మా పసిమనసుల్లో కలకలం రేపిన రిజర్వేషన్లు

మేము ఓసీలం అంట.  ఇది నాకు మా పెద్దోళ్ళు చెప్తేనే తెలిసింది. మా తాతలు ఎప్పుడో నేతులు తాగారంట. మాకు మాత్రం వాటి వాసనలు కూడా తెలియపోయినా పేరుకు అగ్రకులం. బడిలో పేరు రాయించేటపుడు తోకలేమీ తగిలించనప్పటికీ కులం మాత్రం ఓసీగానే రాశారు. దాంతో ప్రతి సంవత్సరం తరగతి ప్రారంభించేటపుడు పుస్తకాలు అందరితోపాటు మాకూ ఇచ్చేవారు కాదు. ఎందుకో పసిపిల్లలుగా ఆ క్షణం మాకు చాలా బాధేసేది. మొహం మాడ్చుకుని ఇంటికెళ్ళి నాకెందుకు పుస్తకాలివ్వరని మా అమ్మనడిగేవాణ్ణి. మనకు డబ్బులు ఉన్నాయి కదా అని సమాధానం చెప్పేది. మరి మనకంటే ఎక్కువ పొలం, డబ్బులు ఉన్న ఫలానా వాళ్ళకి ఎందుకిస్తున్నారని అడిగితే అవన్నీ మనకెందుకు? మనం డబ్బులు పెట్టి కొనుక్కుందాం లే అని ఓదార్పు మాటలు చెప్పేది.

పసిమనసులు దైవంతో సమానమంటారు. లేత మనసులు కాబట్టి ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా కొన్ని రోజులు ముభావంగా ఉండిపోయే వాడ్ని మళ్ళీ పుస్తకాలు కొనిచ్చేదాకా. కొన్ని రోజుల తర్వాత కొంచెం విషయపరిజ్ఞానం వచ్చాక ఈ రిజర్వేషన్లు కనిపెట్టిన వాళ్ళమీద పిచ్చి కోపమొచ్చేది.  అసలు రిజర్వేషన్లు ఎందుకు పెట్టారో తెలిశాక, ఒకసారి రిజర్వేషన్ ను ఉపయోగించుకుని జీవితంలో పైకి వచ్చినా తర తరాలుగా సిగ్గులేకుండా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసేవారి మీద కోపమొచ్చేది.

ఈ రిజర్వేషన్లు అందవలసిన వారికి సహాయపడకుండా, “అభివృద్ధి చెందిన వెనుకబడ్డ కులాల” వారి అడుగులకు మడుగులొత్తుతున్నా ఈ చట్టం మార్చాలని మాట మాత్రమైనా అనుకోకపోవడం మన నాయకుల ఓటుబ్యాంకు రాజకీయాలకు నిదర్శనం. ఇప్పుడు గనుక అంబేద్కర్ ఉంటే ఈ చట్టం దుర్వినియోగమౌతున్న తీరు చూసి ఖచ్చితంగా సిగ్గుపడతాడేమో…

ప్రకటనలు

31 thoughts on “మా పసిమనసుల్లో కలకలం రేపిన రిజర్వేషన్లు

 1. నన్నూ ఎప్పుడూ వేధించే ప్రశ్న ఇదే . ఎదో కాలం లో అగ్ర కులాలవారు , ఏదో చేసారని ( అది చూసిన వాడు లేడు ) , ఈకాలం లో ఆ కులాల వారిని వేధించటం న్యాయమా ? ఎంత మంది తెలివితేటలు వున్న అగ్ర కులాల పిల్లలు చదువుకొనగలిగే స్తోమత లేక అణగారి పోతున్నారో పాపం .

