ఎంత మంది మిత్రులో…

నాకు ఉద్యోగం వచ్చినపుడు, నా నియామక పత్రంలో  బెంగుళూరులో చేరతారా? హైదరాబాద్ లో చేరతారా? అని అడిగారు. బెంగుళూరులో ఎంత మంది బంధువులున్నా నేను భాగ్యనగరాన్నే ఎంచుకున్నాను. ఎందుకంటే ఇక్కడైతే బాగా తెలుగు వినొచ్చు, మాట్లాడచ్చని నా ఆశ. చిన్ననాటి మిత్రులు, బంధువులు అందరూ బెంగుళూరులోనే ఉండటం వల్లా, మా స్వస్థలం శ్రీకాళహస్తి నుంచి బెంగుళూరు కేవలం ఆరుగంటల ప్రయాణమవడం మూలాన  మా ఇంట్లో వాళ్ళంతా అక్కడికే వెళ్ళమన్నారు. నేను మాత్రం అవన్నీ కాదని హైదరాబాద్ కే వచ్చేశాను.

ఒక సంవత్సరం దాకా నిస్తేజంగా గడిచిన నా జీవితంలోకి ఆరునెలల క్రితం బ్లాగు ప్రవేశించింది. తద్వారా బ్లాగర్లతో కలిగిన పరిచయాలు, వారి ద్వారా ఈ-తెలుగు పరిచయం, పుస్తక ప్రదర్శన ద్వారా వందల మందికి స్వయంగా కంప్యూటర్లలో తెలుగును స్వయంగా పరిచయం చేయడం, ఇదే ప్రదర్శనలో నేను ఇప్పటి దాకా టీవీలో మాత్రమే చూసిన కొంతమంది ప్రముఖులను, రచయితలను, రచయిత్రులను, విలేఖరులను స్వయంగా కలవడం అంతా కలలా జరిగిపోయింది. ప్రదర్శనకు వచ్చి మేము చెప్పే విషయాలు ఆసక్తిగా విన్న చాలా మంది అభిమానం, ఉత్సాహం, గౌరవం, భవిష్యత్ కార్యాచరణకు కావల్సిన బోలెడంత శక్తి నిచ్చింది. ఇప్పుడు నాకు హైదరాబాద్ లో నాకు బోలెడు మంది స్నేహితులున్నారు. అంతే కాదు నా బ్లాగుకు క్రమం తప్పకుండా వచ్చి చదివి తమ అభిప్రాయాలు వ్యక్తపరిచేవారు చాలా మంది మిత్రులయ్యారు. నేనో కొత్త ప్రపంచంలోకి ప్రవేశించడానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.


22 thoughts on “ఎంత మంది మిత్రులో…

  • మీరు భలే వారే పేర్లు మిస్సవుతాయని పేరు పేరునా అని తప్పించుకుంటే ఇప్పుడు లిస్టు రాయమంటున్నారు 🙂

 1. మీ అనుభవం చదవడానికి చాలా బాగుంది. మీరు మంచి వారు అని తెలియజేస్తుంది. కాని జగమంతా మాయ. మనిషి ఎప్పటికీ ఒంటరివాడే. ఇది నిజం.

 2. ఈ-తెలుగు స్టాలు ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం ఓ చక్కని అనుభూతి. ఒకే కంపెనీ లో పనిచేస్తూ, ఈ-తెలుగు స్టాలు ద్వారా మనం పరిచయమవ్వడం భలే అనిపించింది.
  రామకృష్ణ పరమహంస ఒక కథ చెపుతుంటారు. మందు సేవించేవారికి ఆ అలవాటు ఉన్న వాడు ఇంకడు దొరికితే తెగ సంబరపడిపోతాడుట, ఇద్దరం కలిసి ఆ మత్తులో మైమరిచిపోవచ్చని. అలానే భగవంతుడిపై అమిత భక్తివుండే వాడికి కూడా….
  నా మట్టుకు నాకు, తెలుగుపై పిచ్చి వున్న వాడికి కూడా ఇది ఖచ్చితంగా వర్తిస్తుందని అనిపిస్తుంది 🙂

 3. రవిచంద్ర గారూ! మీ సంతోషం నాక్కూడా సంతోషాన్నిస్తోంది. ‘పేరుపేరునా’ అంటూ భలే గడుసుగా తప్పించుకున్నారుగా!:)

  ఈ-తెలుగు స్టాలు ద్వారా మిమ్మల్నీ, ఇతర బ్లాగ్మిత్రుల్నీ కలుసుకోవటం నాకు గుర్తుంచుకోదగ్గ అనుభూతినిచ్చింది.

