నేనొచ్చేశా….

ముగ్గుల పోటీ
ముగ్గు లోకి దించారు 🙂

హైదరాబాదుకు మెన్నే వచ్చేశా.. ఈ సారి సంక్రాంతికి ఈ సారి అన్ని ఊర్లు తిరిగేశా … సుందర దృశ్యాలు కెమెరాలో బంధించేశా….

భోగి పండగ నాడు మా అక్క వాళ్ళ ఊరికెళ్ళా… అక్కడ సాయంత్రం ముగ్గుల పోటీలు, నాటక ప్రదర్శన జరిగాయి. టీవీ సీరియళ్ళ పిచ్చిగల ఇల్లాలి గురించి రాసిన  “తెల్లచీకటి” అనే నాటకం ఆద్యంతం హాస్యభరితంగా సాగింది.

సంక్రాంతి నాడు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి నేను ఎనిమిదో తరగతి దాకా చదువుకున్న పాఠశాలలో చిన్ననాటి మిత్రులందర్నీ కలిశాను. ఇక కనుమ పండుగ రోజున మా గ్రామానికి వెళ్ళాను. అక్కడ గ్రామ దేవతలనంతా సందర్శించా. ఇక సాయంత్రం గొబ్బిళ్ళ దగ్గర సందడి సరేసరి. ఇక్కడ కూడా నా బాల్య మిత్రులందరినీ కలిసి మరుసటి రోజు శ్రీకాళహస్తికి వచ్చేశాను.

కాకపోతే ఇన్నేళ్ళొచ్చినా ఇంటి నుంచి వచ్చిన కొద్ది రోజుల దాకా నాకు ఇంటి బెంగ మాత్రం తీరదు. వెళ్ళేటపుడు శ్రీకాళహస్తి స్టేషన్ ఆమడ దూరంలో ఉండగానే ఎంత ఉద్వేగం కలుగుతుందో, తిరిగొచ్చేటపుడు గాలిగోపురం కనుమరుగైపోతుంటే అంత నిర్వేదం. అందుకనే ఈ సారి దండిగా ఫోటోలు పట్టుకొచ్చా…గుర్తొచ్చినపుడల్లా చూసుకోవచ్చని.

12 thoughts on “నేనొచ్చేశా….

  1. photolu, mukhyam ga muggulu chala bagunnayi… memu kooda prati samvatsaram ilage muggulu, bommala koluvu, gobbilla toh enjoy chestamu… ee sari added highlight entante maa akka valla pillalaki bhogi pallu posukovatavm 🙂 mee pics picasa lo petti share cheyandi… aa muggulu copy kottukovali 😉

  2. మీ వూరి ఆడపిల్లలు ముగ్గుల విషయంలో అరివీర భయంకరుల్లాగా ఉన్నారే! ఒక్కో ముగ్గు కి ఎన్ని చుక్కలో ఏమిటో డిస్క్రిప్షన్ తీసుకున్నారా లేదా? అవన్నీ కాపీ చేసుకోవాలి నేను. ముగ్గుల విషయంలో ప్రతి ఏడాదీ పరగడుపే నాకు!

    • అమ్మో ఆ టెక్నికల్ డీటెయిల్స్ నాకు తెలియదండోయ్. కావలిస్తే మా మేనకోడల్నడిగి చెబుతా…

    • అన్ని ఫోటోలు చేర్చడానికి సమయం చిక్కలేదండీ, ఈ రోజు సాయంత్రం కూర్చుని చేయాలి. 🙂

  3. అబ్బా.. ఎంత బాగున్నాయో రంగవల్లికలు. ఎంత ముచ్చటగా అద్దారు రంగులు. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండీ. ఫోటోలు చూపించినందుకు ధన్యవాదాలు 🙂

    • అవునండీ ఈ సారి సంక్రాంతి సగం ఈ ముగ్గుల్లోనే కనపడింది నాకు. 🙂

  4. అబ్బ ముగ్గులు ఎంత ముచ్చటగా ఉన్నాయో, నేను చిన్నప్పుడు పెట్టిన ముగ్గులన్నీ గుర్తొస్తున్నాయి. ఈసారి ఆ భాగ్యం నాకు కలగలేదు. అందుకే నా ముగ్గుల బాధ నా బ్లాగులో రాసుకున్నాను.

వ్యాఖ్యలను మూసివేసారు.