ప్రముఖులతో కళకళ లాడిన ఈ-తెలుగు స్టాల్

నిజానికి నేను ఈ వారాంతం మా ఊరు వెళ్ళవలసింది. గురువారం బంద్ కారణంగా బస్సులు నిలిపివేయడంతో ఇక్కడే ఉండి పోవలసి వచ్చింది. నేను ఈ ముడు రోజులు ఈ-తెలుగు స్టాల్ లో వాలంటీర్ గా పనిచేయడం భగవత్సంకల్పం కాబోలు.

ఈ రోజు స్టాల్ ను సందర్శించిన వారిలో ప్రముఖ పాటల రచయిత, జాతీయ పురస్కారం గ్రహీత సుద్దాల అశోక్ తేజ గారు, ప్రముఖ రచయిత, మెజీషియన్, వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరాం గారు, శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారు ముఖ్యులు. వీరు స్వయంగా ఈ-తెలుగు స్టాల్ ను సందర్శించి కంప్యూటర్లలో తెలుగు వాడకాన్ని ఆసక్తిగా తిలకించారు. సుద్దాల అశోక్ తేజ గారు తాను పుస్తక ప్రదర్శనకు వచ్చి ఒక విలువైన విషయాన్ని తెలుసుకొన్నాననీ, “అంతర్జాలంలో తెలుగు నన్ను ఇంద్రజాలం చేసింది” అని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే మండలి బుద్ధ ప్రసాద్ గారు  ప్రభుత్వం తరపున ఈ-తెలుగుకు కావల్సిన సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. బీవీ పట్టాభిరాం గారు కూడా తమ ఫోన్ నంబర్ ఇచ్చి స్వయంగా ఆఫీసుకు వచ్చి కలవ మన్నారు. ఇంకా ఎందరో సందర్శకులు స్టాల్ ను సందర్శించినందకును తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అధ్యాపకులు, రచయితలు, విలేఖర్లు ఇలా అనేక రంగాలకు చెందిన వ్యక్తులు స్టాలును నిర్వహిస్తున్న వారికి తమ అభినందనలు తెలియజేశారు.

ప్రముఖ రచయిత బీవీ పట్టాభిరాం గారు
ప్రముఖ రచయిత బీవీ పట్టాభిరాం గారు

స్టాల్ ను సందర్శించిన సుద్దాల అశోక్ తేజ గారు
నేను, అశోక్ తేజ గారు, సతీష్ గారు, "మంచి పుస్తకం" స్టాలు నడుపుతున్న ప్రసాద్ గారు
నేను, అశోక్ తేజ గారు, సతీష్ గారు, "మంచి పుస్తకం" స్టాలు నడుపుతున్న ప్రసాద్ గారు
శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారు
శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారు