మన ప్రభుత్వానికి ఆ దమ్ముందా?

ఇన్నాళ్ళు చంపుతాం, నరుకుతాం, తెగ్గోస్తాం, రక్తపుటేర్లు పారిస్తాం అని ప్రేలుతున్న కొంత మంది వేర్పాటు వాదుల గురించి  అందరూ మీడియాలోనూ, బయట మాట్లాడటం తప్పిస్తే ఎవరూ ఎక్కడా చట్టపరమైన చర్యలు చేపట్టమని కోరిన దాఖలాల్లేవు. స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఈ పని చేయడం ద్వారా ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేసిందనిపిస్తుంది నాకు.

కేసీఆర్, మరికొందరు నాయకులు పలు సందర్భాల్లో వాడిన పరుష పదజాలాన్ని, వాటిని ప్రచురించిన వార్తల క్లిప్పింగులను ఆమె మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు జస్టిస్ సుభాషణ్ రెడ్డికి సమర్పించారు. తెలంగాణాలో ఆంధ్ర అనే పదం ఎక్కడా వినిపించ కూడదంట,కనిపించకూడదంట. ఇడ్లీ సాంబార్ అనే మాట కూడా  వినిపించకూడదంట!!!…ఇలా వాళ్ళ నోటికొచ్చినట్లు అడ్డదిడ్డంగా మాట్లాడటం ద్వారా తెలంగాణా లో నివసించే ఇతర ప్రాంతాల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారన్నది ఆమె ఫిర్యాదు సారాంశం. ఈ వాదన సమంజసంగా అనిపించిన సుభాషణ్ రెడ్డి ఇలాంటి వాటిని ఆపడానికి ఏమేం చర్యలు తీసుకుంటున్నారో డీజీపీని వివరణ అడిగారు. ఈ పని ఎప్పుడో చేసుండాల్సింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిపై చర్య తీసుకునే దమ్ము మన ప్రభుత్వానికుందా? అనేదే అసలు ప్రశ్న.

ప్రకటనలు

10 thoughts on “మన ప్రభుత్వానికి ఆ దమ్ముందా?

 1. అవును రవీ,ఇది మంచి పని అని నాక్కూడా అనిపించింది. చర్యలు తీసుకుంటారా లేదా అన్న సంగతి పక్కన పెడితే,ఇలాంటి ప్రొటెస్ట్ ఒకటి ముందుకు రావాలి. ఇడ్లీ సాంబార్ అనేవి వినపడకూడదు, కనపడకూడదు అనడం ఎంత అవివేకంగా ఉందో చూడండి!

  అలాగే కొడాలి నాని మాట్లాడిన మాటలు కూడా! ఇంత సంయమనం లేనివాళ్ళు రాజకీయ నాయకులుగా ఉండటం వాళ్లని మనం భరించాల్సి రావడం దురదృష్టం కాక మరేమిటి?

  • >>అలాగే కొడాలి నాని మాట్లాడిన మాటలు కూడా! ఇంత సంయమనం లేనివాళ్ళు రాజకీయ నాయకులుగా ఉండటం వాళ్లని మనం భరించాల్సి రావడం దురదృష్టం కాక మరేమిటి?

   తప్పకుండా నండీ… ఇప్పుడిప్పుడే పరిస్థితి కొంచం మెరుగవుతుందనకుంటుంటే.. ఇలా రెచ్చగొట్టే నాయకులని చూస్తుంటే నాకు నిజంగా ఒళ్ళు మండిపోతుంది.