  వీవెన్ గార్ని ఈ-తెలుగు స్టాల్లో కలుసుకోగలనని ఎదురుచూశాను గానీ, కుదర్లేదు.

  • అవును మరి ఏమరు పాటులో ఏ ఒక్క పేరు తప్పిపోయినా బాగుండదని అలా చేశానన్న మాట.

   అన్నట్టు ప్రతి నెలా రెండో ఆదివారం జరిగే ఈ-తెలుగు సమావేశానికి వస్తే మీరు వీవెన్ గారిని కలుసుకోవచ్చు.

 4. వీవెన్ గారి గురించి కొంచెం వ్రాస్తారా కొన్ని సార్లు ఇక్కడె చదివా కానీ ఎవరొ తెలియదు

 5. అప్పుడప్పుడు హాస్యం గాను ఉంటూ అందరిని అలరిస్థొంది.

  ఈ-తెలుగు స్టాల్ గురించి మరియు అది సందర్సించిన ప్రముఖుల గురించి చదివాను. నిజమే వీరందరిని పత్రికలలో,టివి ల లో చూడడం తప్ప ప్రత్యక్షం గా చూడడం ఒక అనుభూతి.మీ అనుభవాలను అందరితో పంచుకున్నందుకు ధన్యవాదములు..

  ఈ-తెలుగు ద్వార భాషాసేవ చేస్తున్నందుకు అభినందనలు.

 6. అభిప్రాయాన్ని అసంపూర్ణం గా పంపించాను. పొరపాటుకి చింతిస్తున్నాను.

  నిస్తేజం ఉన్న మీ జీవితం లొకి బ్లాగ్ వచ్చి మీలొ నూతనోత్సాహన్ని నింపిందని చెప్పారు.మీ బ్లాగ్ informative గాను..స్పూర్తిదాయకం గాను ఉంది.అప్పుడప్పుడు హాస్యం తో నూ అలరిస్తున్నారు.నేను కూడా ఈ బ్లాగ్ ప్రపంచం లో కి అడుగుపెట్టి
  నా సాహిత్య అభిలాషను పెంచుకోవాలని అనుకుంటున్నాను.ఈ దిశగా అడుగులు వెయ్యడం మొదలుపెట్టాను.

  భ్లాగ్ ని చదువుతూంటె పాత బ్లాగ్లైన “ఏంత మంది మిత్రులో”,”ఈ-స్టాల్ కొస మెరుపులు”,”ఈ-స్టాల్ ని సందర్సించిన ప్రముఖులు” చదవడం జరిగింది. అభిప్రాయాన్ని పంపించాలనిపించింది.

  ఈ బ్లాగ్ ద్వారా ఇంతమంది మిత్రులను సంపాదించిన మీకు అభినందనలు.ఈ-తెలుగు స్టాల్ గురించి మరియు అది సందర్సించిన ప్రముఖుల గురించి చదివాను. నిజమే వీరందరిని పత్రికలలో,టివి ల లో చూడడం తప్ప ప్రత్యక్షం గా చూడడం ఒక అనుభూతి.మీ అనుభవాలను అందరితో పంచుకున్నందుకు ధన్యవాదములు..

  ఈ-తెలుగు ద్వారా భాషాసేవ చేస్తున్నందుకు అభినందనలు.

  • తప్పకుండా… pustakam.net లో మంచి పుస్తక సమీక్షలు వస్తుంటాయి. అక్కడ మంచి పుస్తకాలు పరిచయం అవుతాయి.

వ్యాఖ్యలను మూసివేసారు.