  • హ్మ్… మీ usual statement… 🙂

   నలుగురు వ్యక్తులు కలిస్తేనే సమాజం. నా లాంటి వాళ్ళు పది మంది ఇలాంటి సమస్య ఎదుర్కొంటే అది సామాజిక సమస్య కాదా? నేను బయటకు చెప్పుకున్నాను. బయటకు చెప్పలేని వాళ్ళెంతమందో…

 2. ఇందిరా గాంధీ హయాంలో అనుకుంటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉత్తర భరత దేశంలో ఒక యువకుడు ఒంటికి నిప్పంటించుకొని చనిపోయాడు. అప్పుడు నేను బోర్డ్ స్కూల్ చదువుతున్నాను. ఆ ఫోటో ఇప్పటికి నాకు గుర్తే. కొంతమంది ప్రయోజనం కొరకు అంబేద్కర్ ప్రతిపాదించిన ఈ విధానం నేడు దుర్వినియోగం అవుతోంది. ఆ వర్గాలు ప్రయోజనం పొంది ఎదిగడానికి తోడ్పటానికే ఇవి. కొంత కాల పరిమితి కూడా వుంది. కాని రాజకీయ నాయకుల దుర్భుద్ది వల్ల దీనికి అంతు లేకుండా పోయింది. అగ్ర వర్ణాల లోను పేదవారు ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏమిటి. అగ్రవర్ణంలో ఉంటే డబ్బు ఉన్నట్టేనా. ఈ దేశంలో ప్రతిభావంతులకి కొదవ లేదు. కాని వారికి సరైన గుర్తింపు లేదు. 80, 90 శాతం మార్కులు తెచ్చుకొంటే కాని వీరికి దిక్కులేదు. రిజర్వేషన్ పేరు చెప్పి 35 శాతం మార్కులు వచ్చిన చాలు వారిని ఉద్యోగం వరిస్తుంది. రేపు వీళ్ళు టీచర్లు గాను, వైద్యులు గాను చేరితే ఆ రంగాలు ఏమైన ముందుకు వెడతాయా. నాకు వాళ్ళ మీద కోపం లేదు. రిజర్వేషన్ ను ఉపయోగించుకొని మంచి చదువు చదివి ప్రతిభావంతులుగా మారితే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాని అలా జరగట లేదు. దానిని అడ్డుపెట్టుకొని ఏదో రకంగా ఉద్యోగం సంపాదిస్తే చాలనుకొంటున్నరు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న చాలామంది టీచర్లు వాళ్ళ పిల్లల్ని తమ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ స్కూల్ లో చేర్పిస్తున్నారు. నేను ఒకటి మాత్రం అనుకొంటున్నాను. విద్య, వైద్య రంగాలలో మాత్రం రిజర్వేషన్లు ఉండకూడదు. భావి భారత పౌరులని తయారు చేసేదొకరు, ప్రాణం పోసే వారొకరు. కులంతో గాని మతంతో గాని పనిలేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే ఈ రెండు రంగాలలోనికి అభ్యర్ధులను అనుమతించాలి. ఆర్ధికంగా వెనుకబడిన ఏ కులం వారికైన చదువు వరకు రిజర్వేషన్ ఫర్వాలేదు..కాని ఉద్యోగానికి ఎవరికైన ప్రతిభే ఆధారం కావాలి. ప్రభుత్వం ఆ రకంగా రిజర్వేషన్ ఉపయోగిస్తే అందరికి మేలు. ప్రతిభకు పట్టం తద్వారా దేశానికి మంచిది.

 3. chala correct ga chepparu… nenu kooda mana education system lo reservations valla entho badha padedanni… anthe kadu, ladies reservation la valla kooda… kastapadi chadivi rankulu techukunte, “aa emundi, ladies reservation valla vachestundi” ani anna matalu badha pettevi… anthe kadu, nakante manchi rank and marks sadinchina itara vidyarthulu seats dorakka avasthapadutunna badha vesedi…
  asalu inka manaki reservations avasarama, vunte daniki elanti marpulu tevali anna alochana mana nayakulaki rademi?!

