవితాలను ఆటంకపరచేలా ఉండకూడదు.

 6. అందరూ తెలంగాణకు అంగీకారం అయినపుడు కేంద్రం తొందరబాటు చర్య ఎలా అవుతుందో నాకు అర్ధం కావడం లేదు. మీరు కూడా ఈ తెలంగాణ అంశానికి ముగింపు పాలక కుండా సాగదీయాలని కోరుకోవడం ఆశ్చర్యంగా వుంది.

  విద్యార్దుల విషయంలో I am confused.

  • అంగీకారం అంటే ఎలాంటి అంగీకారం? ఓట్ల కోసం తమ మ్యానిఫెస్టోలో తెలంగాణా అంశం చేర్చేస్తే అది ఆమోద ముద్ర ఎలా అయిపోతుంది? దాన్నే అన్ని పార్టీలు ఏకాభిప్రాయం అనుకోవడం సరైన ఆలోచన కాదని నా అభిప్రాయం. ఎన్నికల్లో ఓట్ల కోసం సవాలక్ష మాటలు చెబుతుంటాయి. అవన్నీ నిజమని నమ్మేస్తే ఎలా?
   తెలంగాణా అంశానికి ఏదో ముగింపు లేకుండా అలా సాగాలని నేనెందుకు కోరుకుంటాను? కాలపరిమితితోకూడిన కమిటీ నియమించింది సమస్యను తేల్చడానికే కదా…దాన్ని వీళ్ళెందుకు అంగీకరించరు? ఇలా అడ్డుగోలుగా వాదిస్తుంటే ఎప్పటికీ తెగదు ఈ సమస్య.

   విద్యార్థులు వాళ్ళెలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో కమిటీకి నివేదించి వాళ్ళను కన్విన్స్ చెయ్యక ఇలా రోడ్ల మీదకెక్కితే ఏం ప్రయోజనం అన్నది నా పాయింటు.

 7. తప్పంతా అన్ని ప్రాంతాల రాజకీయనాయకులది.

  సామాన్య ప్రజలని, విధ్యార్థులని ఆడిపోసుకోవడంవల్ల ప్రయోజనం లేదు.

 8. తెలంగాణ వస్తే అందరికి ఉద్యోగాలు వస్తయ్యనే భ్రాంతి కలిగించారు. దాని తోటి ఈ ఆత్మా హత్యలు. రాజీనామాలు చేసి సంక్షో భము కలిగిద్దమను కుంటే కుదర లేదు. రాజీనామా పద్దతితో పనులు జరగవని ఆరు నెలల క్రిందట జగన్ ముఖ్య మంత్రి వ్యవహారం లో తేలింది.
  అసెంబ్లి చుట్టూ ముట్టి చేద్దామంటే పోలీసులు, కోర్టుల సహకారం లభించ లేదు.
  ఇంకా ఒకటే శరణ్యం శ్రీకృష్ణు డి తోటి మొర పెట్టు కోవటమే. అందరితో మంచిగా ఉండటం. రేపు రాష్ట్రమోచ్చినా డబ్బులు కావాలంటే ఎవ్వరో ఇవ్వాల్సిందే. ఇంకో దేశం గ విడి పోవటల్లేదు కదా.

 9. నిజానికి ఈ ఆత్మహత్యలే ప్రస్తుతం ఉద్యమానికి ఇంధనం. ప్రాణాలు తీసుకున్న అమాయకుల బలిదానాన్ని కీర్తిస్తూ, జరగబోయే ఆత్మహత్యలకు ప్రేరణనిస్తున్నారు, పెద్దలు.

  ఇవ్వాళ రాజకీయ ఐకాస ముందున్న ప్రధాన కర్తవ్యం ఈ ఆత్మహత్యల్ని ఆపడం. ఈ పని చెయ్యగలిగింది ఐకాసయే! ’ఆత్మహత్యలు చేసుకోవద్దు, చచ్చి సాధించేదేం లేదు, బతికుండి పోరాడి సాధిద్దాం’ అని చెబితే చాలదు, విద్యార్థులతో చర్చలకు దిగాలి, వాళ్ళను ఆపాలి. ఉద్యమాన్ని కొన్నాళ్ళపాటు ఆపైనా సరే, వీటికి అడ్డుకట్ట వెయ్యాలి. విద్యార్థులను రెచ్చగొట్టి ఈ పరిస్థితికి కారణమైనవాళ్ళు ఈమాత్రపు బాధ్యత తీసుకోవాలి.

