వీళ్ళు రాజకీయ నాయకులు కాదు

వీళ్ళు రాజకీయ నాయకులు కాదు
రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు
రాష్ట్రాన్ని అంధకారంలోని నెట్టేయడానికి కంకణం కట్టుకున్న శని గ్రహాలు
ప్రజల్ని పట్టి పీడిస్తున్న పిశాచాలు
మాయ మాటలతో ప్రజల్ని బురిడీ కొట్టించే క్షుద్ర మాంత్రికులు
వీళ్ళ మాటలు నమ్మొద్దు
రాష్ట్రాన్ని మరో సంక్షోభానికి గురిచేయొద్దు.

గమనిక: ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీని ఉద్దేశించి చేసినది కాదు. ప్రజల్లో విద్వేషాల్ని రెచ్చగొట్టాలని చూసే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికీ వర్తిస్తుంది.

5 thoughts on “వీళ్ళు రాజకీయ నాయకులు కాదు

 1. ఒక రాజకీయ నాయకుడు, ఒక విధ్యార్ఢి, ఒక టీచర్ విమానం లో వెల్తున్నారు ఇంతలో పయలెట్ చెప్పారు, విమానం అపాయం లో ఉన్నాది పారా చూట్ లు కట్టు కొని దూక మని
  చూడగా ఒక పారా చూట్ తక్కువగా ఉన్నది ఆ రాజకీయనాయకుడు కుర్రవాని దగ్గర ఉన్న పారా చూట్ లాక్కొని గెంతీలాడు. టీచర్ భాదపడుతూ ఒరే నేను పోయినా పరవాలేదు కానీ నీకు మంచి భవిషత్ ఉంది నువ్వు ఇది తీసుకుని గెంతీ అన్నరు.
  ” మాస్టారు అతను గాబరలో పట్టుకు పోయింది పారాచూట్ కాదు నా స్కూల్ బ్యాగ్ ”
  ఇందులో లాజిక్కులు వెతక్కండి ఇటువంటి రాజాకీయనాయకులు మన దేశాన్ని పాలిస్తున్నారు. అటువంటి వారి గురించి మన బ్లాగులో వ్రాయడం వలన మన బ్లాగు అపవిత్రం అవుతుంది
  “కూల్”

 2. ఏం చేద్దా మండీ! ఎంత రాయద్దనుకున్నా వీళ్ళు చేసే పనుల వల్ల కడుపు మండి రాయాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి టపాలు ఉండవని ఆశిస్తున్నాను.

 3. రాజకీయ నాయకులు,ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు.ప్రస్తుతంఆ ఝాఢ్యం,తటస్తంగా వుండవలసిన యూనివర్సిటీల్లోని గురువులకు, పోలీసు డిపార్టుమెంటుకూ,కోర్టుల్లోన్యాయానికై వాదన చేయాల్సిన అడ్వ..కేటులకు,అందరికీ పాకింది. జడ్జీలకూ పాకుతుందేమో.ఎవరూ ఎక్సెప్షన్ కాదు…నూతక్కి

వ్యాఖ్యలను మూసివేసారు.