నా తీర్మానాలేంటి?

నాకు సాధారణంగా కొత్త సంవత్సరం తీర్మానాలు అంటే పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకంటే తీర్మానాలు సంవత్సరంలో ఏ రోజులోనైనా నిరాటంకంగా చేసుకోవచ్చని నా గాఢమైన అభిప్రాయం. కానీ సమయం అనుకూలించడం వల్ల ఈ సారి మాత్రం ఒక్క విషయంలో తీర్మానం చేసుకోవాలనిపించింది.  అది ఇన్ స్క్రిప్టు నేర్చుకోవడం విషయంలో. ఇప్పటికే మొదలుపెట్టేశా కూడా. ఇకనుంచి కేవలం ఇన్ స్క్రిప్టు ను ఉపయోగించి మాత్రమే టైపు చెయ్యాలని నిర్ణయించుకున్నా.  మొదలు పెట్టిన నాలుగు రోజుల్లోనే ఒక మాదిరిగా టైప్ చెయ్యగలుగుతున్నాను. ఇంకా అలవాటైతే వేగంగా టైప్ చెయ్యగలనన్న నమ్మకం కలుగుతోంది.

ముందుగా ఈ విషయంలో నన్ను ప్రోత్సహించింది వీవెన్ గారు, తరువాత రాకేశ్వర్రావు గారు. ఇద్దరికీ ధన్యవాదాలు.

ఇన్ స్క్రిప్టు అంటే తెలియని వాళ్ళు వెంకటరమణ గారు రాసిన ఈ టపా చదవండి. ఇంకా ఏదైనా సందేహాలుంటే telugublog@googlegroups.com కి మెయిల్ పంపించండి.

ప్రకటనలు

4 thoughts on “నా తీర్మానాలేంటి?

 1. ఈ inscript ఏవిధంగా/ఎందుకు సులభమో వివరించగలరా? దీన్ని వాడటానికి ఏఇతర (third party)software అవసరం లేదని మాత్రం అర్ధం అయ్యింది.

 2. తెలుగు భాషకు యూనీకోడ్ ఎలా ప్రామాణికమైందో ఇన్‌స్క్రిప్ట్ తెలుగు కీబోర్డ్ కు అలా ప్రామాణికమైంది.
  అంటే కీబోర్డ్ లో ఉన్న ప్రతి కీ ఒక తెలుగు అక్షరంతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు “c” అని టైప్ చేస్తే “మ” అని పడుతుంది. మనం టైప్ చేసే కీ కి కనబడే అక్షరానికి తేడా ఉండటం వల్ల మొదట్లో దీన్ని ఉపయోగించి టైపు చెయ్యడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అలవాటైతే మాత్రం చాలా వేగంగా తెలుగులో టైపు చెయ్యవచ్చు. సులభం కూడా.
  ఉదహరణకు విజ్ఞానం అనే పదాన్ని
  లేఖిని లో అయితే vij~naanaM అనీ(10 అక్షరాలు),
  అదే ఇన్‌స్క్రిప్ట్ లో అయితే bf%evx అనీ(6 అక్షరాలు) టైపు చెయ్యాల్సి ఉంటుంది. అలా కీ స్ట్రోక్స్ తగ్గుతాయన్న మాట. అలాగే ఇన్‌స్క్రిప్ట్ లో ప్రతి హల్లుకు వెంటనే a అని టైప్ చెయ్యనవసరం లేదు. ఇందు వల్ల చాలా సమయం ఆదా అవుతుంది.

 3. థాంక్సండీ. కానీ… వేరే భాషలో టైప్ చెయ్యాలంటే మళ్ళీ వేరే కీ బోర్డ్‌లేఅవుట్ గుర్తుంచుకోవాలేమో.

  • అవును.. కానీ ఇదే కీ బోర్డ్ లే అవుట్ వేరే భారతీయ భాషలు కూడా అలాగే ఉండచ్చనుకుంటున్నా.. ఖచ్చితంగా తెలియదు. 🙂

వ్యాఖ్యలను మూసివేసారు.