 10. వాళ్ళు కేవలం ఓట్ల కోసమే తెలంగాణ అన్నారని అంటున్నారు…అంటే వాళ్ళ వ్యభిచారాన్ని అంగీకరిస్తున్నారా మీరు. ? అలాంటి వాళ్ళని గోడ దూకిన తర్వాత ఎందుకు నమ్మాలి… ఇక అంతా OK అన్నాక కేంద్రం ప్రకటన తొందరపాటు ఎల అవుతుంది.. నీ వాదన అంతా స్వార్థ పూరితం గా ఉంది.. నిష్పాక్షికం గా లేదు..

  • రాజకీయ పార్టీలు కచ్చితంగా ఓట్లకోసమే తెలంగాణా పాటందుకున్నాయి. ఇందులో అనుమానం లేదు. కానీ నిజానికి దానివల్ల ఓట్లు రాలలేదు. దానికి ఈ క్రింది కారణాలే దృష్టాంతాలు.

   2004 ఎన్నికల్లో చంద్రబాబు పాలనపై విసిగివేసారిన జనానికి మండుటెండల్లో పాదయాత్ర చేసిన రాజశేఖర్ రెడ్డి ఆపద్భాంధవుడిలా కనిపించడంతో ఆయనకు పట్టం కట్టారు. అంతే గానీ ఆయన తెలంగాణాకు మద్దతివ్వడం వల్ల కాదు. నిజానికి ఆయన మద్దతిచ్చే ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. తెరాసను తమతో కలుపుకోవడం వల్ల కాంగ్రెస్ కు నష్టమేమీ లేదు. కాబట్టి సరే అన్నారు.

   మధ్యలో ఒకసారి రాజీనామాలు చేసి మళ్ళీ పోటీ చేసిన తెరాస ఉన్న సీట్లు కూడా ఊడగొట్టించుకుంది. తెలంగాణా వాదానికి మెజారిటీ లేదని తేలిపోయింది.

   తరువాత 2009 లో అప్పటివరకు సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్న తెదేపా తెలంగాణా మద్దతిచ్చి బద్దశత్రువు తెరాసను తమలో కలుపుకుని ఎన్నికల్లో గట్టెక్కేద్దామనుకుని బొక్క బోర్లా పడ్డారు.

   ఇలా తెలంగాణాకు మద్దతిచ్చిన పార్టీలు బావుకునిందేమీ లేదు. నష్టపోవడం తప్ప. అందుకనే ఇక లాభం లేదని పార్టీలు ప్రాంతాల వారీగా అయినా తమ రూట్లు మార్చుకున్నారు.

   • అసలు ఎన్నికలలో CPM కాకుండా ఎవరు తెలంగాణ కి వ్యతిరేకం అన్నారు గనక… అందరూ అనుకూలం అన్నవారే… అందుకే ఏ పార్టీ ఓటర్లు ఆ పార్టీకి ఓట్లు వేసుకున్నారు… ఇప్పుడు పీ ఆర్ పీ వాళ్ళకి ఆంధ్రా లో ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి అటువైపు పోయాడు.. మిగతా ప్రాంతం వారు గొడవ చేయడం కామన్… అందువల్ల ఇంతజరిగాక కమిటీ విధి విధానాలు విభజనకి ప్రక్రియ ప్రారంభించాలి కానీ.. ఇలా 60 ఏళ్ళ చరిత్ర చదువుతాం అంటే వాళ్ళకి మండదా మరి.. నువ్వు కూడా అన్నీ తెలిసి నీకు నువ్వు సర్ది చెప్పుకుంటున్నట్లు రాశావు…

 11. యాదయ్య ఆత్మహత్యాయత్నం చేసిన నిమిషాల్లోపే ఉస్మానియా క్యాంపస్‌లో అతని లైఫ్‌సైజ్ ఫోటోలు ఎలా వెలిశాయి? అతని సూసైడ్ నోట్ పోలీసులకి కాకుండా మీడియాకి ఎలా చిక్కింది?