 2. మీతో మేము ఉండలేము అని అంటున్నాము ఇంకా ఎందుకు ఈ అనవసరపు చర్చ.హ్యాద్రాబాద్ లో ఏమో మా సొమ్ములు ఉన్నాయి అంటున్నారు ,లెక్కలు చూసుకుందాం .ఒకరిని ఒకరు తిట్టుక్కోవడం ఎందుకు.ఎనటైన తెలుగువాళ్లం ఎప్పుడో ఒకప్పుడు కలిసి మాట్లాడుకోవలసిన వాళ్ళం

 3. మీ ఉద్దేశ్యం ఏమిటసలు? ఒకవేళ రాష్ట్రం విడిపోతే మాత్రం మేమిక్కడ ఉండకూడదా? ఆంధ్రా అనే బోర్డులు పెట్టుకోకూడదా ఇడ్లీ సాంబార్ తినకూడదా? ఒకవేళ మీరు అలా అన్నా..అది రాజ్యాంగ విరుద్ధం.
  …. ఇక్కడ నేను ఎవరిని తిట్టాను? ప్రజలు హక్కులను భంగం కలిగించే వాళ్ళను గురించి మాట్లాడాను.
  >>ఎంతైనా తెలుగువాళ్లం ఎప్పుడో ఒకప్పుడు కలిసి మాట్లాడుకోవలసిన వాళ్ళం
  ఎప్పుడో ఒకప్పుడేంటి ఎప్పుడూ మాట్లాడుకుందాం. అలా చేయకుండా చేసేవారి చర్యలను ముక్త కంఠంతో ఖండిద్దాం.

 4. #### కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిపై చర్య తీసుకునే దమ్ము మన ప్రభుత్వానికుందా? అనేదే అసలు ప్రశ్న. ####
  పరమ దుర్మార్గంగా, అన్యాయంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుండటం వల్లనే; రాజకీయ అవనీతి కుళ్ళు వల్లనే కదా మన సమాజం ఇంతగా భ్రష్టు పట్టి పోతున్నది.
  మన సినిమాలు కూడా ఇట్లాంటి డైలాగులను, కల్చర్ నే కదా పెంచి పోషిస్తున్నవి. నరుకుతా చంపుతా వంటి మాటలు సినిమాలే ప్రజలకు నేర్పాయి. ఆ మాటలే హీరోయిజానికి ప్రతీక గా మారాయి.

  “మీలో పాపం చేయని వాడే ముందుగ రాయి విసరాలి” అంటే … మన ప్రభుత్వ పెద్దల లో ఎంతమందికి అర్హత వుంటుంది?
  అసలు దోషులను, అసలు సమస్యను వదిలేసి గొప్పల కోసం, చప్పట్ల కోసం, హీరో అనిపించుకోవడం కోసం ఎవరో నలుగురు నాయకులు వాచాలత్వం ప్రదర్శిస్తూ అసలు సమస్యను పక్క దారి పట్టిస్తున్నారు.
  ఆ మాటలను మన మీడియా పదే పదే ప్రస్తావిస్తూ, ప్రచారం చేస్తూ మంటను మరింత రాజేస్తోది.
  అందుకే అసలు సమస్య రావణ కాష్టం లా అట్లాగే మండుతోంది.
  అది మండుతున్నంత కాలం ఈ మాటలు ఆగవు, మన బతుకులు సజావుగా సాగవు.

 5. ## ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిపై చర్య తీసుకునే దమ్ము మన ప్రభుత్వానికుందా? అనేదే అసలు ప్రశ్న. ####

  “ప్రభుత్వానికి దమ్ము ఉందా?” కాదు – మనది అసలు ప్రజాస్వామిక ప్రభుత్వమేనా? అన్నది అసలు ప్రశ్న.

  ప్రభుత్వమే సమస్యను సృష్టించి, మురగబెట్టి, అన్ని విలువలను గాలికి వదిలేసి,
  పరమ దుర్మార్గంగా, అన్యాయంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుండటం వల్లనే; రాజకీయ అవనీతి కుళ్ళు వల్లనే కదా మన సమాజం ఇంతగా భ్రష్టు పట్టి పోతున్నది.
  మన సినిమాలు కూడా ఇట్లాంటి డైలాగులను, కల్చర్ నే కదా పెంచి పోషిస్తున్నవి. నరుకుతా చంపుతా వంటి మాటలు సినిమాలే ప్రజలకు నేర్పాయి. ఆ మాటలే హీరోయిజానికి ప్రతీక గా మారాయి.

