ఎక్కాలు- గుణింతాలు ఎలా నేర్చుకునేవాళ్ళమంటే…

చిన్నప్పుడు గుణింతాలు ఎలా నేర్చుకునేవాళ్ళమంటే

క తలకొట్టిస్తే క

క కుధీర్ఘమిస్తే కా

క గుడిస్తే కి

క గుడి దీర్ఘమిస్తే కీ

క కొమిస్తే కు…. ఇలా అన్న మాట.

బడి లో రోజు సాయంత్రం ఎక్కాలు బాగా తెలిసిన వాళ్ళు నిలబడి చెబుతుంటే మిగతా వాళ్ళంతా వల్లె వేయాలి.

రొండొకట్ల రొండు

రొండ్రొళ్ నాలుగూ

రొణ్ మూళ్ళారు… ఇలా భలే రిథమిక్ గా సాగిపోయేది.

పొరపాటున తప్పు జెప్పినా , తడుముకున్నా.. అయ్యోరి నుంచి చీవాట్లు, పిలకాయల నుంచి ఎగతాళి బహుమానాలుగా లభించేవి.

ప్రకటనలు

34 thoughts on “ఎక్కాలు- గుణింతాలు ఎలా నేర్చుకునేవాళ్ళమంటే…

 1. hammayya lalita gari kante mundu kamentaanu
  keka 😛
  good post ravi garu పొరపాటున తప్పు జెప్పినా , తడుముకున్నా.. అయ్యోరి నుంచి చీవాట్లు, పిలకాయల నుంచి ఎగతాళి బహుమానాలుగా లభించేవి.correst 😀

 2. రవిచంద్ర గారు ,,.
  బాగా చెప్పారు ,.. నేను కూడా మయ గ్రామం లోని ఏకోపాధ్యాయ పాఠశాలలో చదివేటప్పుడు ఇలాగే చేసేవాళ్ళం ,..
  ఉదయంపూట తెలుగు (తెలుగు అక్షరమాల మొదలుకొని ,… తెలుగు సంవత్సరాలు,. వేమనపద్యాలు వరకు) ,.. మద్యాహ్నం లెక్కలు ,…

  ఇరవై ఎక్కం చెప్పేటప్పటికీ అందరి చంకల్లో పలకలు రెడీగా ఉంటాయు ,.. ఇరవైతోం నూటాఎనవై అనగానే ,. ఉరుకుడొ … ఉరుకుడు,… ఇరవై పదుల రెండు వందల్ పలకాకుండానే!!!

  • ఓ మీరు కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలో చదివారన్న మాట. 🙂
   >>ఇరవైతోం నూటాఎనవై
   ఈ భాషనే స్పోకెన్ ఎక్కాలు అంటారు 🙂

   • రవిచంద్ర గారు,

    నాకైతే కొన్ని(అన్ని) సార్లు ఆ చదువులే మంచిది అనిపిస్తుంది ,.. ఐదవ తరగతి వరకు అస్సలు పుస్తకాలే( ఒక్క చెక్కపలక మాత్రమే) లేకుండా చదివే వాళ్ళము ,.. ఈ పుస్తకాలలో చదవకుండానే ,.. ౨౭ నక్షత్రాల పేర్లు ,, ౧౨ తెలుగు నెలలు ,. ౬౦ తెలుగు సంవత్సరాల పేర్లు ,.. ఇంకొన్ని నీతిపద్యాలు అలవోకగా నేర్చుకునే వాళ్ళం(చాలా సార్లు విని అలాగే గుర్తు ఉండిపోయేది) ,.. ఇప్పుడు ౨ సంవత్సరాల ముందు ఏమీ చదివామో అస్సలు గుర్తు లేదు ,… పలక పట్టి నేర్చుకొన్నది కొంచెమైనా ఇప్పటికీ గుర్తు ఉంది!!

 3. అవునండీ,మనం ఎంత సులువుగా,నోట్లో తిరిగేట్లు నేర్చుకున్నామో కదా!కాని ఇప్పుడు ఇంగ్లీషు బళ్ళల్లో గుణింతాలు ఎలా నేర్పుతున్నారో సుజాతగారు చెప్తుంటే చాలా బాధనిపించింది..క+అ=కా..ఇలా అట..మన పెద్దవాళ్ళు అంత సులువుగా నేర్చుకునే పధ్ధ్హతులు చెప్తే వాటిని అనుసరించకుండా,వీళ్ళు ఎందుకు చిన్న బుఱ్రల మీద అంత భారం మోపుతున్నారో అర్థం కావట్లేదు….బహుశా పాతవాటిని ఎలాగోలా మారిస్తేనే పురోగమనం,అభివృధ్ధ్హి అని అనుకుంటున్నారేమో…లేకపోతే,అలా చెప్తేనే so called POSH R HIGH CLASS STUDIES అనుకుంటున్నారేమో…నా తెలుగు సరస్వతిని ఇంతగా హింసించి వీళ్ళేం బావుకుం(టా)టున్నారో అర్థం కావట్లా..

