మీరెక్కడ ఉన్నారు?

ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు. మూడో వాడు ఆ దారి గుండా వచ్చి చూసీ చూడనట్లు వెళ్ళిపోయాడనుకోండి.

మీరు ముంబై నగరంలో ఉన్నట్లు లెక్క.

——————————————————————————–

ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు. ఇద్దరు కాసేపు అలసిపోయి వాళ్ళ స్నేహితులకి ఫోన్ చేశారు. అంతే… కాసేపటికి ఆక్కడ యాభై మంది పోట్లాడుకుంటున్నారనుకోండి.

మీరు పంజాబ్ లో ఉన్నట్లు లెక్క.
——————————————————————————–


ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు. మూడో వ్యక్తి వచ్చి శాంతి నెలకొల్పాలని ప్రయత్నించాడు.

మొదటి ఇద్దరు కలిసి మూడోవాడికి ముసుగేసి చితకబాదారనుకోండి.

మీరు ఢిల్లీలో ఉన్నట్లు లెక్క.

———————————————————————————


ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు. కొంత మంది చుట్టూ మూగారు. ఇంకొకడు వచ్చి అక్కడ నిశ్శబ్దంగా టీకొట్టు పెట్టేశాడనుకోండి.


మీరున్నది అహ్మదాబాదులో
———————————————————————————-


ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు. మూడోవాడొచ్చి గొడవాపడానికి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ రాశాడు.కానీ ప్రోగ్రామ్ లో బగ్ వల్ల గొడవ ఆగలేదు.


మీరు బెంగుళూరులో ఉన్నట్టన్నమాట.
———————————————————————————-

ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు. జనమంతా గుమికూడారు. మధ్యలో ఒకడొచ్చి “ఆపండెహా!! అమ్మ కివన్నీ వచ్చవు.”అనగానే గొడవ సద్దుమణిగిపోయింది.

ఇంకా అనుమానమా… మీరున్నది చెన్నైలో…
———————————————————————————-


ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు. మరో ఇద్దరు అక్కడికి వచ్చి వాళ్ళిదర్లో ఎవరిది తప్పో వాదించుకోసాగారు.

మీరు కోల్‌కతా లో ఉన్నారన్నమాట.
———————————————————————————


ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు. దగ్గర్లో ఉన్న ఇంట్లోంచి ఒకడు బయటకు వచ్చి ఇంకెక్కడికైనా వెళ్ళి పోట్లాడుకోండి. అని చెప్పేసి తలుపేసుకున్నాడు.

మీరు కేరళలో ఉన్నారన్నమాట.
———————————————————————————–


ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు. మూడోవాడు ఒక బీరు పెట్టెతో వచ్చాడు. ముగ్గురూ కూర్చుని ఫుల్లుగా తాగి నోటికొచ్చినట్లు తిట్టుకొని మళ్ళీ ఇంటికెళ్ళేటపుడు స్నేహితులైపోయారనుకోండి.

మీరు గోవాలో ఉన్నారన్నమాట.

*నాకు వచ్చిన మెయిల్ ఆధారంగా…