ఈ సారి సంక్రాంతికి ఊరెళ్ళేవాళ్ళకు కొన్ని సలహాలు

అందరూ అనుకున్నట్టే నిన్న కేంద్రం తెలంగాణా విషయం ఎటూ తేల్చలేదు.కాబట్టి తెలంగాణా విద్యార్థి గర్జనల నేపథ్యంలో సంక్రాంతికి హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్ళి జాగ్రత్తగా తిరిగి రావాలనుకునే వాళ్ళకు కొన్ని సలహాలు.

 1. వాళ్ళ దాకా ఎందుకు? మీరే మీ లైసెన్స్ ప్లేట్ మీద ఏపి బదులు టీజీ అని మార్చేసుకోండి.
 2. మీ కారు  ఆడియో లో “తెలంగాణా గట్టు మీద సందమామయ్యో” లాంటి పాటల కలెక్షన్ లాంటివి  ఉంచుకోండి. అవసరానికి పనికొస్తుంది.
 3. జై తెలంగాణా నినాదాన్ని బాగా ప్రాక్టీసు చేయండి.
 4. కాళోజీ ఉద్యమ కవితల్ని కొన్ని వల్లె వేయండి.
 5. కేసీఆర్ మీద యూట్యూబ్ వీడియోలు వెతికి పట్టుకుని ఆయన మాట్లాడే భాషను ఇట్టే పట్టేసుకోండి.
 6. లేడీస్ అయితే కొన్ని బతుకమ్మ పాటలు, వీలైతే కొన్ని డ్యాన్సులు నేర్చుకోండి.
 7. పింక్ కలర్ బట్టలేసుకుంటే మరీ మంచిది.

గమనిక: నాకు తెలంగాణా సంస్కృతి పైన గౌరవం ఉంది. కాకపోతే వాటిని బలవంతంగా ఇతర ప్రాంతాల వారిపై రుద్దాలనుకోవడం మూర్ఖత్వం. ఎవరి సంస్కృతులు వారివి. అందుకని దీన్ని కేవలం సరదాగా పరిగణించండి తప్ప సీరియస్ గా తీసుకోవద్దని మనవి.

ప్రకటనలు

22 thoughts on “ఈ సారి సంక్రాంతికి ఊరెళ్ళేవాళ్ళకు కొన్ని సలహాలు

 1. మొన్నీ మధ్యే కార్లో warangal వెళ్తే నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా కారు మీద “జై తెలంగాణ” స్టిక్కర్ అతికించారు. తిరిగేది హైదరబాదులోనేగా ఉంటే నష్టం లేదని ఉంచితే, హైదరబాదు రాగానే ఎవరో సమైక్యాంధ్రులు తీసేశారు.
  ఈ హూలిగనిజం ఎక్కువైపోయిందీ మధ్య. మొన్న న్యూయియర్ రోజు ఇంటికి తిరిగి వేళ్తుంటే కారాపి బయటకి రప్పించి జై తెలంగాణా అనిపించేదాకా ముందుకు పోనీలేదు.

  మీ పోస్టు బాగుంది.

 2. meeru cheppindi nijame! maa nannagaru vijayawada lo putti perigaru, amma telangana lo putti perigindi. Mari nenu deni gurinchi aravalo artham kavatledu 😦 sankranthi ki kostha vaipu, dussera ki telangana vaipu velli haayi ga enjoy chese nenu ippudu etu vellalanna jankutunna 😦

  • ఈ సువిశాల భారతదేశంలో మీరు ఎక్కడికైనా స్వేచ్చగా వెళ్ళచ్చు , రావచ్చు. దాన్ని అడ్డుకుంటున్న కొద్ది మందిని ఉద్దేశించి రాసిందే ఈ టపా. 🙂

