అఘోరించండి

బస్సులు కాల్చకండిరా బాలరాజులూ అని చెప్పా!!!! ఒక్కడన్నా విన్నాడా??….లే…పెద్ద పుడింగిల్లా ఓ ఎగేసుకుని పోయి తగలెట్టారు..ఇప్పుడు చూడండి మన దూల ఎలా తీరుతుందో!!!!….అందుకే చెప్పారు చెరపకురా చెడేవు అని… కేసీఆర్ కి, లగడపాటికి ఉచిత పాస్ లు వున్నాయి..వాళ్ళకేమి కాదు..మరి మనకో కనీసం బస్ పాస్ కూడా లేదాయే……
అఘోరించండిరా నెల తక్కువ వెధవల్లారా….
నా మిత్రుడు భాస్కర్ ఆక్రోశం……

ప్రకటనలు

14 thoughts on “అఘోరించండి

 1. ఆకాశాన ఉమ్మేస్తే ఏమవుతుంది?

  కాల్చే వల్లే కాదు చూసేవాళ్ళు కూడా తెలుసుకోవాలి, మన ఇల్లు తగల పెడతాం అంటే మెదలకుండా బయటకు వస్తామా? చాతనైనంత రెసిస్టన్స్ ఇవ్వాలి కదా, పోలీసులకు చెప్పటమో ఏదో చేయ్యలికదా

 2. రవి గారు

  తగలపెట్టే వాళ్ళని, వారికి వత్తాసు పలికేవాళ్ళని, చుట్టూ చూస్తున్నవారిని,ఆ ప్రాంతంలో ఉన్న వారందరి మీద మూకుమ్మడి కేసులు పెట్టి, మొత్తం నష్టాన్ని వారి వ్యక్తి గత ఆస్తులనుండి వసూలు చెయ్యాలి లేదా వారికి 14 సంవత్సరాలు శిక్ష విధించేలా మన చట్టాలను రూపొందించాలి. అప్పుడు కాని ఇలాంటి పనులు చేసేవాళ్ళకి బుద్ధి రాదు. చదువు సంధ్యా లేకుండా రోడ్లు మీద తిరిగే వారికి ప్రజల ఆస్తుల విలువ ఏమి తెలుస్తుంది. అమ్మ, నాన్న కష్తపడి తెస్తే తిని తిరిగే జులాయిలుకి చార్జీలు పెరిగి తే బాదేమి ఉంటుంది.

  సుధ

 3. aa place lo unte telustundhi yentha bayamo.. bus nu kalchataniki vachedhi 1000 mandhi.. bus lo undedhi 100 mandhi.. yedhuruthirigi they anthey sangathulu.. aa place lo meru unna anthey anukondi

 4. ఇవాళ పొద్దున్న ఒక న్యూస్ ఛానెల్లో “సామాన్యుల నడ్డి విరిచిన ప్రభుత్వం” అనే పేరుతూ విలేకరి జనం బాధను ఆవేశంగా వినిపిస్తుండగా ఒక భిన్న స్వరం వినపడింది.

  “అవును, ఈ ఛార్జీలు మనం భరించాల్సిందే! మన ఆస్థుల్ని మనమే ఉద్యమాల పేరుతో తగలబెట్టుకున్నపుడు దానికి మనం బాధ్యత వహించాల్సిందే!ఆర్టీసీ మాత్రం బతకొద్దా! ఉద్యోగులకు జీతాలివ్వాలా వద్దా? ఒక్కో బస్సు లక్షల విలువ చేస్తుందని తెలిసినపుడు , విద్యార్థులు బస్సులు తగలెడుతుంటే చూస్తూ ఊరుకున్న నాయకులకు ఈ ఛార్జీల గురించి మాట్లాడే హక్కు లేదు. ఇది మనం భరించి తీరాల్సిందే”అన్నాడొక సామాన్య పౌరుడు.

  భలేగా నచ్చాయి అతని మాటలు.

  ఈ తగలెట్టిన వాళ్ళు బస్సులెక్కుతారో లేదో తెలీదు. వాళ్ళు చేసిన వెధవ పనులకు మూల్యం రాష్ట్ర ప్రజలంతా భరించాలట. సుధ గారు చెప్పినట్లు మన న్యూస్ ఛానెళ్ళ దగ్గర ఆందోళన కారులు పెట్రోలు కొంటున్న దగ్గరుంచీ వీడియోలు ఉంటాయి కాబట్టి నాగం మీద దాడి చేసిన వాడిని పట్టుకున్నట్లే బస్సుల్ని కాల్చిన వాళ్ళను పట్టుకుని వాళ్ల ఆస్థుల్ని జప్తు చేసెయ్యాలి.

  అయినా తాడూ బొంగరం లేని జులాయి వెధవలేగా ఇలాంటి పన్లు చేసేది. వాళ్ళ దగ్గర ఇంకా రిక్వరీ కూడానా! అయ్యేపని కాదులెండి.

  • అసలు ఈ గొడవలు మొదలైనప్పటి నుంచి పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నేరస్తులను పట్టి శిక్షించాలన్న చిత్తశుధ్ది కనిపించడంలేదు.

 5. లాబాలలో నడవబోతున్న సంస్థను మనమే తగలబెట్టామ్ ఇపుడు చార్జీలు కూడా మనమే భరించాలి చేతిలో కర్రో రాయో వుంటే చాలు శివమెత్తి పోయి ప్రతాపం చూపిస్తున్నారు ఆర్టిసీ మీద అనుభవించండి

 6. అన్ని ధరలూ పెరిగాయి ఇక విద్యుత్ చార్జీలు ఉన్నాయి అవి కూడా పెరిగి పోతే సామాన్య జనం పరిస్థితి ?

వ్యాఖ్యలను మూసివేసారు.