ఇన్నాళ్ళకు దొరికారు

ట్రాఫిక్ నేరాలను విచారించే న్యాయస్థానంలో ఒకసారి పోలీసులు ఒక మహిళను తీసుకొచ్చి హాజరుపరచారు.

“ఈమె ఏ నిభందనను ఉల్లంఘించింది?” అడిగాడు న్యాయమూర్తి.

“రెడ్ సిగ్నల్ దాటి వెళ్ళిపోతుంది యువరానర్” జవాబిచ్చాడు ట్రాఫిక్ పోలీస్.

“ఏమ్మా నిజమేనా?” న్యాయమూర్తి ఆమెను ప్రశ్నించాడు.

“మరి నేనేమో అధ్యాపకురాల్ని. పాఠశాలకు ఆలస్యం కావడం వల్ల అలా దాటాల్సొచ్చింది. విద్యార్థులకు క్రమశిక్షణ భోదించే మేమే అది తప్పితే బాగుండదు కదా. అందుకనే అలా చెయ్యాల్సి వచ్చింది. కాబట్టి నన్ను వదిలేయండి సర్” అంటూ ప్రాధేయపడింది.

“ఓ మీరు టీచరా?… ఎప్పట్నుంచో ఈ కోర్టులో టీచర్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకు దొరికారు.  ఆహా…నా కోరిక ఇన్నాళ్ళకు నెరవేర్చుకుంటున్నాను.ఆ బల్ల మీద కూర్చుని ఇక మీదట నేనెప్పుడూ రెడ్ సిగ్నల్ దాటను అని 500 సార్లు రాయండి” !!! అన్నాడు న్యాయమూర్తి

ప్రకటనలు