 3. బావున్నాయ౦డి సలహాలు..ఈసారి వెరైటీగా మావాళ్లే భాగ్యనగర౦ వస్తున్నారు. ఎవరైనా బస్సో, ట్రైనో అపి ఎదన్నా అడిగితే ఆవేశ౦గా ఏదో ఒకటి అనెయ్యట౦ కాదు, జై తెల౦గాణ అనో లేదా జై ప్రత్యేకా౦ధ్రా అనో అన౦డి. పొరపాటున కూడా జై సమైఖ్యా౦ధ్రా అన్నరో…మీ పని అ౦తే అని భయపెట్టేసాను.. సినిమాలలో చూసి మాకు తెల౦గాణా అర్ద౦వుతు౦ది, మేము కూడా మాట్లాడగల౦ అనుకొని నొటికొచ్చిన తెల౦గాణా మాట్లాడానికి అది ఇ౦గ్లీష్ కాదు..మన ఇసాపట్న౦ యాసలో తెల౦గాణా మాట్లాడితే అక్కడే మీకు బొ౦* (kcr పెట్టేది) పెట్టెస్తారు అని ఒక రక౦గా కాదు అన్ని రకాలుగా వాళ్ళని ప్రిపేర్ చేసి ఉ౦చుతున్నాను.. 🙂 🙂

 4. మేము తెలంగాన లోనే పుట్టి పెరిగాము, వాళ్ళ సంస్క్రుతిని ఎవరు ఎప్పుడు వెక్కిరించలేదు, అందరూ ఆచరించేవాళ్ళు, ఇది కేవలం రాజకీయనాయకులు ప్రజలలో రేకెత్తిచ్చిన భావం మాత్రమే,
  ఏ భావాలని ఎక్కువగా రెచ్చగొడ్తే ప్రజలు రెచ్చిఫొతారో చూసి పధకం ప్రకారం జరుపుతున్న పన్నాగాల కుట్ర ఈ ఉద్యమం.

  • నిజమే నాకూ గోరటి వెంకన్న పాటలంటే చాలా ఇష్టం. కానీ ఆంధ్రోల్లని తరిమికొట్టండి అంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే సంస్కృతి గురించే నా బాధంతా…

 5. నా దగ్గరో మొబైల్ ఫొన్ సాఫ్ట్ వేర్ ఉంది. అది లోడ్ చేసుకుంటే మీ సెల్ లొకేషన్ బట్టి మీరు ఏం పాడాలో ఏ స్లోగన్ వాడాలో, సూచించడమే కాకుండా బ్లూ టూత్ ద్వారా మీ కారు స్పీకర్లలో ఆయా పాటలను , స్లోగన్లను మోగిస్తుంది.
  కావాలంటే సంప్రదించండి.

 6. ఉద్యమించడం చేతకానివాడా!
  మాకు ఉద్బోధలు చేస్తావా?
  రారా ! నీకూ నాలుగు నినాదాలు నేర్పిస్తా
  నా రక్తం లో సోడా కలుపుకొని తాగి జోగుతున్నవాడా!
  మత్తు దిగి తెరుచుకున్న నీ కన్ను మీద
  తెలంగాణ పటం ప్రతిబింబమవుతుంది
  అందులో నా హైదరాబాద్
  కోహినూరై మెరుస్తుంది
  – స్కై బాబ

  • దారిని వారిపోయే వాళ్ళని ఆపి జై తెలంగాణా అనమని బెదిరించడమే ఉద్యమమా?
   వాళ్ళ అబ్బ సొత్తు పెట్టి కొన్న వాహనాల్లాగా వాటి అద్దాలు పగలగొట్టడమే ఉద్యమమా?
   లక్షల రూపాయల కొన్న షూటింగ్ పరికరాలను ధ్వంసం చేయడమే ఉద్యమమా?
   నేను రాసింది ఇలాంటి వాళ్ళను ఉద్దేశించి 🙂 లైట్ తీసుకో బ్రదర్. ఉన్నమాటంటే ఉలుకెందుకు?