 12. @@చదువరి:
  ముఖ్య మంత్రికి లేదా బాద్యత .. వందల మంది ప్రాణాలు పోతుంటే జే ఏ సీ వాళ్ళు మాత్రమే చర్చలు జరిపాలా… ఎవరు ఎక్కడ ఎప్పుడు ఆత్మ హత్య చేస్కుంటారో ఎవరికి తెలుస్తుంది. ప్రభుత్వం ప్రకటన చేయాలి గానీ… జాక్ లు బాక్ లు చర్చలు ఎవరితో.. ఎంత మందితో చేస్తారు.. ప్రభుత్వం చేసే పనులు వాళ్ళలో నిరాశను ఒక రకమైన -ve ధోరణిని రేకెత్తించటం లేదా.. వాళ్ళతో ఒప్పందానికి వస్తే తప్పేంటి.. శాంతియుతంగా చేస్తామని మాటతీసుకుని వాళ్ళ నిరశన చేయనిస్తే తప్పేంటి…శాంతి ర్యాలీ ni follow aite aaputaaraa…??

  • నాయుడు గారూ, ఆత్మహత్యల్ని ఆపాల్సింది ఎవరు – ప్రభుత్వమా, ఐకాసనా? అనేది ప్రశ్న. సమాధానం చూద్దాం.

   దానికంటే ముందు ఒక విషయం మీద మనకు స్పష్టత ఉండాలి. మనం ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాం, కుర్రాళ్ళలోని ఆత్మహత్యోద్రేకాన్ని నిరోధించడమా? లేక తెలంగాణ ఏర్పాటు చెయ్యడమా? ఈ రెండూ పరస్పరం ఆధారపడినవే కదా అని అనకండి. ఉద్యమము, ప్రభుత్వ నిర్ణయమూ పరస్పరాధారితం కావచ్చు – కానీ ఆత్మహత్యలు కాదు. తెలంగాణ ఏర్పడేదాకా ఆత్మహత్యలు ఆగవు అనేది మీ సమాధానమైతే, ఇక నేను చెప్పేదేమీ లేదు. ఆత్మహత్యలను గ్లోరిఫై చేసినంత తేలిక కాదు, రాష్ట్రాన్ని చీల్చడం అనేది అందరూ గ్రహించాలి.

   ఇక అసలు సమస్యకు వస్తే.. ఆత్మహత్యలు ఆపడమే మన ముందున్న ప్రధాన కర్తవ్యమని నా భావన. ఈ పనికి ఐకాస పూనుకోవాలి. అందుకు రెండు కారణాలు:
   1. ఆత్మహత్యలు చేసుకుంటోంది, ఉద్యమంలో తాము కలిసిమెలిసి పనిచేస్తున్న వర్గంలోని వాళ్ళే . వాళ్ళను నయానో, భయానో, బతిమాలో బామాలో ఒప్పించడం ఐకాసకే చేతనవుతుంది. ప్రభుత్వానికి ఆ వీలు లేదు. తెలంగాణ ఏర్పాటు చెయ్యకుండా (చేస్తామని ప్రకటించకుండా) ప్రభుత్వం మరింకేమి చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు.
   2. ప్రజల్లో ఉద్రేకాలను, ఉద్వేగాలను రెచ్చగొట్టి వాళ్ళను ఈ స్థితికి తేవడంలో ఐకాసది (అది ఏర్పడకముందు -అందులోని నాయకులది) ప్రధాన పాత్ర. దీన్ని ఆపాల్సిన బాధ్యత వాళ్ళకే ఎక్కువ ఉంది.

 13. మన దేశం లో ఓట్ల కోసం అనేవి అన్నీ చేస్తే ప్రపంచం లో గొప్ప దేశం అయ్యి మనం మూల దర్శకంగా ఉండే వాళ్ళం. రాజకీయాలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. మనం చేద్దమనుకోవటమే కాదు చేద్దామంటే ఒప్పుకునే వాళ్ళు ఉండాలి. చాలా పనులు ఒకళ్ళ తో అయ్యేవి కాదు. అందుకని మంచి పనులు చేద్దామను కోవటం మాన లేము.

 14. @@అబ్రకదబ్ర:
  న్యూస్ పేపర్ లో వార్తలో చదివా.. బాగ్ లొ 10వ తరగతి మార్క్స్ మెమొ కూడా పెట్టుకున్నాడత కదా… అందులో ఫొటో ఉండదా… .అందరి సమక్షం లో బాగ్ చూస్తారు కదా…
  ainaa …ఇలా సాక్ష్యాలు చూపకుండా ప్రశ్నలు వేస్తూ….
  meeru migataaa vaallani తప్పుదారి పట్టించటం తప్పు కదా..

