బ్లాగుల్లో చిత్రమాలికలను చేర్చడం ఎలా?

ఈ టపాలో బ్లాగుల్లో చిత్రమాలికలను చేర్చడమెలా అని తెలుసుకుందాం.అంతర్జాలంలో మీ ఫోటోలను అప్లోడ్ చేస్తే వాటిని స్లైడ్ షోలు గా మార్చే ఉచిత వెబ్ సైట్లు చాలా అందుబాటు లో ఉన్నాయి. ఒక వేళ మీరు బ్లాగర్ ద్వారా బ్లాగు చేర్చి ఉంటే  పికాసా వెబ్ ఉత్తమమైంది. నేను ఈ టపాలో వివరించిన పద్దతి వర్డ్ ప్రెస్ బ్లాగులో పని చెయ్యదు. దానికి కొన్ని సాంకేతిక పరమైన పరిమితులున్నాయి. వాటిని వివరిస్తూ ఇంకో టపా రాస్తాను చూడండి.

embedslideshow
embedslideshow

ఇందు కోసం మీరు చేయవలసింది పికాసాలో ఒకవేళ మీకు ఖాతా లేకుంటే http://picasaweb.google.com/ కు వెళ్ళి మీ జీమెయిల్ సహాయంతో అక్కడ ఒక ఖాతా సృష్టించుకోండి. అక్కడ మీ ఫోటోలను ఆల్బమ్ ల రూపంలో భద్రపరుచుకోవచ్చు. మీరు సృష్టించిన ప్రతి ఆల్బమ్ కు ఒక కోడ్ ఇస్తుంది.

అప్లోడ్ పూర్తయిన తరువాత క్రింద బొమ్మల సహాయంతో వివరించిన సోపానాలు పాటించండి. పక్క బొమ్మలో కనిపిస్తున్న విండో పికాసా వెబ్ కుడి భాగాన కనిపిస్తుంది. అక్కడ Embed Slideshow అనే లింకు మీద నొక్కారంటే క్రింద చూపిన విండో ప్రత్యక్షమవుతుంది. ఆ విండో నుంచి రౌండప్ చేసిన భాగాన్ని కాపీ చేసుకుని మీ టపాలో పెట్టుకోవడమే.

Picasaslideshow
Picasaslideshow
ప్రకటనలు

9 thoughts on “బ్లాగుల్లో చిత్రమాలికలను చేర్చడం ఎలా?

  • సౌమ్య గారు,
   చాలా రోజుల తర్వాత కనబడుతున్నారు. నా బ్లాగులో…
   మీ బ్లాగు చూశాను చాలా బాగుంది.
   >>your comments and support are greatly appreciated.
   తప్పకుండా నా సపోర్ట్ మీకు ఎల్లవేళలా ఉంటుంది. 🙂

   • Thanks రవి.
    అవునండీ ఈ మధ్య చాలారోజులుగా బాగా బిజీగా ఉన్నాను. మన ప్ర.పీ.స.స కి కూడా దూరమయ్యాను ఇన్నాళ్లు. ఇప్పుడే కాస్త తీరిక చిక్కింది 🙂

 1. బాగుందండీ,100 మాటలు చెప్పే భావాన్ని ఒక్క బొమ్మలో చూపించవచ్చు.అందుకే నా రాతల్లో ఎక్కువగా బొమ్మలు పెడుతుంటాను.నాకు మీరు చెప్పిన బ్లాగులో చిత్రమాలిక వివరణ బాగా నచ్చింది.తప్పక ప్రయత్నించి చూస్తాను.:-)

  • లేఖరి గారు,
   నేను ఈ టపాలో వివరించిన పద్దతి వర్డ్ ప్రెస్ బ్లాగులో పని చెయ్యదు. దానికి కొన్ని సాంకేతిక పరమైన పరిమితులున్నాయి. వాటిని వివరిస్తూ ఇంకో టపా రాస్తాను చూడండి.

వ్యాఖ్యలను మూసివేసారు.