 4. కుల మతాలకు అతీతంగా అందర్నీ సమానంగా చూడాలని మన పెద్దోల్లు మనకు సుద్భొధ చేసి, అవే కులాలను మతాలను ప్రాతిపదిక చేసుకొని, దొడ్డిదారిన వెనుకబడిన వారిగా పేర్కొనే వాల్లను ప్రతిభ ఉన్నా మనం పుట్టక తో ఒక కులం వాల్లైనందుకు మనల్ని వెలిదోసి కులం గజ్జి మతం బురద పూసుకొని, వాల్ల వోటు బాంకు ని కాపాడుకొంటున్నారు. పైసా కు కొరగానిది ఇదీ ఒక వ్యవస్తా, వీల్లూ నాయకులూ. ఇచ్చేవాల్లకు సిగ్గులేనప్పుడు, తీసుకొనేవాల్లకైనా ఉండాలి కదా. They are not distributing opportunities, they are giving benifits by opening backdoors. I dont fear to call them unworthy eligible candidates. not only in reservations every where they consider caste, relegion. To apply for Bank PO OC and OBCs should pay 550 , while remaining Backdoor classes pay 50 Rs. How is it fair. And these backdoor guys say that Forward classes are oppressing them, from where are they getting scolarships, from where are they getting compensations, is manmohan singh paying from his pocket, is arjun singh paying from his pocket, is ambedkar paying from his pocket, all the compensations that you get are from the people that you hate as taxes, if you hate the person how can you use his money. How can they expect us to be friendly amidst of this unfair treatment.

 5. శ్రీ వాసుకి గారు,
  ఆ నిప్పు అంటించుకున్న వ్యక్తి పేరు రాజేష్ అగ్నిహోత్రి అనుకుంటాను. అతను మరణించలేదు. కాలిన గాయాలతో బయటపడి ఢిల్లీలోనే ఏదో వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు.

  ‘అప్పటి వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు?” అని ఇండియా టుడే లో వచ్చిన ఒక వ్యాసంలో చాలా రోజుల క్రితం చదివాను.

 6. ఒకప్పుడు వర్ణ వివక్ష ఎక్కువగా ఉన్నందుకే రిజర్వేషన్లు పెట్టారు. కాని ఇప్పుడు వెనుకబడిన కులాలు వారు చాలామటుకు అగ్రస్థానాలకు చేరుకున్నారు.కులాల వారీగా రిజర్వేషన్లు కొంత శాతం తగ్గించి ఆర్ధికంగా వెనుకబడిన వారికి పెంచితే అందరికీ ఉపయోగంగా ఉంటుంది.

  సుధ

 7. హు.. మీరెంత పిచ్చివారు.. అప్పట్లొ ఈ రిజర్వెషన్లు ఎదో వెనుకబడిన వర్గాలని ఉద్దరిద్దామని ఏర్పాటు చేసినా ఈ రొజు అవి ఒక వొటు సాధనం.. వున్న రిజర్వెషన్స్ తియ్యడం అన్నది మన దేశంలొ ప్రజసామ్య ప్రబుత్వాలు వున్నంత వరకు జరగని పని.. వెనుకబడిన వర్గాల వారు చెప్పెది.. ఆ తరగుతులు వాళ్ళు డెవెలప్ అయితేనే ఈ రెజర్వెషన్స్ పొతాయి అని.. అది ఎప్పటికి జరగదు ఎందుకంటే.. ఈ బలహీనవర్గాలలొ రిజర్వెషన్స్ వుపయొగించుకుంటున్న కొన్ని కుటుంబాలె మళ్ళి మళ్ళి ఉపయొగించుకుంటున్నాయ్.. తరల తరబడి రిజర్వెషన్స్ పొందుతున్నవాళ్ళు కూడ .. మనం డెవెలప్ అయ్యాం పొనిలె పాపం మన తొటి వెనుకబడిన వర్గం వాడిని పైకి లాగుదం అన్న సెన్స్ వుండదు.. ఎంత సెపు దొచుకుతిందమనె.. ఫ్రీ లక్ష ఎవడిస్తాడా అని చూడటమే..
  ఇప్పుడున్న పరిస్తితులలొ రిజర్వెషన్స్ తియ్యడం , తగ్గించడం జరగదు కానీ , ఒక్కొ సంవత్సరం ఒక్కొ కులాన్ని రిజర్వెషన్ కెటగొరి లొ చేర్చుకుంటు పొతే కున్నళ్ళకి ఒ సి / ఎఫ్ సి అన్నవి మిగలవ్.. అదే పరిష్కారం..
  ఒపిక వున్నవారు ఇక్కడ కామెంట్స్ చదవచ్చు..

