తెలుగుపేరు గల మొట్ట మొదటి వెబ్‌సైటు

ఇప్పుడు URL కూడా తెలుగులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా మొట్టమొదటిసారిగా గాంధీ.com (మీరు విహరిణిలో ఇలా తెలుగు స్క్రిప్ట్‌లోనే టైప్ చెయ్యాలి) అనే వెబ్‌సైటు ఇటీవలే ప్రారంభించారు. కాకపోతే ఇది టైప్ చేసిన తర్వాత మరో URL కు దారి మారి చూపిస్తోంది. మీరూ పరీక్షించండి.

6 thoughts on “తెలుగుపేరు గల మొట్ట మొదటి వెబ్‌సైటు

  1. ఒకటి రెండు సంవత్సరాల మునుపే, మన తెలుగు వికీపిడియా సభ్యులు, ఇలాంటి తెలుగు సైటు తయారు చేశారండి. చావా కిరణో, లేక వైజా సత్యానో గుర్తులేదు… తన బ్లాగులోనే ఆ లింకు ఇచ్చారనుకుంటా. కాకుంటే దానికి మీడియా కవరేజీ లేదంతే 😀

    • చావా కిరణ్ గారు కూడా ఇలాంటి సౌలభ్యం కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన బ్లాగులోనే చదివాను. వైజాసత్య గారు చేశారో లేదో తెలియదు. మీకు URL తెలిసుంటే ఇక్కడ ఇవ్వండి.

వ్యాఖ్యలను మూసివేసారు.