  “మీలో పాపం చేయని వాడే ముందుగ రాయి విసరాలి” అంటే … మన ప్రభుత్వ పెద్దల లో ఎంతమందికి అర్హత వుంటుంది?
  అసలు దోషులను, అసలు సమస్యను వదిలేసి గొప్పల కోసం, చప్పట్ల కోసం, హీరో అనిపించుకోవడం కోసం ఎవరో నలుగురు నాయకులు వాచాలత్వం ప్రదర్శిస్తూ అసలు సమస్యను పక్క దారి పట్టిస్తున్నారు.
  ఆ మాటలను మన మీడియా పదే పదే ప్రస్తావిస్తూ, ప్రచారం చేస్తూ మంటను మరింత రాజేస్తోది.
  అందుకే అసలు సమస్య రావణ కాష్టం లా అట్లాగే మండుతోంది.
  అది మండుతున్నంత కాలం ఈ మాటలు ఆగవు, మన బతుకులు సజావుగా సాగవు.

  Two lines missed in my earlier comment pl publish this complete version.

 6. అసలు రాష్ట్రంలో ప్రభుత్వమంటూ ఉందా? దానికి దమ్ముందో లేదో అన్నది తర్వాతి విషయం.

 7. Hello brothers and sisters… plz don’t forget that all indians are our sisters and brothers…
  Bharatha desam lo puttina prathi okkari janma hakku andi india lo ee moolana ayina nivasinchatam…
  Ikkada andaru (telugu valley kaadu…all indians..) gamanicha valasina okka vishayam emitantey..what are the reasons for this situatation????..
  manam eekonam lo aalochisthey…the very 1st and the biggest reason is… “mana raajakeeya naayakulaku andhra pradesh rashtrm lo unna anni jillaala, mandalaa, graamaala meeda samaana drusti lekapovatam”.

  Mukyamanthri antey mukhyamanthri for whole andhrapradesh..alaagey oka saakhaki manthri kooda…they have the responsibility to look after the people of whole andhara pradesh…rashtram loni anni moolala unna prajala baagogulu choodaalsina baadhathaa vaaridey….
  Manamandaram eekonam lo kanuka think chethey..manaku ardam avuthundi….rashtram panichesina, panichesthunnaa raajakeeya naayakulu entha pakshapaathangaa panicheshaaro…enthagaa verpaatu vaadaani thayaaru cheshaaro….Its the Govt resonsibility to take care the basic needs of the whole andhra pradesh people..but has that heppened….
  Raashtram loney kaadu …kendram lo choodandi…entha clear ga verpaatu vaadaanni thayaaru chesthunnaaro…is mamatha benerjee is railway miniter for W.bengal? or a central minister for the whole nation?…ilaaaa jarigithey verpaatu vaadaaam enduku raadandi….emo evariki telusu repu manamey pratheyka dhakshina bharatha desham kaavaalantaavemo…endukantey ilaa anyaayam jaruguthooo untey entha kaalam bharisthaamm….aalaa ani mana sasya shyaamalaa bharatha vanini..vidadheeyam kadaa….
  Andukey Youth Desham kosam sacrifies cheyatam aarambinchaali… konni deshaalaalo prathi okkaru kontha kaalam miltry pani cheyaali aney rules unnay daani vaalla yoth ki kramasikshana, desham patla gourav peruguthundi….

  Asalu raashtraanni vidadheestaaru aney maataa vinteyney hrudayam bharangaa untundi…kondari swaardam kosam raashtra prajaltho aadukuntunnaaru….kaani ee draamaa lo mana andaru big politicians hand vundaney vishyam marchi povaddu…

వ్యాఖ్యలను మూసివేసారు.