 7. సంక్రాంతికి తిరిగి ఇంటికెళ్తూ, హైదరాబాదులో ఉన్న మా ఆఫీసును తిరుపతికి షిఫ్ట్ చేసుకుంటున్నా. అందులో పనిచేసే కొద్దిమంది తెలంగాణా వాళ్ళను ఇష్టమైతే తిరుపతికి రండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్పాను. పాపం… వాళ్ళకన్నా, మా ఇంటి ఓనరే ఎక్కువగా బాధపడుతున్నాడు. ఆయన కూడా తెలంగాణా వాడే. ఈ టైమ్‌లో ఇళ్ళు ఖాళీచేస్తే, తిరిగి కొత్తవాళ్ళు వచ్చే ఛాన్సస్ లేవని ఆయన బాధ. ఏం చేస్తాడు పాపం…రియల్ బూమ్ వల్ల బాగా డబ్బులు రావడంతో, ఇళ్ళు కట్టుకొని వాటిని అద్దెకిచ్చి, తద్వారా వచ్చే ఆదాయంతో కాలుమీద కాలేసుకొని బ్రతుకుతున్నాడాయన. 😛 😛 😛

  • నిజమేనండీ ఇక్కడ కొంతమంది గూండాల వేధింపులు తట్టుకోలేక సినిమా వాళ్ళు వెళ్ళి ఎంచక్కా సీమాంధ్రల్లో హాయిగా షూటింగ్ చేసుకుంటున్నారట. 🙂

 8. jai telangana andamulo thappenti brother? hyderabad lo untu telangana lo untu jai telangana analante asahyinchukunte mari anni cinemaalalo vilanlaku,comedianlaku telangana yasa palikinchadam maku badha kada? Jai telangana anipinchadam udyamam lo bagame kani seemandrulani avamaninchadaniki kadu.antenduku okka vishayam cheppana gokarakaya ante vetakaranga matlade maa andhra friendse entho mandi ikkada. friends kabatti emi analemu. mukyanga andhra friends,cinemavaru yasanu vetakaranga matladakunte ilanti udyamalaku oopochedikadu

  • జగన్నాథ్ గారూ! మీలాగా అభిప్రాయం వ్యక్తం చేసేవాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. జై తెలంగాణా అంటే తప్పు లేదు, తప్పని నేనెక్కడా చెప్పలేదు. కానీ అనకపోతే తప్పా? చెప్పండి.అది వ్యక్తిగత అభిప్రాయం కదా! బలవంతంగా బెదిరించి అనిపించడం దాదాగిరీ కాదా? ఇది మనం ఖండించిన విషయం కాదా?
   సినిమాల్లో కేవలం తెలంగాణా భాషే కాదు నేను మాట్లాడే నెల్లూరు యాసను చాలా ఛండాలంగా మాట్లాడిస్తున్నారు(ముఖ్యంగా జయప్రకాష్ రెడ్డి చేత). అంత మాత్రానా ఆ ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను ఎగతాళి చేసినట్లు కాదు. ఒక్కో యాస కుండే ప్రత్యేకతలని తీసుకుని సరదాగా అలా సంభాషణలు రాస్తున్నారే తప్ప ఆయా ప్రాంతపు ప్రజలను, యాసను ఎగతాళి చేయడానికి కాదు. దీనిని ఆధారంగా చేసుకుని కొంతమంది నాయకులు ఆంధ్రా భాగో, జాగో అనడం కూడా ఎంతవరకు సమంజసం కాదు. నేను కూడా వరంగల్ లో చదివేటపుడు అన్ని ప్రాంతాల మిత్రులతో కలిసిఉండే వాడిని. మా మధ్య ఎప్పుడూ ఈ ప్రస్థావన రాలేదు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు రెచ్చగొట్టడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.

 9. మీ టాపిక్ బాగుందండి. అన్ని కామెంట్స్ కూడా చదివాను. ప్రాంతాలకతీతంగా కొంతమంది జనాలు ఎందుకు ఆలొచించ లేకపోతున్నరో నాకర్థం కావటం లేదు. “గుమ్మడి కాయల దొంగ అంటె భుజాలు తడుముకునే” వాల్లే ఎక్కువగ ఉన్నారు.
  జై తెలంగణా అంటె తప్పని ఎవరూ చెప్పలేదే ఇక్కడ? పక్కవాళ్ళు చెప్పె అభిప్రయల్ని గౌరవించి మీ గౌరవాన్ని కాపాదుకోండి.. నాయకుల (అంధ్ర అయినా తెలంగణా అయినా) మాటలు విని చెడిపొవద్దు.

వ్యాఖ్యలను మూసివేసారు.