భారవితో భాసించిన e-తెలుగు సమావేశం

ఈ ఆదివారం జరిగిన e-తెలుగు సమావేశానికి విచ్చేసిన ప్రముఖ సినీ రచయిత జె.కె. భారవి తన అంతరంగాన్ని మాతో పంచుకున్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ చర్చలో సినిమా రంగంపై తనకున్న అభిప్రాయాల్ని నిష్కర్షగా, నిర్మొహమాటంగా వెల్లడించారు. సమాజంపై సినిమాల ప్రభావం గురించీ, సార్వజనీనమైన సినిమా కళ ద్వారా ప్రజలను మంచి మార్గంవైపు మళ్ళించాల్సింది పోయి, అర్థం పర్థం లేని చెత్తను ఉత్పత్తిని చేస్తున్నామంటూ వాపోయారు.తమ కుటుంబం ఏడు కార్లతో విలసిల్లిన స్థితి నుంచి, ఈ సమావేశానికి షేర్ ఆటో లో వచ్చేంత స్థితికి రావడానికి గల కారణాలు,  కన్నడంలో ఆయన సినీ ప్రస్థానాన్ని గురించి సంక్షిప్తంగా వివరించారు.ఒక్క మాటలో చెప్పాలంటే ప్రసార మాధ్యమాల ద్వారా మనకు తెలియనని కొత్త భారవిని మాకు పరిచయం చేశారు.

కేవలం భక్తి సినిమాల ద్వారానే ప్రేక్షకులకు పరిచయమైన భారవి తన రచనలకున్న వైవిధ్యాన్ని కొన్ని కథలు, సంఘటనల ద్వారా పరిచయం చేశారు. సామాజిక స్పృహతో ఆయన చేసిన ఎన్నో సినిమాలు  సెన్సార్ కత్తెరకు బలయ్యాయనీ, తన భావప్రకటనా స్వేచ్ఛను హరించివేశారనీ, ఇవన్నీ ప్రచారంలోకి తీసుకురావడానికి బ్లాగులు అత్యుత్తమ సాధనంగా అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్ళు కేవలం రచయితగానే ఉండి తన సామాజిక భాద్యతను నిర్వహించాలనుకున్నాననీ, ఇప్పుడు e-తెలుగు ద్వారా తన బుర్రకు పట్టిన బూజు దులుపుకుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుని సరికొత్త రీతిలో ప్రజల్లోకి వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేశారు. e-తెలుగు తలపెట్టిన, ప్రస్తుతం ప్రణాళికలో ఉన్న రచయితల వర్క్ షాపుకు తనవంతు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు.

ఇంకా భవిష్యత్తులో e-తెలుగు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువవ్వాలని, అందుకు కార్యనిర్వాహకుల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకతను కూడా సభ్యులు వ్యక్తపరచడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన బ్లాగర్లు: సీబీ రావు గారు, చదువరి గారు, సుజాత గారు, చక్రవర్తి గారు, సతీష్ గారు, కశ్యప్ గారు, శ్రీనివాస కుమార్ గారు.

ప్రకటనలు

8 thoughts on “భారవితో భాసించిన e-తెలుగు సమావేశం

  • 🙂 ఏంటో ఒక్కోసారి అలా జరిగిపోతుంటాయి. కానీ వచ్చుంటే మాత్రం మీకు బాగా ఉపయోగపడేది.

 1. ఇ-తెలుగు మరో అడుగు ముందుకేసిందన్నమాట. మరిన్ని అడుగులు ముందుకు పడాలని కోరుకుంటూ…….

 2. రవీ !భారవిగారి వుదంతం చదివి మనసు భారంగా మూలిగింది. ఓడలు బండ్లగుటయన్న యిదేనన్నమాట.
  e తెలుగు సమావేసానికి ఒక సారి మీరాబ్సెంట్,సి.బి. రావు గారు కూడా ఆబ్సెంట్.వీవెనుడు గారు ప్రెజెంట్. మెంబర్ని కాకున్నా,నేనూ ప్రెజెంట్.ఆ వుదంతం ,”క్రిష్ణకాంత్ పార్కులో విరిసిన సాహితీ సుమాలు” అంటూ బ్లాగీకరించానుకూడా. ప్చ్! …..ఈసారీ మిస్సయ్యాను.భారవి గారిని కూడా. అభినందనలతో…నూతక్కి

  • >>భారవిగారి వుదంతం చదివి మనసు భారంగా మూలిగింది
   అవునండీ మాకూ అలాగే అనిపించింది.
   >> e-తెలుగు సమావేశానికి హాజరవడానికి కేవలం సభ్యులే కానవసరం లేదు. ఎవరైనా హాజరు కావచ్చు.

వ్యాఖ్యలను మూసివేసారు.