 4. మా అమ్మాయి తెలుగు గుణింతాలు ఇలా నేర్చుకుంటుంది

  క+(ప్లస్)తలకట్టు=(is equal to)క
  క+(ప్లస్)దీర్ఘం=(is equal to)కా
  క+(ప్లస్)పూర్ణానుస్వరం=(is equal to)కం ….
  క+(ప్లస్)విసర్గ=(is equal to)కః

  వాళ్ల బళ్ళో సరిగ్గా ఇక్కడ నేను రాసినట్లే చదవాలి. నేను మీరు చెప్పినట్లు చదివి వినిపిస్తే ‘ఇదేంటి, పాటలా ఉంది, నాకొద్దు”అని వాళ్ల టీచర్ చెప్పినట్లే చదువుతోంది. నాకు కంపరం పుట్టి దానికి గుణింతాలు వచ్చేదాకా ఆ దరిదాపుల్లో కూడా ఉండటం మానేశాను.

  రెండో ఎక్కం మధ్యలో “రెండైదులు పాది” అంటారా మీరు కూడా! 🙂

  • >>రెండో ఎక్కం మధ్యలో “రెండైదులు పాది” అంటారా మీరు కూడా!
   అచ్చం అలాగే అంటాం…. 🙂 🙂

 5. క కి సున్నా పెడితే కం కాదా? సున్నాని పూర్ణానుస్వరం అంటారని ఇప్పుడే తెలిసింది నాకు! వామ్మో! 😦

 6. mee andhari matalu vintunte naaaku chala hayiga,santhoshamnga undhi.endhkante nenu kuda ilage tution lo chadivanu kabatti.
  SORRY NANNU ANTHA KSHAMINCHALI>ENDHUKANTE NA DAGGARA TELGU FONTS EVI LEVU.RAKA RAKALA FONTS EKKADI NUNCI DOWNLOAD CHEYAVACHU. ILDC.GOV.IN KAKUNDA>

  • అన్ని ఒక చోట దొరికే వెబ్ సైటంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. గూగుల్ లో వెతకండి దొరకుతాయి.

 7. రంగనాయకమ్మ గారి “తెలుగు నేర్పడం ఎలా?” పుస్తకం చదివారా? అందులో ఆవిడ పిల్లలకు సులువుగా అర్థం అయ్యేలా ఎలా చెప్పలో వివరిస్తారు.

  • రంగనాయకమ్మ గారి “తెలుగు నేర్పడం ఎలా?” పుస్తకం చదివారా? అందులో ఆవిడ పిల్లలకు సులువుగా అర్థం అయ్యేలా ఎలా చెప్పలో వివరిస్తారు.

   ippudu avida peru chebihe mee jeevitham oka sahityavalokanam avutundi
   all the best 😛

   • ఆవిడ రాసిన రామాయణ విషవృక్షం లాంటివి నాకూ నచ్చవు.
    కాకపోతే ఇలాంటి పుస్తకాలు బాగుంటాయేమో అన్న చిన్న కుతూహలం అంతే… 🙂

 8. నవీన్,
  ప్రవీణ్ లాంటి వ్యక్తి రాసిన రాతల్ని బట్టి రంగనాయకమ్మగారి సాహిత్యాన్ని అంచనా వేయకూడదు. మార్క్సిజం అన్న ఒక్క పాయింట్ పట్టుకుని సాహిత్యావలోకనంలో ఆయన ఏదేదో రాస్తుంటారు. ఆమె పుస్తకాలు చదవండి.ఆమెను ప్రపంచమంతా అర్థం చేసుకున్న కోణం వేరు, ప్రవీణ్ గారు అర్థం చేసుకునే కోణం వేరు. అదేమిటో ఆయనకే క్లియర్ గా తెలీదు.

  రవి,తెలుగు నేర్పడం ఎలా నా దగ్గరుంది. అలాగే రామాయణ విషవృక్షం కూడా! చదివి చెప్పారా చదవకుండానే చెప్పారా నచ్చదని?

