ఈ-తెలుగు స్టాల్ కొసమెరుపులు

e-తెలుగు బృందం
e-తెలుగు బృందం

నిన్నటితో హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ముగిసింది.దాంతో పాటూ e-తెలుగు స్టాల్ కూడా. చివర్లో మేం చేసిన సందడి గురించి చెప్పకపోతే కొన్ని మధుర క్షణాలు కోల్పోయినట్లే. గతేడాది పద్మనాభం గారు మొదలు పెట్టిన సాంప్రదాయం ఈ సారీ కొనసాగించాం. స్టాల్ తెర మూసేసి లోపల గా……………..ట్టిగా జాతీయ గీతాన్ని ఆలపించాం. అలాగే స్టాల్ నిర్వహణలో సహకరించిన అందరికీ గా……….ట్టిగా ఓయేసుకున్నాం.

అంతటితో ఆగకుండా ప్రదర్శన బయటకు వచ్చి టీమిండియా విజయోత్సవం లాగా అందరం చేతులమీద చేతులేసుకుని గుంపుగూడి గా…ట్టిగా మా తెలుగు తల్లికి గీతాన్ని ఆలపించాం. మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మమ్మల్ని ఆసక్తిగా గమనించడం కనిపించింది. మొత్తమ్మీద గత ఏడాది కన్నా ఈసారి ఎక్కువ మంది ప్రజల్లోకి వెళ్ళగలిగినందుకు అందరూ సంతృప్తి చెందారు.

ప్రకటనలు

17 thoughts on “ఈ-తెలుగు స్టాల్ కొసమెరుపులు

  1. రవి చంద్ర గారు మీరు అందరూ కలసి ఈ-తెలుగు స్టాలు సమర్ధవంతంగా నిర్వహించినందుకు, విజియోత్సవ సంబరాలు మధురంగా జరుపుకున్నందుకు శుభాకాంక్షలు. మీ అందరిని కలసినందుకు చాలా ఆనందించాము. మీ ఫొటో లో సుజాత గారు మిస్ అయ్యారు. ఈ- తెలుగు దిన దినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ..

    సుధ

  2. ఇప్పుడు హైదరాబాదున్న పరిస్థితుల్లో బయటికొచ్చి గా…ట్టిగా “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” పాడారంటే మీ ధైర్యానికి, మీ భాషాభిమానానికి మిమ్మల్ని అభినందించాల్సిందే!

  3. జణగణమణ పై వివాదం “మాతెలుగుతల్లికి” “టైపు”ది కాదులేండి కాబట్టి ఫత్వాలేదు సారీ ఫర్వాలేదు 🙂

వ్యాఖ్యలను మూసివేసారు.