  http://naparugu.blogspot.com/2009/09/blog-post_29.html

 8. అసలు ఏ రంగంలోనూ రిజర్వేషన్ల అవసరం రాని,లేని రోజులు రావాలని కోరుకుందాం.
  పైన ఎవరో అన్నట్టు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకుంది కాకుండా…వెనుకబడిన తరగతులకు మండల్ కమీషన్ నివేదిక ప్రకారం రిజర్వేష్నన్లను అమలు చెయ్యాలని వి.పి.సింగ్ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు స్వీయదహనానికి పాల్పడ్డవారిలోని వాడు రాజీవ్ గోస్వామి.అతని అత్మాహుతి యత్నాన్ని ముఖచిత్రంగా ప్రచురించుకున్న ఇండియా టుడే దేశం లోనే ప్రముఖ ఆంగ్లపత్రిక అయ్యింది.
  తర్వాత అతను కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్ధి విభాగమైన యన్.యస్.యు.ఐ తరపున ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘానికి అధ్యక్షుడయ్యాడు.కొన్నాళ్ళకు వ్యాపారరంగంలోకి దిగి అనంతరం పదిహేనేళ్ళకు ఆరోగ్యసమస్యలవల్ల కన్నుమూశాడు.

  • రాజేంద్రగారూ,
   సామాజిక పరిణామక్రమాన్ని తెలిసినవాళ్ళెవరూ సమసమాజం ఎప్పుడోఒకప్పుడు వస్తుందని నమ్మరు. సమాజంలో అసమానతలు చిరకాలం ఉంటాయి. కాకపోతే పరిణామక్రమంలో ఓడలు బళ్ళవుతాయి మళ్ళీ బళ్ళు ఓడలవుతాయి. ఇదొక చక్రం. తిరుగుతూనే ఉంటుంది.

 9. నేను 10వ తరగతి చదివేటప్పుడు మండల్ కమీషన్ అని గొడవలు జరిగాయి…చాల బందులు..ఆ గొడవ రిసర్వేషన్స్ కోసం అని తెలిసింది…నా స్నేహితుడు చాల ధనిక వర్గనికి చెందినవాడు..కాని బిసి …వాడికి ఎంసెట్లో రాంకు 12000 వాడికి మంచి కాలేజిలో సీట్ వచ్చింది..నాకు 6000 ఒ సి అవటంవల్ల మంచి కాలేజిలో చేరలేక పోయాను…నా ఉద్దెశంలో ఇంకా రిసర్వేషన్స్ అవసరంలేదు ..అవి ఉంటే ఆర్థికంగా వెనుకబడిన వారికే ఇవ్వాలి..

 10. రాజేంద్ర కుమార్ గారు,
  అయితే అతడు వ్యాపారంలో స్థిరపడే వరకూ చదివానన్నమాట.అవును, పేరు గుర్తొచ్చింది. రాజీవ్ గోస్వామి! రైట్!