 15. ఇందులో నేను తప్పకుండా విద్యార్థులనే తప్పు పడతాను.

  వివేచన కోల్పోయి అల్లకల్లోలం సృష్టించి, ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులను ఈ రాజకీయ నాయకులు, సో కాల్డ్ ప్రొఫెసర్లు, మేధావులు అమరవీరుల లాగా కీర్తిస్తూ వారిని ఇంకా ఇంకా ప్రోత్సాహిస్తున్నారు, ఎగదోస్తున్నారు.

  అసలు ఒక కమిటీ వేసిన తరువాత కూడా ఇంకా రావణ కాష్టంలా ఈ ఉద్యమాన్ని వయొలెంట్‌గా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని వారించే వాళ్ళూ లేరు, ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కీర్తించే వారు తప్ప.

  చదువుకున్న/కుంటున్న వారు కూడా తమ భవిష్యత్తు మీద కొంతయినా దృష్టి పెట్టకపోవడం విచారకరం.

 16. @రామకృష్ణ:

  I’m sorry but you didn’t get my point. అతను నిప్పంటించుకున్నాక ‘నిమిషాల్లోపే’ అంత పెద్ద ఫోటోలు ఎలా ప్రింటై వచ్చి పడ్డాయి? ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లనిపించటం లేదా?

  • నిమిషాల్లోపే ? దానికే నేను ఆధారం అడిగింది… నిమిషాల్లోపే అక్కడ పోస్టర్స్ వెలిసాయని మీకెలా తెలిసింది… ఆ విషయం వెంటెనే పసిగట్టారా…. లేక ఎంత సమయం తర్వాత తెలిసింది… నాకైతే అలాంటి విషయం ఏదీ ఇంతవరకు తెలియలేదు…. ఏవైనా విడియోలు గట్రా రిఫర్ చేస్తే బావుంటుంది… అలా ఏమి ఆధారం లేకుండా చెప్తే మళ్ళీ కొందరు 10 అబద్దాలు అని రాయటం మొదలు పెడతారు… .ఇలా నేను చదువరిని మాత్రం* అనటం లేదు ? !@#..

   • Ramakrishna: ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టారే! 🙂 చదువరి అంటే మీ ఉద్దేశం నేనేనని భావించి ఇది రాస్తున్నాను. “మాత్రం” పక్కన ఆ * గుర్తు ఎందుకో మాత్రం అర్థం కాలేదు.

    ఉద్యమమన్నాక కొన్ని అతిశయోక్తులుంటాయి, కొన్ని తప్పిదాలుంటాయి, కొన్ని దుందుడుకు మాటలుంటాయి. నేను వాటిని పెద్దగా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఒకవేళ వాటి గురించి రాసినా స్పర్శామాత్రమే! కానీ అబద్ధాలంటూ నేను రాసినవి అచ్చమైన అబద్ధాల గురించిన అచ్చమైన నిజాలే! మొన్నొకరోజున ప్రసిద్ధ తెలంగాణవాది వి. ప్రకాశే స్వయంగా – ‘మేం తెలంగాణ అడుగుతున్నది అభివృద్ధికోసమో మరోదానికోసమో కాదు, కేవలం ఆత్మగౌరవం కోసమే. దీన్ని శ్రీకృష్ణ కమిటీ తూకం వెయ్యలేదు. అంచేత మేం ఈ కమిటీని తిరస్కరిస్తున్నాం’ అని చెప్పాడు. అభివృద్ధి లో మేం వెనకబడ్డామనే సంగతిని కమిటీ ముందు మేం నిరూపించలేం అని అర్థం వచ్చే మాటలను కూడా ఆన్నాడు. ఇప్పుడు చెప్పండి.. తమ అబద్ధాల గురించి తామే అన్యాపదేశంగా ఒప్పుకున్నట్టా కాదా?

   • వీడీయో రిఫరెన్సులా? టీవీలు బాగానే చూస్తారుగా, మీకు తెలిసే ఉండాలి. కళ్లముందున్న తాజా నిజాలకి ఆధారాలడుగుతారు! కేసీయార్ లాంటోళ్లు చెప్పే కహానీలకి ఆధారాలెప్పుడన్నా అడిగారా?