  • >>చదివి చెప్పారా చదవకుండానే చెప్పారా నచ్చదని?
   సారాంశం చదివాను కానీ పూర్తి పుస్తకం మాత్రం చదవలేదు. ఎందుకంటే దానిపేరే అలాగుంది కాబట్టి. ఎందుకు చదవలేదు అంటే చిన్నప్పటి నుంచి రామాయణం ఆదర్శంగా ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్న నేను రచయిత రాసిన నెగటివ్ ఆలోచనలతో ప్రభావితం కాదలుచుకోలేదు. ఎందులోనైనా పాజిటివ్ అంశాలని మాత్రమే స్వీకరించడం నా పాలసీ. అలా రామాయణాన్ని పాజిటివ్ కోణంలోనే మనసులో ఉంచుకుందామని దాని జోలికి వెళ్ళలేదు అంతే తప్ప ప్రవీణ్ సాహిత్యం చదివి ఏర్పరుచుకున్న అభిప్రాయం కానే కాదు.

  • సుజాత గారు,
   చలం గారి పుస్తకాలు ఎంత బావుంటాయి,మరి అతని శిష్యుడు అని చెప్పుకొని అతను వాటి విలువలను తియ్యడం లేదా? ఖూనీ చెయ్యడం లేదా?
   ఆ మహానుభావుడు వీడి రాతలను చూసుంటే చలం గారే అత్మహత్య చెసుకునేవారు..

   ఎందులోనైనా పాజిటివ్ అంశాలని మాత్రమే స్వీకరించడం hats off రవి చంద్ర గారు all the best

 9. అయితే చలం చాలా సంతోషిస్తూ ఉండాలి..ఇప్పుడు బతికి లేనందుకు!గురువు కే ఎసరు పెట్టే శిష్యులు అందరికీ లభిస్తారా చెప్పండి?

  • ఎక్కడైనా గురువును మించిన శిష్యులను చూశాను. ఇలా గురువులను “ముంచే” శిష్యులను చూళ్ళేదు. 🙂

 10. డియర్ రవి , చిన్నప్పటి రోజులు నాకు గుర్తు చేస్తూ వుంటుంది మా యింటి ప్రక్కనున్న చిన్న పిల్లల స్కూల్.
  బహు పురాతన శిక్షణ ప్రక్రియ ల లో యీ ప్రక్రియ ఒకటి. అలాగే యీ రోజు వుదయమే మీ బ్లాగులో మీరున్నూ.
  ఆనాడు ఆ విధానంలో చదువు నేర్పించారు కాబట్టే యిప్పటికీ కొంతైనా గుర్తుంచుకొన్నాం. యీ రోజున మక్కికి మక్కిగా మీకు గుర్తుండి యీ బ్లాగులో చర్చించుకొంటున్నాం. నూతన విధానాలెన్నొచ్చినా గత విధానాల ఔన్నత్యానాలను మనం తేలికగా చూడడం జరుగ రాదు.
  అసలు విషయమేమంటే….
  ఈ రోజు ఈనాడు లో మీ వ్యాసం చూశాను. అందులో సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అబ్యర్ధులకు మీరిచ్చిన సూచనలు సలహాలు అహ్వానించ దగ్గవి. మీరు చెప్పాలన్నది చాల విపులంగా సింపుల్ గా వ్యక్త పరిచారు. అభినందనలు…. కీపిటప్……….నూతక్కి

  • >>నూతన విధానాలెన్నొచ్చినా గత విధానాల ఔన్నత్యానాలను మనం తేలికగా చూడడం జరుగ రాదు.
   తప్పకుండా… ఇంకా నా చిన్నతనంలో జరిగిన అనుభవాలన్నీ రాయాలని ఉంది.
   >>ఈ రోజు ఈనాడు లో మీ వ్యాసం చూశాను.
   చాలా సంతోషమండీ… ధన్యవాదాలు.

 11. రవిచంద్రా,

  ఇది మీ టపా గురించి కాదు,మీ వ్యాఖ్యలోని రామాయణ విషవృక్షం ప్రస్తావన గురించి…

  >> చిన్నప్పటినుంచి రామాయణం ఆదర్శంగా ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్న నేను రచయిత రాసిన నెగటివ్ ఆలోచనలతో ప్రభావితం కాదలుచుకోలేదు.

  రచయిత నెగటివ్ ఆలోచనలు రాశారని పుస్తకం చదవకుండానే,టైటిల్ ని బట్టే నిర్ణయానికి రావొచ్చా? ఎందులోనైనా పాజిటివ్ అంశాలను మాత్రమే స్వీకరించటమంటే ఇదేనా?

  విషవృక్షం మీచేత బలవంతంగా చదివించాలని కాదు కానీ, ఆ పుస్తకం చదివితే- రామాయణంలోని పాజిటివ్, నెగిటివ్ కోణాలు రెండూ తెలుసుకోవచ్చని నా అనుభవం.