 11. మంచుపల్లకి చెప్పినదాంట్లో వాస్తవం వుంది. నిజానికి రిజర్వేషన్ల వలన లాభం పొందుతున్నది కొన్ని కులాలవాల్లె.. వాళ్లలోనూ కొంతమందే. దానివలన వాళ్ళంతా ఏదో అభివృద్ధి చెందారని భావించడం సత్యదూరం. గ్రామాలలో చూడండి. బి.సి.కులాల్లో కుడా కొంతమంది మీరన్న అగ్రకులాల సంస్కారాలకు అలవాటుపడిన మోతుబరి కుటుంబాలే లాభం పొందుతున్నాయి. మిగిలిన వారు రోజు గడవక తిరిగి కూలి బతుకులే బతుకుతున్నారు. ఇప్పటికి డ్రాప్ ఔత్స్ ఎక్కువగా ఈ కులాలనుమ్డే వున్నారు. తరాలకొద్దీ అనుభవి౦చకు౦డా ఒకరిద్దరు ఉద్యోగాలతో ఆ కుటుంబానికి రిజర్వేషన్ సుకర్యం కట్ అయితే బాగుటు౦ది. ఈ మధ్య ఇబ్బడి ముబ్బడిగా కొత్తగా కొన్ని కులాలను చేర్చారు. వాటిలో కూడా రాజకీయాల వలన కొంత ఎలైట్ సెక్షన్ లబ్ధిపొ౦ది౦ది. ఓటు బ్యాంకు రాజకీయలవలన, పాలకుల చిత్తసుద్ధి లోపం వలన సమానావకాశాలు కల్పించబడడ౦ లేదు.

 12. నాకూ ఓ విషయం చెప్పాలనుంది…ఇది నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేనిది…మెడిసిన్ చదవాలన్నది నా చిన్నప్పట్నుంచీ మనసులో పాతుకుపోయిన ఆశయం….నాన్నది కూడా..కాని మామూలు జిల్లాపరిషత్ పాఠశాలలోనే(మా స్కూలు చాలా బాగుండేది..ఈ రోజుల్లో ఇంగ్లీషుమీడియం బళ్ళేవీ దానికి పోటీ రాలేవనుకోండి) చదివించగలిగారు..10th లో స్కూలు ఫస్టు+మండలం ఫస్టు…..కానీ ఆర్థిక కారణాల వల్ల మంచి రెసిడెన్షియల్ లో చదవలేకపోయా…కాని మా క్లాస్౯మేట్(వాడికి మాంఛి రిజర్వేషన్ కూడా ఉంది) అత్తెసరు మార్కుల్తో పాసైనా మంచి రెసిడెన్షియల్ లో చేరాడు…త్వరగానే మాంఛి ఇంజినీరు కూడా అయ్యాడు…నాకు షార్ట్ టర్మ్ లో వచ్చిన ఓ పాటి ర్యాంకుతో ఓ రెసిడెన్షియల్ లో ఫ్రీ గా కోచింగ్ చేరా…కాని సరైన base లేకపోటంవల్ల, ఓ రెండు దండయాత్రలు చెయ్యాల్సొచ్చింది…ఆ gap లో నేను, నా family మొత్తం ఎంత క్షోభ పడ్డామో ఆ భగవంతుడికే తెలియాలి…..మెడిసిన్ సీటు ఓ అందని కలలాగా అనిపించేది…..చివరికి సాధించి ఒకింత గర్వంతో మెడికల్ కాలేజ్ లో అడ్మిషన్ కి అడుగుపెట్టా…..