 17. అబ్రకదబ్ర గారూ మీ సమాధానం ఇంగ్లిష్ “Ramakrishna” కి అనుకుంటాను. నాకూ మీరు వెలిబుచ్చిన సందేహమే వచ్చింది. థాంక్స్
  తెలుగు రామకృష్ణ

 18. సందేహాలు వేణుగోపాల్ రెడ్డి విషయంలో కూడా వచ్చాయి.

  1. బయటి విద్యార్థి కాంపస్ లో ఎలా ఆత్మహత్య చేసుకోవలసి వచ్చింది?అతడు కాంపస్ స్టూడెంట్ కాదు.

  2.90 శాతం గాయాలు ఆత్మహత్యా ప్రయత్నంలో జరగవు.

  3.90 శాతం వళ్ళు కాలినా సూయిసైడ్ నోట్ మాత్రం భద్రంగా ఉంది కాలిపోకుండా!

  4.అంతగా కాలిన వాడు కనీసం ఒక్క ఆర్త నాదమైనా చేయకుండా ఎలా మరణించాడు?

  5.శవం పొదల్లో ఎందుకు దొరికింది?

  ఎంతవరకూ నిజమో కానీ ఇలా ఆత్మహత్యలకు పాల్పడే వాళ్లకు (కుటుంబాలకు) డబ్బు అందుతోందని పబ్లిక్ టాక్!

  • How irresponsible is this.
   It was already confirmed as a suicide by postmortem report.
   మీ లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం గా రాస్తున్నాం అనుకుంటున్నారు కానీ… ఒక రకమైన కుట్ర పూరితం గా ఆలోచిస్తున్నామని తెలుసుకోలేక పొతున్నారు… మనం విడి పోయినా ..వాళ్ళతో కలిసున్నా… అది స్నేహ పూరితం గా జరగాలి కాని ఇలాంటి వ్యాఖ్యలు విద్వేషాలు పెంచుతాయి…

   • Krishna గారూ, నేను కూడా మీతో ఏకీభవిస్తాను. కానీ ఏదో సాధించేద్దామని ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం మాత్రం సహించను.

 19. asalu elanti karanam chetanaina atmahatya chatta ritya neram. adi chesina vallani ela goppavaru antunnaru? Idena Manishi jeevitaniki iche viluva? Ilagena Atma hatyalni protsahinchedi?

  chinna pillalni enda lo nadi roddu meeda manava haram ani nilabettestunnaru? vallaki emi telusu ee godavalu? rechagotte ee nayakulu AC rooms lo vunnare!!!

  vidyarthulu antunnaru, ee gharshanala valla entha aasthi, prana, vidya nastam jarugutondo gamaninchara?
  rajakeeya partylu vidyarthulani matrame enduku rechagodutunnayi? ilanti udyamam lo udyogasthulu leda telangana loni goppa officers enduku palgonatledu?

  avanni enduku? Ee dveshabhava pooritamaina vyakhyalu chese nayakulaki pillalu, manumalu, manumarandru lera? vallu evaru vidyarthulu kara? alanti vallu entha mandi ee udyamam lo ila vella toh roddu meeda vachi poradutunnaru?
  nirupeeda vidyarthula vyakthigata avasaralu asara ga teesukuni vallani bali pasuvulni chestunnaree… alochinchara?

  idivarakati kalam lo udyamam ante, nayakulu, valla kutumbaalu kooda karyakartala toh saha kasta nastalu edurkuntu saginchedi…
  ippudu adi, nayakulaki luxuries tevataniki sadhanam…

 20. R S నాయుడు గారూ, ఆత్మహత్యల్ని ఆపాల్సింది ఎవరు – ప్రభుత్వమా, ఐకాసనా? అనేది ప్రశ్న. సమాధానం చూద్దాం.

  దానికంటే ముందు ఒక విషయం మీద మనకు స్పష్టత ఉండాలి. మనం ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాం, కుర్రాళ్ళలోని ఆత్మహత్యోద్రేకాన్ని నిరోధించడమా? లేక తెలంగాణ ఏర్పాటు చెయ్యడమా? ఈ రెండూ పరస్పరం ఆధారపడినవే కదా అని అనకండి. ఉద్యమము, ప్రభుత్వ నిర్ణయమూ పరస్పరాధారితం కావచ్చు – కానీ ఆత్మహత్యలు కాదు. తెలంగాణ ఏర్పడేదాకా ఆత్మహత్యలు ఆగవు అనేది మీ సమాధానమైతే, ఇక నేను చెప్పేదేమీ లేదు. ఆత్మహత్యలను గ్లోరిఫై చేసినంత తేలిక కాదు, రాష్ట్రాన్ని చీల్చడం అనేది అందరూ గ్రహించాలి.

