ప్రముఖులతో కళకళ లాడిన ఈ-తెలుగు స్టాల్

నిజానికి నేను ఈ వారాంతం మా ఊరు వెళ్ళవలసింది. గురువారం బంద్ కారణంగా బస్సులు నిలిపివేయడంతో ఇక్కడే ఉండి పోవలసి వచ్చింది. నేను ఈ ముడు రోజులు ఈ-తెలుగు స్టాల్ లో వాలంటీర్ గా పనిచేయడం భగవత్సంకల్పం కాబోలు.

ఈ రోజు స్టాల్ ను సందర్శించిన వారిలో ప్రముఖ పాటల రచయిత, జాతీయ పురస్కారం గ్రహీత సుద్దాల అశోక్ తేజ గారు, ప్రముఖ రచయిత, మెజీషియన్, వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరాం గారు, శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారు ముఖ్యులు. వీరు స్వయంగా ఈ-తెలుగు స్టాల్ ను సందర్శించి కంప్యూటర్లలో తెలుగు వాడకాన్ని ఆసక్తిగా తిలకించారు. సుద్దాల అశోక్ తేజ గారు తాను పుస్తక ప్రదర్శనకు వచ్చి ఒక విలువైన విషయాన్ని తెలుసుకొన్నాననీ, “అంతర్జాలంలో తెలుగు నన్ను ఇంద్రజాలం చేసింది” అని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే మండలి బుద్ధ ప్రసాద్ గారు  ప్రభుత్వం తరపున ఈ-తెలుగుకు కావల్సిన సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. బీవీ పట్టాభిరాం గారు కూడా తమ ఫోన్ నంబర్ ఇచ్చి స్వయంగా ఆఫీసుకు వచ్చి కలవ మన్నారు. ఇంకా ఎందరో సందర్శకులు స్టాల్ ను సందర్శించినందకును తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అధ్యాపకులు, రచయితలు, విలేఖర్లు ఇలా అనేక రంగాలకు చెందిన వ్యక్తులు స్టాలును నిర్వహిస్తున్న వారికి తమ అభినందనలు తెలియజేశారు.

ప్రముఖ రచయిత బీవీ పట్టాభిరాం గారు
ప్రముఖ రచయిత బీవీ పట్టాభిరాం గారు

స్టాల్ ను సందర్శించిన సుద్దాల అశోక్ తేజ గారు
నేను, అశోక్ తేజ గారు, సతీష్ గారు, "మంచి పుస్తకం" స్టాలు నడుపుతున్న ప్రసాద్ గారు
నేను, అశోక్ తేజ గారు, సతీష్ గారు, "మంచి పుస్తకం" స్టాలు నడుపుతున్న ప్రసాద్ గారు
శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారు
శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారు
ప్రకటనలు

29 thoughts on “ప్రముఖులతో కళకళ లాడిన ఈ-తెలుగు స్టాల్

 1. చాలా సంతోషం రవీ! మీ కంట్రిబ్యూషన్ ఈ తెలుగుస్టాల్ కి చాలా సహాయం చేసింది సుమా!

  ఈ రోజు కలుద్దాం సాయంత్రం!

  • ధన్యవాదాలు సుజాత గారూ! ఖాళీ సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకుంటున్నానంతే! తప్పకుండా కలుద్దామండీ!

 2. ఆ(.. ఆ(.. వారంతా నాకోసం వచ్చుంటారు..
  నిన్న ఒక్క రోజు నేను స్టాల్‌లో లేక పోయేసరికి కాసేపు కూర్చునిఉంటారు..

  e-తెలుగు స్టాల్‌కి చాలా పాపులారిటీ వస్తోంది బుక్ ఎగ్జిబిషన్‌లో..
  మొన్న ఎవరో అన్నట్లు.. మన స్టాల్ మత్రమే మూసేసే సమయానికి కూడా కళకళలాడుతుంది..

  ఇలాగే “అంతర్జాలంలో తెలుగు వెలుగు” పది మందికీ దారి చూపుతుందని భావిస్తున్నాను

  • అవునండీ! మీ కోసం పదే పదే అడిగారు కూడా :-).

   మీరన్నది నిజమే గార్డ్ వచ్చి విజిలేసేదాకా ఎవరూ స్టాల్ ను వదిలి వెళ్ళడం లేదు సుమా 🙂

 3. క్రితం సంవత్సరం కూడా పట్టాభిరాంగారు వచ్చినట్టు – చదివినట్టు – గుర్తు. అప్పుడు కూడా ఆఫీసు రమ్మన్నారనుకుంటా..!! ఈ సారైనా ఎవరైనా వెళ్తే బాగుంటుంది.

  • అవునండీ ఆయన గుర్తు పట్టి అడిగాడు కూడా. ఈ సారి మాత్రం ఆయన్ను తప్పకుండా వచ్చి కలుస్తామని హామీ ఇచ్చాం. చూద్దాం మన హామీ ఎంతమేరకు నెరవేరుస్తామో!!! 🙂

  • కార్తీక్ గారూ! వీరందరికీ కంప్యూటర్లలో తెలుగును గురించి తెలియజేయడం నా కెంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేనండీ!

 4. అబినందనలు,ప్రముఖులతో పాటు, మీరూ ప్రముఖులైనందుకు.స్టాల్ నిర్వాహణ చక్కగాఉంది.సందర్శకులకు ఓపికగా వివరిస్తూ, వచ్చినవారిని ఆత్మీయంగా పలకరిస్తున్నారు.నిర్వాహకులందరికీ,ధన్యవాదాలు.

 5. చాలా సంతోషం .

  ఈసారి నేను రాలేకపోయినందుకు ,మనవాళ్లందరినీ కలవలేక పోయినందుకు బాధగాఉంది.

  అందరినీ అడిగానని చెప్పండి .

  • ఒకసారి ఒక పేరుతో కామెంట్స్ ని నేను ఆమోదిస్తే అతను అదే పేరుతో మళ్ళీ కామెంట్స్ రాస్తే అవి మోడరేషన్ తో సంబంధం లేకుండా కనిపిస్తాయి. మీ కామెంట్స్ ఇదివరకే ఆమోదించి ఉన్నాను. కానీ ఈ సారి వెరుభొట్ల వెంకట గణేష్ అని రాసారు కదా. అందువల్ల మోడరేషన్ లోకి వెళ్ళిపోయింది. అన్యదా భావించకండి.

 6. కంగ్రాట్స్ రవి గారు!
  నాకు కూడా ఇలా ప్రముఖులని కుచిపూడి ప్రదర్సనల లొ కలిసినప్పుడు అనిపిస్తుంది. 🙂

 7. ee roju 20th jan; I have come across your BLOG details frame suddenly;
  found very very interesting; A small suggestion / request anukondi.. will it be possible to create/build a step-by-step frame type …i mean…how to create and go about CREATION OF A BLOG… am inspired to do so.. where / how to start dear..pl explain, if possible…like to join the stream… oka sari alochinchandi chandu garu !

  • రాయలు గారు. నా బ్లాగు మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
   http://teluguguruvu.blogspot.com/2007/08/gmail-account.html
   ఇక్కడ బ్లాగు ఎలా ప్రారంభించాలో వివరంగా వీడియోలో పొందుపరచారు. ఇది చూసిన తర్వాత కూడా మీకేదైనా అనుమానాలుంటే నాకు మెయిల్ చెయ్యండి. ఇదే వివరాలతో మీకు మెయిల్ పంపించాను. చూడండి.

వ్యాఖ్యలను మూసివేసారు.