  అప్పుడు నా వెనక కూర్చున్న అబ్బాయి పలకరించాడు…పేర్లూ,పరిచయాలూ అయ్యాయి…నీ rank ఎంత అని అడిగాడు…293 అని చెప్పా….నీది అని అడిగా(చాలా confident గా అడుగుతున్నాడు,మంచి numbr చెప్తాడ్లే అనుకున్నా)….చాలా style గా వాడు చెప్పిన numbr కి నాకు కళ్ళు తిరిగాయ్:20000………..నాకేం మాటాడాలో అర్థం కాలా…తనే అడిగాడు…మీ fathr ఏం చేస్తారు అని?….చెప్పా bsnl లో చిన్న జాబ్ అని…వాడే చెప్పాడు….మా నాన్న డాక్టర్,మా అమ్మ డాక్టర్, మా అన్న డాక్టర్, మా వదిన డాక్టర్….ఎక్కడుంటావ్ అనడిగాడు…ఫ్రెండ్సు అందరం కలిసి చిన్న రూమ్ తీసుకుందామనుకుంటున్నాం అని చెప్పా……నేను మాత్రం (దూరమైనా,బాలేకపోయినా) హాస్టల్ లోనే ఉంటా..లేకపోతే SCHOLARSHIP రాదు అన్నాడు…..నాకింకేం మాటల్రాలా!
  ఇప్పుడు వాడు నాకు మెడిసిన్ intrest లేదు అని mba చదవడానికెళ్ళాడు…వాడు ఆ రోజు ఆ సీట్ తీస్కోకపోతె నిజంగా డాక్టర్ కావాలనుకున్న ఇంకొకడికి ఆ అవకాశం వచ్చుండేదేమో…
  మా క్లాసులో రిజర్వేషన్ లో వచ్చిన వాళ్ళందరి పేరెంట్సూ(ఇద్దరూ)బాగా రెండు చేతులా సంపాదించేవాళ్ళె…..వాళ్ళు నిత్యం వెళ్ళేది చర్చిలకి…certificates లొ మాత్రం హిందువులు……వాళ్ళ maintainance ఎవరూ చెయ్యలేరు….ఆరేళ్ళూ వాళ్ళు enjoy చేస్తారు….మేమేమో కుక్కల్లా చదుతూనే ఉంటాం…..కానీ సునాయాసంగా పీజీ సీట్లూ వాళ్ళకె….జాబ్స్,ప్రమోషన్స్ వాళ్ళకే…..రేపు వాళ్ళ పిల్లలూ అంతె….కానీ ఒక్కడికీ patient దగ్గరకెళ్ళి చెయ్యి పట్టుకునే ధైర్యం ఉండదు…..అదే నిజంగా కష్టపడి సీట్ తెచ్చుకున్నవాడికి దాని విలువ తెలుస్తుంది…..

  ఈ దృష్టాంతాలు చాలనుకుంటా,రిజర్వేషన్లు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో తెలియడానికి…..అందుకే రెండు జనరేషన్లు రిజర్వేషన్ వాడుకున్నవాడికి ఇక తీసెయ్యాలి….professional courses లొ పీజీ స్థాయిలో రిజర్వేషన్ ఉండకూడదు…merit కే IMPORTANCE ఇవ్వాలి…..అప్పుడె అందరూ బాగుపడతారు…..దేశమూ బాగుపడుతుంది…

 13. చదువు చెప్పే వాళ్లకి, ఇంజేనీరింగ్, వైద్యం లోను రిజర్వేషన్స్ పెట్టటం మూలాన దేశం ముందరికి వెళ్లటం కష్ట మవుతుంది.
  చదువు చెప్పే వాళ్లు సరిగ్గా లేక పోతే ముందు తరాల వాళ్ళు గూడా అల్లాగే తయారవు తారు.
  ఇంజేనీరింగ్, నుండి బెస్ట్ రాక పోతే కట్టిన కట్టడాలు పడుతూ ఉంటాయి, కట్టబోయేవి సంవత్సరాలు తీసు కుంటాయి.
  వైద్యం లో ధైర్యం గ్రహణశక్తి లేక పోతే మనం ఏ రోగాల్ని అడ్డుకోలేము.
  దేశం లో అభివ్రుది జరగాలంటే ఈ మూడింటిలో రిజర్వేషన్స్ తీసి వెయ్యాలి. కావాలంటే గట్టిగ ట్రైన్ చేసి అందరితో పాటు మెరిట్ తో తీసుకోవాలి
  ఇంకో పరిస్థితి ఏమంటే కష్టబడి చదివి బయటకు వచ్చిన వాళ్ళు దేశం వదిలి వెళ్తారు.

 14. రిజర్వేషన్లు దుర్వినియోగం అయే సంఘటనలూ, నిత్యజీవితంలో కోకొల్లలు. ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక్క చోట ఏదో ఒక అనుభవం ఎదురవడం ఆశ్చర్యమేమీ కాదు.