  • >>రచయిత నెగటివ్ ఆలోచనలు రాశారని పుస్తకం చదవకుండానే,టైటిల్ ని బట్టే నిర్ణయానికి రావొచ్చా? ఎందులోనైనా పాజిటివ్ అంశాలను మాత్రమే స్వీకరించటమంటే ఇదేనా?
   నేను పూర్తి పుస్తకం చదవకున్నా పుస్తక సారాంశం గురించి చదివానని ఇదివరకే చెప్పాను. … ఆమె రాసిన మంచి విషయాలను మిగతా విషయాలు డామినేట్ చేశాయని నేను చదివిన వ్యాసంలో అర్థం చేసుకున్నాను. ఆ పుస్తకం లోని పాజిటివ్స్ గురించి ఎక్కడైనా సమీక్ష లాంటి వ్యాసం ఉంటే చెప్పండి. దాన్ని చదివిన తరువాత నేను కన్విన్స్ అయితే తప్పకుండా ఆ పుస్తకం చదువుతాను. … కానీ పైవ్యాఖ్యతో నేను అంగీకరిస్తాను.

 12. బావుందండీ మీ పోస్టు

  రెండొకట్ల రెండు,రెండ్రెళ్ళారు……రెండైదులు పాది అని ఊగుతూ చదివేవాళం చిన్నప్పుడు
  క కింద మ వత్తిస్తే క్మ, క కి వట్రసుడిస్తే కృ అని వల్లెవేసేవాళ్ళం.
  పలక మీద లెక్కలు చేసేవాళ్ళం.
  ఇప్పుడు ఆ వాతావరణమే లేదు. అసలు తెలుగులో అక్షరాలు ఎంతమంది పిల్లలు నేర్చుకుంటున్నారు ఈ రోజుల్లో !

 13. ఒక చిన్న విన్నపం రవి,
  రంగనయకమ్మగారి పుస్తకాలు ఒకటి రెండు అయినా చదవండి తరువాత మీ అభిప్రాయం చెప్పండి.
  ఆవిడ రాసిన ‘తెలుగు నేర్చుకోవడం ఎలా’ పుస్తకం చాలా బాగుంటుంది.
  రామయణ విషవృక్షం కూడా చదివాక అభిప్రాయం చెప్పండి. మన భారతదేశంలో అందరం కూడా రామయణం గురించి చదివో, వినో పెరిగేఉంటాం. కానీ ఒక దశ తరువాత మనకు మనమే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుంటాం. తెలుసుకోవాలి కూడా. మీరన్నారుగ రామాయణం అంటే చిన్నప్పటి నుండి నాకిష్టం దాని మీద వ్యతిరేఖ వ్యాఖ్యలను నేను భరించలేను అని. మీరేమనుకోనంటే ఒక మాట…వ్యతిరేఖ వ్యాఖ్యలు వినకుండా, చదవకుందా దానిలోని అంశాలను అర్థం చేసుకోకుండా కామెంటు చెయ్యడం సబబు కాదేమో. చదివి ఆలోచించిన తరువాత కూడా మీకు నచ్చకపొతే అప్పుడు చెప్పొచ్చు. ఒకసారి ఆలోచించండి. వీలైతే ఒకసారి చదవండి.

  రంగనాయకమ్మగారు అద్భుతమైన పుస్తకలు రాసారు. ఆవిడ మార్కిజం అంటే నాకూ ఇష్టం ఉండదు. ఆర్థికశాస్త్ర విద్యార్ధిగా నేను మార్కిజం కి వ్యతికేఖం. కానీ ఆవిడ రాసిన ఎన్నో అంశాలు మనకి ఉపయోగదాయకం. అలాగే చలం గారు ఒక గొప్ప వ్యక్తి, ఆయన రచనలు మనకి దిశానిర్దేశకాలు, ఇది నా అభిప్రాయం సూమండీ !

  • అయ్యో సౌమ్య గారూ… రంగనాయకమ్మ, చలం పుస్తకాలేవీ నేను చదవలేదని చెప్పలేదు. చలం గారి కల్యాణి, బ్రాహ్మణీకం చదివాను.
   “విషవృక్షం ” అనగానే అందులో ఆమె ఏం రాసి ఉంటుందో ఊహించానంతే….మీరు, సుజాత గారు, వేణు గారు ఇంత మంది చెప్పాక నా అభిప్రాయం మార్చుకుంటున్నాను.

వ్యాఖ్యలను మూసివేసారు.