  ఇక అసలు సమస్యకు వస్తే.. ఆత్మహత్యలు ఆపడమే మన ముందున్న ప్రధాన కర్తవ్యమని నా భావన. ఈ పనికి ఐకాస పూనుకోవాలి. అందుకు రెండు కారణాలు:
  1. ఆత్మహత్యలు చేసుకుంటోంది, ఉద్యమంలో తాము కలిసిమెలిసి పనిచేస్తున్న వర్గంలోని వాళ్ళే . వాళ్ళను నయానో, భయానో, బతిమాలో బామాలో ఒప్పించడం ఐకాసకే చేతనవుతుంది. ప్రభుత్వానికి ఆ వీలు లేదు. తెలంగాణ ఏర్పాటు చెయ్యకుండా (చేస్తామని ప్రకటించకుండా) ప్రభుత్వం మరింకేమి చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు.
  2. ప్రజల్లో ఉద్రేకాలను, ఉద్వేగాలను రెచ్చగొట్టి వాళ్ళను ఈ స్థితికి తేవడంలో ఐకాసది (అది ఏర్పడకముందు -అందులోని నాయకులది) ప్రధాన పాత్ర. దీన్ని ఆపాల్సిన బాధ్యత వాళ్ళకే ఎక్కువ ఉంది.

  • నేను తల నరుక్కుంటాను అన్న వాళ్ళు…. వద్దు వద్దు అలా మీరు మాత్రం చేయకండి అని చెప్తారా ?
   ప్రభుత్వాలు రెండు కదా… కేంద్రం మాత్రమే తెలంగాణ ని ఇవ్వగలుగు తుంది.. ఆ అభిప్రాయం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం గా పని చేస్తే సరి… ఈ జాక్ లు బాక్ లు రెచ్చిపోతే వీళ్ళు కూడా వేలకు వేలు పోలీసులను దించటం యుద్దానికి సంకేతం కాదా…. మంచిగా చెప్తే మారలేరా వాళ్ళు… అది నా చేతుల్లో లేదు… నాకు చేతనైంది చెప్పండి చేస్తా అనే ధోరణి చూపిస్తే..తప్పకుండా ప్రేమాభిమానాలు వెల్లివిరుస్తాయి…

 21. కారణం ఏదైనా విధ్యార్ధులు బలవ్వడం బాధగా ఉంది, ఇది రాను రాను భారత యుద్దం లా తయారైయింది ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడు మధ్యలో ఉన్నాడు తగవు తీరుస్తాడో, రగిలిస్తాడో….?

 22. పాపం రోశయ్య గారు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు కదా నా చేతుల్లో ఏమిలేదు మీరు అనవసరం గ ప్రాణాలు తీసు కోకండి అని. ఇంకేమి చేస్తాడు ఆయన.

 23. చచ్చిపోవడం ఇంత గొప్పగా ఉంటుంది అని తెలిసినప్పుడు పాపం వాళ్ళు మాత్రం చచ్చిపోకుండా ఎలా వుంటారు. అందుకే ఆత్మహత్యలు. పాపం వాళ్ళకు తెలీదు కె.సి.ఆర్ లాగా ఏ ఆసుపత్రిలోనో ఆత్మహత్యో, నిరాహారదీక్షో చేయాలని అందుకే రాలిపోతున్నారు. ఏ రాజకీయనాయకుడు గాని, వాళ్ళ వారసులుగాని ఆత్మహత్యాయత్నం చేస్తున్నారా. కేవలం వీళ్ళని రెచ్చగొడుతున్నారు. ఆమాత్రం బుద్ది ఈకుర్రాళ్ళకి ఉండక్కర్లేదు. చదువులు చంకనాకి పోయిన తర్వాత ఉద్యోగాల కోసం ఏడవడం తప్ప ఉపయోగం లేదు.

వ్యాఖ్యలను మూసివేసారు.