నాన్‌స్టాప్ కుమ్ముడే….

ఈ మధ్య ఈటీవీలో సందు దొరికితే చాలు “నాన్‌స్టాప్” కుమ్ముడు షురూ జేస్తాండు.

“నీకిష్టం లేకపోతే ఆ టీవీ ఎందుకు జూడాలే ఈ టపా ఎందుకు రాయాలే” అనద్దు.

అలవాటు పడ్డ ప్రాణం… పాడుతా తీయగా లాంటి కొన్ని ప్రాగ్రాముల కోసం చూడకుండా ఉండలేను. మధ్య మధ్యలో వచ్చే ఇలాంటి ప్రకటనలు వద్దనుకున్నా కంటబడతాయి. ఈ సినిమా జూసి హీరో ఎవరో విలన్ ఎవరో చెబితే కారు బహుమానం ఇస్తారంట…మనం చూసి చెప్పేది పక్కన బెడ్తే అసలు సినిమా దీసిన దర్శకుడికైనా, ఆ మాటకొస్తే ఆ సినిమాకు పని చేసిన బృందానికంతటికీ ఎవరికైనా తెలుసా అని!

ఇప్పుడు ఒక చిన్న పోటీ…

 • రచన, దర్శకత్వం, మాటలు, పాటలు వగైరా వగైరా… నాలుగు చేతులా నిర్వచించగల సవ్యసాచి మన సుమన్
 • తన క్రియేటివ్ బుర్రతో మన బుర్రలో గందరగోళం సృష్టించగల ప్రభాకర్..
 • చాలా సినిమాలకు నృత్యదర్శకుడు, ఆణిముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలతో గౌరవంగా బతుకుతున్న సుందరం మాస్టార్ని “బొంగరం” మాస్టారు గా చేశాడు. పార్టిసిపెంట్ల మధ్య గొడవలు పెట్టి వినోదం చూసే అగ్గిపుల్ల సామి మన ఓంకార్…

వీళ్ళ ముగ్గర్లో ఎవరు గొప్ప మీరే తేల్చాలి…

16 thoughts on “నాన్‌స్టాప్ కుమ్ముడే….

 1. తప్పదు మరి భరించాలి అలవాటు పడ్డ ప్రాణం కదా. కాదని వేరే ఛానల్ మారిస్తే అక్కడ ఇదే గోల. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇలా అఘోరించింది. ఆ ప్రశ్నలు కూడా నవ్వు తెప్పిస్తాయి. అందుకే హాయిగా పోగో, డిస్కవరీ లు చూడటం మంచిది.

  >>వీళ్ళ ముగ్గర్లో ఎవరు గొప్ప మీరే తేల్చాలి

  వీళ్ళు ముగ్గురు కాదు వీటిని ఓపిగ్గా భరించి చూసే మనమే గొప్ప. ఏమంటారు.

 2. జవాబు కోసం ఆలోచిస్తుంటే బుర్రలో…“నాన్‌స్టాప్” కుమ్ముడే కుమ్ముడు…

 3. మద్య మద్య లో కంటపడినవి చూస్తున్నారంటే మీది చాలా గట్టి ప్రాణం రవిచంద్ర గారు. నా కంత ధైర్యం లేదండి.

  సుధ

 4. 1.ఈటీవి సుమను ఎందుకు తాపత్రయ పడతాడో అర్ధం కాదు, అతనికి అవకాశం ఉంది కదాని ఏదో తీస్తునే ఉంటాడు అన్నిటిలో చేతులు పెడతాదు అంత సరదాగా ఉంటే ఏదో ఒక రంగం లో ఉంటే సరిపోయేది కదా లో బడ్జెటె కదా ఎలా అయినా డబ్బులు వస్తాయని ధీమా కానీ ప్రేక్షకుడు ఎలా పోయినా పరవాలేదు.
  వాల్ పోష్టర్ లో ఎవరూ కనిపించకుండా సినిమాలో మాత్రమే సుమను కనిపిస్తే ఒక సగటు ప్రేక్షకుడు మనసు ఎంత బాధగా ఉంటుందో……….వాళ్ళకేం తెలుసు
  2.ముద్దుమాటల ఓంకార్ గురించి ఏం చెపుతాం ఎలగో ఒకలా ఖజానా నింపుకుంటున్నాడు
  3.ప్రభాకర్ ఏదో ఒక పని చూసు కుంటున్నాడు. తప్పదు
  4.ఇక అసలైన గొప్పవాడు సుందరం మాస్టర్ ముసిలి వయసులో అందరూ మరిచి పోయిన తరువాత ఇప్పుడు హాయిగా మంచి కాలక్షేపం దొరికింది మధ్య మధ్యలో కన్నీరు కారుస్తూ మంచిగా నటిస్తూ …..ఉంటాడు వాహ్ …

 5. ముగ్గురూ ముగ్గురే…….ముగ్గురు మొనగాళ్ళు .కోట్ల మందిని గడగడలాడిస్తున్నారు కదా!

 6. నేను డిసైడ్ చేస్తా! ఈ ఛాన్స్ ని వదులు కోను. ర్యాంకులు ఇవిగో….
  1. హింస కి – మా టివి ఓంకార్ – వీడు ఏమి మాట్లాడతాడో వాడికే తెలియదు – ”అన్నయ్యా” వింటున్నావా? వింటూ వుంటాడు లే.
  2. మూర్ఖ హింస కి – ప్రభాకర్ – వీడి రుపీస్ వీడి గోల.
  3. సివరాఖరన – పరమ హింస కి – సుమన్ – ఆ పేరు చూడండి – ఎంత మధురంగా ఉందో – సర్వాంతర్యామి – ఈ టి వి సినిమాలు సీరియల్లు అన్నీ వీడివె – గురుతుల్యులు

  3 ఇడియట్స్ – ముగ్గురు మూర్ఖులు – కాదు కాదు – ఎదవలు – జంద్యాల గారు ఉంటే, నా సామి రంగా.:)

వ్యాఖ్యలను మూసివేసారు.