ఆంగ్ల తెలుగు నిఘంటువు అప్లికేషన్

నిఘంటువు తెరపట్టు
నిఘంటువు తెరపట్టు


ఆన్‌లైన్ లో నిఘంటువులు నాకు తెలిసి మూడు అందుబాటులో ఉన్నాయి. విక్షనరీ, అక్షరమాల, గూగుల్

వీటిని ఉపయోగించుకోవాలంటే జాలానికి అనుసంధానమై ఉండాలి. అలా కాకుండా ఎప్పుడైనా ఉపయోగించుకునేలాగా నేనొక అప్లికేషన్ తయారు చేశాను. ఒక సారి ఇన్‌స్టాల్ చేసుకుంటే బ్రౌణ్య పదకోశం మీ చేతిలో ఉన్నట్లే.

దీని ప్రత్యేకతలు

 • ఏదైనా పదం ఈ పదకోశంలో లేకపోతే మీరు నిఘంటువుకు చేర్చవచ్చు.
 • ఏదైనా పదానికి అర్థం అసంపూర్తిగా ఉన్నట్లయితే మీరు దాన్ని దిద్దుబాటు చేసి భద్రపరుచుకోవచ్చు.

దీన్ని స్థాపించుకోవాలంటే మీ కంప్యూటర్ లో అడోబీ AIR ఉండాలి. దాన్ని ఇక్కడ నుండి ఉచితంగా దింపుకోవచ్చు.

దాన్ని

nighantuvu2
nighantuvu2

స్థాపించుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ను ఇక్కడ నుండి దింపుకొని (.air file) స్థాపించుకోండి. స్థాపించడం పూర్తయింతర్వాత మీ డెస్క్‌టాప్ పైన ఒక ప్రతీకం (ఐకాన్) కనిపిస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేయగానే అప్లికేషన్ పనిచేయడం ప్రారంభిస్తుంది(బొమ్మలో చూపబడినట్లుగా). వెతకదలుచుకున్న పదాన్ని సర్చ్ బాక్స్ లో టైపు చేసి ఎంటర్ నొక్కండి.

ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ ఆంగ్లం నుంచి తెలుగు పదాలకు మాత్రమే అర్థాలు చూపిస్తుంది. తర్వాత తెలుగు నుంచి ఆంగ్ల పదాలు వచ్చేటట్లుగా కూడా తయారు చేస్తాను.

కొత్త పదం ఎలా చేర్చాలో, నిఘంటువులో ఇది వరకే ఉన్న పదం అర్థాన్ని ఎలా మార్చాలో బొమ్మల్లో చూపించాను

ఇది మొదటి వర్షనే కాబట్టి ఏదైనా సమస్యలు వస్తే నాకు తెలియబరచండి. తర్వాతి వర్షన్ లో సవరించడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీకు ఏ సాంకేతిక సమస్య ఎదురైనా నాకు తెలియబరచండి.

ఎవరికైనా దింపుకోవడంలో సమస్య ఎదురైతే raviechandra@gmail.com కి ఈ మెయిల్ పంపించండి నేను మీకు అటాచ్‌మెంట్ పంపిస్తాను.

22 thoughts on “ఆంగ్ల తెలుగు నిఘంటువు అప్లికేషన్

  • రవిచంద్ర గారు,
   తెలుగు భాష లో వెబ్ పేజి తయారు చేయాలంటే ఎలాంటి సాఫ్ట్ వేర్ కావాలి. నోట్ పాడ్ లో తెలుగు స్క్రిప్ట్ రాదుకదా. బరహ ద్వారా చేయగలమా? దానిని వెబ్ పేజి గా మార్చగలమా.

 1. నేను download చేసుకున్నానండీ. కానీ నాకు తెలుగు తెలుగులా కనబడట్లేదు ఏవో పెట్టెలు కనబడుతున్నాయి. నేనేమైనా fonts install చేసుకోవాలా?

 2. Ravi garu,

  Following message is displayed when I try to download:

  To view this file, sign up for DivShare!
  This file is not available to free users in China and Southeast Asia. To download it and any other DivShare file, sign up for a DivShare Personal account for just $9 / year!

  Note: I am from Singapore 🙂

 3. నిఘంటువు చాలా బాగుంది. తదుపరి విడుదల ఇంకా బాగుండవచ్చునని అనుకుంటా. కొత్త వర్షన్ వస్తె తెలియజేయండి.
  ధన్యవాదములు

 4. I am also unable to download the file from divshare.
  I am getting the below error message
  This file is not available to free users in China and Southeast Asia. To download it and any other DivShare file, sign up for a DivShare Personal account for just $12 / year!

 5. రవిచంద్ర గారికి,

  నేను ఎన్నాళ్ళ నుండో వెతుకుతున్న పుస్తకం(application) దొరికింది. దీన్ని తయారు చేసినందుకు, ఇలా అందరికీ అందజేస్తున్నందుకు అశేష ధన్యవాదములు.

  — మూర్తి

వ్యాఖ్యలను మూసివేసారు.