  నేను గమనించిన సంగతి ఏమంటే – విధవా పునర్వివాహం, సతీ సహగమనం, వరకట్నం మొదలైన సాంఘిక దురాచారాల నిర్మూలనా పద్ధతులు గమనిస్తే – రిజర్వేషన్ వంటి నమూనా ఎక్కడా లేదు. నా ఉద్దేశ్యం ప్రకారం స్వాతంత్రానికి ముందే అస్పృస్యతా నివారణ అనే దురాచారం కూడా కాలక్రమేణా మరో పద్ధతిలో దూరమయి ఉండేది. కేవలం రాజకీయనాయకుల వల్ల, దూరదృష్టి లేని సమాజ నిర్మాతల వల్ల ఈ రిజర్వేషాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు నిజమైన వివక్షత అగ్రవర్ణాలకే ఉంది.

 15. మండల్ మంటల్లో అంటించుకున్నతని పేరు రాజీవ్ గోస్వామి. ఒళ్ళు 90 శాతం కాలినా అతను చావలేదు. ఆ తరువాత డిల్లీలో ఏదో యూనివర్సిటీ విద్యార్థిసంఘానికి అధ్యక్షుడుగా ఎన్నికై పనిచేశాడు. తరువాతి సంవత్సరాల్లొ చనిపోయాడని విన్నాను. స్పష్టంగా తెలీదు.

 16. స్పందించిన ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన సంఘటనను చెప్పి మీ అందరి సానుభూతి పొందాలనుకోవడం నా ఉద్దేశ్యం కాదు. దానివల్ల జరగాల్సిన నష్టాలన్నీ జరిగిపోయాక, నేను ఉద్యోగం సంపాదించుకున్నాక నాకెందుకు సహానుభాతి? రిజర్వేషన్లన్నవి ఖచ్చితంగా సామాజిక సమస్యే…. ఇక్కడ నాకు జరిగిన సంఘటనను సమాజానికి అన్వయించి చెప్పలేదని పలువురు వ్యాఖ్యాతల వ్యాఖ్యాతల అనుభవాలు చదివితే తెలుస్తుంది.. సమాజం లో ఉన్న ఈ సమస్య ను ఎదుర్కొన్న వాళ్ళలో నేనూ ఒకణ్ణి అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశ్యం.

  • రవిచంద్ర గారు మీరు చెప్పుకున్నది మీ బాధ, మేము చెప్పుకున్నది మా బాధ. అంతే. గతంలో ఎప్పుడో వాళ్ళకి ఉపయోగపడుతుందని పెట్టిన ఈ రిజర్వేషన్ విధానం నేడు ప్రతిభావంతుల పాలిట శాపమయింది. కష్టపడి, చెమటోడ్చి చదివిన మంచి మార్కులు, ర్యాంకులు వచ్చిన వాడికి అదే కాలేజిలో సీటు, అత్తెసరు మార్కుల వాళ్ళకి అదే కాలేజిలో సీటు. ఈ మాత్రం దానికి మనబోటి గాళ్ళం ఎందుకంత కష్టపడటం. ఇంట్లోవాళ్ళని కష్టపెట్టడం. ఇప్పటికే ప్రతిభ అంతా విదేశాలకు తరలిపోతోంది. ఈ దేశం వట్టి పోతోంది. అదే నా బాధ, ఆవేదన. బహుశా అందరిది కూడా.

 17. అన్ని రాజకీయ పార్టీలు చెప్పేది ఒక్కటే.
  వోటుబాంకు రాజకీయాలకనుగుణంగా ఈ దేశం కొంతమందికి రిజర్వ్ చేయబడింది.
  మిగతావాళ్ళ సంగతి మాకనవసరం. ఇష్టముంటే ఇక్కడ ఉండండి. లేకపోతే విదేశాలకి వెళ్ళిపోండి.

  ఈ రోజుల్లో ప్రైవేట్ సెక్టారులోనే ఉద్యోగాలు ఎక్కువ కాబట్టి నా దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం రిజర్వ్ చేసినా పరవాలేదు కాని కాలేజీ అడ్మిషన్లలో మాత్రం రిజర్వేషన్ ఉండకూడదు.
  సీటంటూ వస్తే ఎక్కడో అక్కడ, ఏదో ఒక ఉద్యోగం చేసుకు బతకవచ్చు.

 18. ఇరగదీసావు బాసు
  reservation లా మూలంగా మనం నష్ట పోయాం పోతునే ఉన్నాం
  ఏ అర్హత లేని వాడికి ఈ రోజు అధికారం చేతులో ఉంది ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో వీరు ముందు మనం చేతులు కట్టుకోని నిలబడ వలసి వస్తుంది

 19. ఆంధ్రప్రదేశ్ లో బీ.సీ.గ్రూపుల వర్గీకరణ మరోసారి చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.50 శాతం కోటా పరిమితికి మించి అమలు చేయాలంటే, మండల్‌ కమిషన్‌ తీర్పు సమయంలో సర్వోన్నత న్యాయస్థానం పొందుపర్చిన నిర్ణీత ప్రమాణాలను వెనకబడిన వర్గాల కమిషన్‌ పరిగణనలోకి తీసుకోవాలని ,తాజా జనాభా గణాంకాల ఆధారంగా వాటిని పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.తమిళనాడులో 69 శాతం ,కర్ణాటకలో 73 శాతం కోటా అమల్లో ఉంది.
  42 ఏళ్ళు గడిచినా రిజర్వేషన్ల అవసరం తీరలేదు. ఇంకా ఎంత కాలం అవసరమో చెప్పలేము. ఇన్ని ఏళ్ళ కాలంలో కనీసం ఫలానా కులాలను పైకి తీసుకురాగలిగాము అని చెప్పుకోటానికి తగిన గణాంక సేకరణ ప్రభుత్వం చేయ లేదు. ఏదైనా ఒక కులం జనాభాలో 45 శాతం కుటుంబాలు తగిన ఉద్యోగాలు సాధించి, ఆర్ధికంగా బలపడితే ఆ కులాన్ని రిజర్వేషన్ల పరిధి నుండి తప్పించాలని గతంలో కొందరు మేధావులు కోరారు. ఆ ప్రకారంగా రిజర్వేషన్లు పొందే కులాల జాబితా క్రమేణా తగ్గిపోయి, కొంత కాలానికి రిజర్వేషన్లే ఉండవని వారి వాదం. అయితే ఆయా కులాల జనాభా మీద ప్రభుత్వం సమగ్రమైన సర్వేలు జరుపుతూ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.
  జనాభా ఎక్కువగా ఉండి, రాజకీయ శక్తులను భయపెట్టగలిగే కులాలు ఈ రిజర్వేషన్ల వల్ల ఎక్కువగా లాభపడుతూ ఉండగా, జనాభా తక్కువగా ఉండి, రాజకీయ నాయకత్వమే లేని కులాలు నష్టపోతున్నాయి. అందువలన శక్తివంతమైన కులాలను, శక్తిహీనమైన కులాల సరసన ఉండకుండా వేరు చేయాలి. ఆ విధంగా శక్తిమంతమైన కులాలు, శక్తిహీనమైన కులాలకు అడ్డురాకుండా కాపాడాలి.షెడ్యూల్డ్ కులాలు తెగలలోని శక్తిమంతమైన కులాలను వెనుకబడిన తరగతులు ‘ ఎ ‘ గ్రూపులోను, వెనుకబడిన తరగతులలోని శక్తిమంతమైన కులాలను దాని క్రింది గ్రూపులోను చేర్చాలి. ఆ విధంగా ప్రతి అయిదేళ్ళకొకసారి మార్పు తలపెట్టాలి. ప్రతి పంచవర్ష ప్రణాళికలోను ఆయా హీన కులాల అభివ్రుద్ధి కోసం పేరు పేరు వరుసన నిధులు కేటాయించి అవి వారికే అందేలా చూడాలి. అయిదేళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఆ కులం స్థాయి సాంఘికంగాను, ఆర్ధికంగాను బాగుపడాలి. ఆ విధంగా కాలక్రమేణా రిజర్వేషన్ల చట్రంలో నుండి అన్ని కులాలు తొలగిపోవాలి. కులం పేరు మీద ఇక ఎవ్వరూ రిజర్వేషన్ కోరలేని పరిస్థితి రావాలి.

వ్యాఖ్యలను మూసివేసారు.